మంచిర్యాల
మంచిర్యాల, తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లా, మంచిర్యాల మండలానికి చెందిన నగరం. మంచిర్యాల నగరం గోదావరి నది ఒడ్డున ఉత్తర భాగంలో ఉంది. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత ఆదిలాబాద్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది.[2] మంచిర్యాల పారిశ్రామికంగా అభివృద్ధి చెందినది ఇక్కడ బొగ్గు గనులు ఎక్కువగా ఉండడం వల్ల సింగరేణి వెలసిల్లింది.[3]
Mancherial | |
---|---|
City | |
Coordinates: 18°52′17.0″N 79°26′39.5″E / 18.871389°N 79.444306°E | |
Country | India |
State | Telangana |
District | Mancherial |
Government | |
• Type | Municipal Council Mancherial |
• Body | Mancherial Municipality |
విస్తీర్ణం | |
• Total | 90 కి.మీ2 (30 చ. మై) |
• Rank | 14th (Telangana) |
Elevation | 173 మీ (568 అ.) |
జనాభా (2018)[1] | |
• Total | 1,10,000 |
• జనసాంద్రత | 1,200/కి.మీ2 (3,200/చ. మై.) |
Languages | |
• Telugu,Urdu | Telugu |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 504208 |
Vehicle registration | TS 19 |
Assembly constituency | Mancherial |
Lok Sabha constituency | Peddapalli |
Major highways | Rajiv Rahadari NH 63 NH 363 |
నీటి సరఫరా
మార్చుగ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది. చెరువు ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా జరుగుతుంది
విద్యుత్ సరఫరా
మార్చుతెలంగాణరాష్ట్ర వేర్పాటు తరువాత వ్యవసాయ, వాణిజ్య అవసరరాలకు 24 గంటల విద్యుత్ సరఫరా జరుగుతున్నది.
గణాంకాలు
మార్చు2011 భారత జనాభా గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 1,95,228 - పురుషులు 99,597 - స్త్రీలు 95,631
రవాణా
మార్చురైలు మార్గం:
మంచిర్యాల రైల్వే స్టేషన్ కాజీపేట-బల్హర్షా సెక్షన్ సికింద్రాబాద్ రైల్వే డివిజన్‌లో మంచిర్యాల్ రైల్వే స్టేషన్ అత్యంత రద్దీగా ఉండే స్టేషన్, ఇది దక్షిణ మద్య రైల్వే లోని ఐదు 'A' కేటగిరీ స్టేషన్‌లలో ఒకటి.
గ్రాండ్ ట్రంక్ లైన్ ( ఢిల్లీ-చెన్నై) పిలువబడే పొడవైన రైలు మార్గంలో మంచిర్యాల ఉంది. ఇది భారతదేశంలోని వివిధ పట్టణాలు/నగరాల నుండి రైలు ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది. ఇది దక్షిణ మద్య రైల్వే పరిదిలోకి వస్తుంది. 1929లో కాజీపేట - బల్హర్షా లింక్‌ను పూర్తి చేయడంతో, చెన్నై నేరుగా ఢిల్లీతో అనుసంధానించబడింది . [1] దీనికి 3 ప్లాట్‌ఫారమ్‌లు ఉన్నాయి. మందమర్రి (14 కి.మీ), లక్సెట్టిపేట్ (26 కి.మీ), రామకృష్ణాపూర్ (8 కి.మీ), చెన్నూర్ (40 కి.మీ), జైపూర్ పవర్ ప్లాంట్ (17 కి.మీ ) వంటి ఇతర ప్రధాన పట్టణాలకు సమీపంలో ఉండటంతో పాటు జనాభా కారణంగా ఇది ఆగిపోవడానికి మంచి సంభావ్య స్టేషన్. )
రోడ్డు మార్గం:
తెలంగాణరాష్ట్రరోడ్డురవాణాసంస్థ TSRTC మంచిర్యాలలో తన బస్ డిపోను కలిగి ఉంది, ఇది మంచిర్యాల జిల్లాలోని ప్రతి గ్రామం, నగరానికి పౌరులకు రవాణా సౌకర్యాన్ని కలుపుతుంది.
