కరాచీ బేకరి

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఉన్న బేకరి.

కరాచీ బేకరీ, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఉన్న బేకరి. దీని ప్రధాన స్టోర్ మొజాంజాహి మార్కెట్ సమీపంలో ఉంది.[1] దీనిని శ్రీ ఖాన్ చంద్ రామ్నాని స్థాపించాడు. హైదరాబాదులోని పేరొందిన బేకరీలలో ఇదీ ఒకటి. [2] ఇందులో ఫ్రూట్ బిస్కెట్లు, దిల్ కుష్, ప్లం కేకులు మొదలైనవి లభిస్తాయి.[3] ప్రస్తుతం హైదరాబాదు, బెంగుళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ మొదలైన ఐదు నగరాలలో కరాచీ బేకరీ ఉంది. మధ్య ప్రాచ్యం, యుకె, యుఎస్ఏ లలో నివసిస్తున్న ప్రవాస భారతీయుల వారికోసం ఉత్పత్తులు ఎగుమతులు చేయబడుతున్నాయి.

కరాచీ బేకరి
Genreస్నాక్స్
స్థాపన1953
Foundersఖాన్ చంద్ రామ్నాని
ప్రధాన కార్యాలయంమొజాంజాహి మార్కెట్, ,
Areas served
భారతదేశం
Productsబిస్కెట్, కేక్

చరిత్ర మార్చు

1947లో భారత విభజన జరిగినప్పుడు కరాచీ ప్రాంతం నుండి హైదరాబాదుకు వచ్చిన సింధీ వలసదారుడు ఖాన్ చంద్ రామ్నాని ఈ బేకరీని స్థాపించాడు.[4][5] 1953లో మొజాంజాహి మార్కెట్ లోని సీనా బేకరీ పక్కన హైదరాబాదులోని మొదటి కరాచీ బేకరీ ప్రారంభమయింది. హైదరాబాదు నగరంలోనే 23 శాఖలు ఉన్నాయి.[6]

మూలాలు మార్చు

  1. "'Will never change name & we are not leaving Mumbai,' say Karachi Bakery owners".
  2. Meet Hyderabad's Most Popular Cookies
  3. "Buoyant bakeries". The Hindu. 2002-12-23. Archived from the original on 1 September 2003. Retrieved 23 October 2014.
  4. "Long queue for that special bite - Times of India". The Times of India. Retrieved 2016-05-21.
  5. Sangeetha Devi Dundoo. "Spread the cheer". The Hindu. Retrieved 23 October 2014.
  6. "As Hyderabad's Karachi Bakery is attacked, a look at the history and success story of a neighborhood bakery".

బయటి లింకులు మార్చు