కరిష్మా కపూర్ (జననం 1974 జూన్ 25) ప్రముఖ భారతీయ సినీ నటి. ఆమె ఎక్కువగా బాలీవుడ్ లో నటించింది. ఒకప్పుడు ఆమె భారత్ లోనే అందరు నటీమణుల కన్నా ఎక్కువ రెమ్యునరేషన్ అందుకునేది.[1]  ఆమె ఎక్కువగా కథానాయిక ప్రాధాన్యత కలిగిన చిత్రాల్లో నటించేది. హిందీ సినిమాల నుండి మూస కథానాయిక పాత్రలు నిష్క్రమించాయని ఆమె పాత్రల ద్వారా అర్ధమవుతుంది.[2] ఆమె దేశంలోనే అందమైన కథానాయికగా పేరు పొందింది.[3] ఆమె కెరీర్ లో భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలుఫిల్మ్‌ఫేర్ పురస్కారాలతో పాటు ఎన్నో  పురస్కారాలు అందుకొంది. 

కపూర్ కుటుంబానికి చెందిన కరిష్మా, ముంబైలో పుట్టి, పెరిగింది. ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల్లో చాలా మంది సినీ రంగంలో పనిచేశారు. ఆమె కుటుంబం సినీ రంగానికి చెందినదే అయినా, ఆమె తండ్రికి ఆడవారు సినిమాల్లోకి రావడం ఇష్టం లేదు. అందుకే కరిష్మా తల్లితో విడిపోయాడు.[2]

మూలాలుసవరించు

  1. http://bradforu.tripod.com/salary.htm Salaries of Bollywood Stars
  2. 2.0 2.1 "Karisma Kapoor: 10 things you didn't know". The Times of India. Retrieved 1 May 2016.
  3. Star of The Week: Karisma Kapoor. rediff.com. URL accessed on 1 May 2016.