కర్నాటి లింగయ్య

కర్నాటి లింగయ్య అర్థశాస్త్రంలో విశ్రాంత అధ్యాపకుడు, ప్రముఖ సాహితీవేత్త.

కర్నాటి లింగయ్య

జీవిత విశేషాలుసవరించు

కర్నాటి లింగయ్య 1944, జూన్ 19వ తేదీన తెలంగాణ రాష్ట్రం, నల్లగొండ జిల్లా, కనగల్ మండలం, నరసింహాపూర్ గ్రామంలో చెన్నయ్య వెంకమ్మ దంపతులకు జన్మించాడు. అర్థశాస్త్రంలో స్నాతకోత్తర పట్టాను, ఎం.ఫిల్ పట్టాను ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పొందాడు. పి.హెచ్.డి కాకతీయ విశ్వవిద్యాలయం నుండి 1987లో సంపాదించాడు. ఇతడు 1971లో నల్గొండ బాలికల జూనియర్ కళాశాలలో లెక్చరర్‌గా ఉద్యోగం ప్రారంభించి, మంచిర్యాల, హైదరాబాదు, సికిందరాబాదులలో పలు కళాశాలలో పనిచేసి పదవీ విరమణ గావించాడు. ఇతనికి 1984లో రాష్ట్రప్రభుత్వం రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుతో సత్కరించింది. ఇతడు అర్థశాస్త్రంపై ఆంగ్లంలో 17 గ్రంథాలను రచించాడు. ఇవి దేశవ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాలలో పాఠ్యగ్రంథాలుగా ఉన్నాయి. ఇతడు పలు సెమినార్లలో అర్థశాస్త్ర సంబంధమై ప్రసంగాలు చేశాడు. ఇతనికి తెలుగు సాహిత్యంపై కూడా ఆసక్తి ఉంది. తెలుగులో కూడా ఎన్నో రచనలు చేశాడు[1].

రచనలుసవరించు

 1. విరిసిన మొగ్గలు
 2. మరో వసంతం
 3. మంచి కోసం
 4. తెలుగు తల్లి వెలుగు పందిరి
 5. ఎందరో దేశభక్తులు
 6. మనోరథం
 7. జీవన సత్యం
 8. కోనసీమ తుఫాన్
 9. స్నేహ దీప్తి
 10. జన్మభూమి గీతాలు
 11. శ్రీ రంగనాథ శతకం
 12. మావూరు
 13. శ్రీ వరద వేంకటేశ
 14. కొణిజేటి మీకు మీరే సాటి
 15. శ్రీకృష్ణ దివ్యలీలలు
 16. నిత్యపారాయణ శ్లోకములు
 17. శ్రీ పరమానంద దాయక శ్రీ రంగనాథ
 18. శ్రీ పార్వతీ వల్లభ! శివా! మాంపాహి సదా !
 19. నానీల పుష్పాలు

పురస్కారాలుసవరించు

 • ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం - ఆం.ప్ర.రాష్ట్రప్రభుత్వం వారిచే- 1984
 • యువకవి పురస్కారం - వాసవి క్లబ్ -హైదరాబాద్ -1985
 • ఉత్తమ రచయిత పురస్కారం - నందనవనం సాహితీ సమితి - హైదరాబాద్ - 1987
 • ఉత్తమ సంఘసేవకుడు - ఆర్యవైశ్య మహాసభ - హైదరాబాదు - 1988
 • ఎడ్యుకేషనల్ ఎక్సలెన్స్ - మిలీనియం అవార్డు - ఉస్మానియా యూనివర్శిటీ ఎంప్లాయీస్ కల్చరల్ అసోసియేషన్ - 2000

మూలాలుసవరించు