మంచిర్యాల నుంచి చంద్రాపూర్ వరకు కొత్త జాతీయరహదారి 363 ని నిర్మించారు. అలాగే జైపూర్ మండలం నుంచి మంథని, భూపాలపల్లి మీదుగా వరంగల్ వరకు మరో కొత్త రహదారి మంజూరైంది. ఈ రహదారికి NHAI గ్రీన్ ఇండస్ట్రియల్ కారిడార్, నాగపూర్ - విజయవాడ ఎకనామిక్ కారిడార్ అని పేరు పెట్టింది.
పట్టణం గుండా వెళ్ళే ప్రధాన రహదారులు క్రిందివి:
రాజీవ్ రహదారి - మంచిర్యాల నుండి కరీంనగర్ మీదుగా హైదరాబాద్ వరకు
జాతీయరహదారి63 - ఒరిస్సా రాష్ట్రంలోని బోరిగామ నుండి జగ్దల్‌పూర్, మంచిర్యాల, నిజామాబాద్, బోధన్ మీదుగా మహారాష్ట్ర లోని లాతూర్ వరకు ఉంది ఈ జాతీయ రహదారి మంచిర్యాల గుండా వెళుతుంది.
జాతీయరహదారి 363 - మంచిర్యాల నుండి ఆసిఫాబాద్ మీదుగా తెలంగాణ/ మహారాష్ట్ర సరిహద్దు వరకు
వ్యవసాయం, పంటలు
మార్చుమంచిర్యాల మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 3633 హెక్టార్లు, రబీలో 1294 హెక్టార్లు. ప్రధాన పంటలు వరి, మొక్కజొన్న, జొన్నలు.[4]
కలెక్టరేట్ నూతన భవన సముదాయం
మార్చుజిల్లాస్థాయి శాఖల అధికారులు ఉండేలా మంచిర్యాల పట్టణంలో 26.24 ఎకరాల్లో 41 కోట్ల రూపాయలతో గ్రౌండ్ ఫ్లోర్‌తోపాటు పైన రెండు అంతస్తులు ఉండేలా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నిర్మించబడింది. కింది అంతస్తులో కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ల కార్యాలయాలు, రెండు వెయిటింగ్ హాల్స్, రెండు వీడియోకాన్ఫరెన్స్ హాల్స్, అధికారుల సహాయకులకు రెండు ప్రత్యేక గదులు, దాదాపు 500 మందితో ఒకేసారి సమావేశం నిర్వహించేలా సువిశాల కాన్ఫరెన్స్ హాల్‌ను నిర్మించారు. మొదటి అంతస్తులో వివిధ శాఖల కార్యాలయాలు ఏర్పాటు చేయబడ్డాయి.
2023, జూన్ 9న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కలెక్టరేట్ నూతన భవన సముదాయాన్ని (సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం) ప్రారంభించాడు. కార్యాలయానికి చేరుకున్న కేసీఆర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించాడు. ఆ తర్వాత కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించి, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నాడు. అనంతరం ఛాంబర్‌లో కలెక్టర్ ఉదయ్ కుమార్‌ను కుర్చీలో కూర్చుండబెట్టి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపాడు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖామంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, దేవాదాయ శాఖామంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, బీసి సంక్షేమ శాఖామంత్రి గంగుల కమలాకర్, పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఆదిలాబాదు ఎమ్మెల్యే జోగు రామన్న, ఖానాపూర్ ఎమ్మెల్యే ఆజ్మీరా రేఖా నాయక్‌తోపాటు జిల్లా ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[5][6]
ప్రముఖులు
మార్చు- శ్రేష్ఠ - (తెలుగు సినీ పాటల రచయిత్రి)
శాసనసభ నియోజకవర్గం
మార్చు- పూర్తి వ్యాసం మంచిర్యాల శాసనసభ నియోజకవర్గంలో చూడండి.
దర్శనీయ ప్రదేశాలు
మార్చు- ప్రాణహిత వన్యప్రాణుల అభయారణ్యం: మంచిర్యాలకు 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. గోదావరి నది ఉపనది అయిన ప్రాణహిత నది ఈ అభయారణ్యం మీదుగా ప్రవహిస్తోంది.[7][8]
- కవ్వాల్ వన్యప్రాణుల అభయారణ్యం తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లా, జన్నారం మండలం, కవల్ గ్రామ సమీపంలో ఉన్న వన్యప్రాణుల అభయారణ్యం.[9] ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని పురాతన అభయారణ్యమైన కవ్వాల్ వన్యప్రాణుల అభయారణ్యాన్ని 2012లో భారత ప్రభుత్వం పులుల సంరక్షణ కేంద్రంగా ప్రకటించింది.[10] ఈ అభయారణ్యానికి దక్షిణ దిశగా ప్రవహిస్తున్న గోదావరి, కడెం నదులకు పరీవాహక ప్రాంతంలో ఉంది.[11]
- శివ్వారం వన్యప్రాణుల అభయారణ్యం తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లా, జైపూర్ మండలం, శివ్వారం గ్రామ సమీపంలో ఉన్న వన్యప్రాణుల అభయారణ్యం. ఇది మంథని నుండి 10 కి.మీ., పెద్దపల్లి నుండి 40 కి.మీ., కరీంనగర్ నుండి 80 కి.మీ., గోదావరిఖని నుండి 30 కి.మీ. దూరంలో ఉంది.[8]
- గాంధారి ఖిల్లా తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా లోని మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామంలో ఉంది.
ఇది గోండు రాజులు పరిపాలించిన కోట
విద్యాసంస్థలు
మార్చు- మంచిర్యాల ప్రభుత్వ వైద్య కళాశాల: 2021లో ఏర్పాటుచేయబడిన ఈ వైద్య కళాశాలకు 2022-23 విద్యా సంవత్సరానికి 150 ఎంబిబిఎస్ సీట్లకు అనుమతి లభించింది.[12]
మూలాలు
మార్చు- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;about
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ "మంచిర్యాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 222 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 222
- ↑ "Mancherial: సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్". EENADU. 2023-06-09. Archived from the original on 2023-06-10. Retrieved 2023-06-10.
- ↑ Velugu, V6 (2023-06-09). "మంచిర్యాల జిల్లా కలెక్టరేట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్". V6 Velugu. Archived from the original on 2023-06-10. Retrieved 2023-06-10.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ ఈనాడు, తెలంగాణ (12 November 2017). "ప్రకృతి ఒడిలో వన్యప్రాణులు". Archived from the original on 22 ఏప్రిల్ 2020. Retrieved 22 April 2020.
- ↑ 8.0 8.1 సాక్షి, ఎడ్యుకేషన్ (30 August 2016). "వన్యప్రాణి సంరక్షణా కేంద్రాలు". Sakshi. Archived from the original on 22 ఏప్రిల్ 2020. Retrieved 22 April 2020. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; "వన్యప్రాణి సంరక్షణా కేంద్రాలు" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ "Kawal to be developed as eco-tourism centre". The Times of India. 4 November 2011. Archived from the original on 5 ఆగస్టు 2013. Retrieved 26 April 2020.
- ↑ "Kawal Wildlife Sanctuary declared tiger reserve". The Hindu. 4 November 2012. Retrieved 26 April 2020.
- ↑ "Kawal Wildlife Tiger Reserve". forests.telangana.gov.in. Archived from the original on 10 September 2019. Retrieved 26 April 2020.
- ↑ Today, Telangana (2022-11-03). "Telangana: Mancherial govt medical college gets nod to take up admissions". Telangana Today. Archived from the original on 2022-11-03. Retrieved 2022-11-16.