కర్మంది వివరణం
వికీపీడియా తొలగింపు విధానం ప్రకారం ఈ పేజీని తొలగించాలి. కారణమేంటంటే: ఈ వ్యాసం సృష్టించి సుమారు 9 సంవత్సరాలకు పైగా అయింది.అసలు ఆలయం మంధని మండలంలో ఉందని మాత్రమే రాసారు. అలయం ఉన్న స్థానం సరిగా ఉదహరించలేదు.ఇప్పటివరకు ఎటువంటి మూలాలు లేవు. మూలాలు చేర్చటానికి ప్రయత్నించగా లభ్యం కాలేదు. ఒక వారం రోజులలోపు సరియైన మూలాలలతో విస్తరించనియెడల తొలగించటానికి ప్రతిపాదిస్తున్నాను. ఈ ప్రతిపాదనపై మీ అభిప్రాయాన్ని వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/కర్మంది వివరణం పేజీలో రాయండి. |
ఇది ఒక వ్యాకరణగ్రంథము. దీనిని కర్మందుడు వ్రాసినట్లు తెలుస్తుది. అవైయాకరణులయిన శిష్యుల కొరకు వ్యక్తావధూత, క్రాంతదర్సియగు భగవాన్ కర్మందుడు తన భిక్షుసూత్రమునకు పూర్వవృత్తమయిన వ్యాకరణ సూత్రములు కొన్ని రచించినట్లు సన్యాసి సంప్రదాయమున ఉంది. ఇందు భిక్షుసూత్రాంసములు పెక్కు ఉన్నాయి. ఇది కేవలము జనశ్రుతికాదు. కవీంద్రాచార్య సూచీపత్రమున వ్యాకరణ ప్రస్తావనలో కర్మంది వివరణ నామకగ్రంధోల్లేఖనము ఉంది. కవీంద్రాచార్యుడు సన్యాసి అని, గ్రంథముఈ గ్రంథముమూలముగా తెలిసింది. కర్మందప్రోక్తవ్యాకరణ సంబంధిసూత్రములు భిక్షుసూత్రముకంటె భిన్నముగా భావించువారు ఈగ్రంథమును కార్మందవివరణ అని అంటారు.
సరస్వతీదేవి ప్రథమమున కర్మందునికి ఈ సూత్రములు ఇచ్చెనని, అనుభూతిస్వరూపాచార్యునికి పూర్వుడగు పరివ్రాజకనరేంద్రాచార్యుడు ఈ సూత్రము లన్నింటికిని కూర్చి, స్వకీయవృత్తివార్తికాదులతో కలిపి సారస్వతవ్యాకరణమను పేరిట వేరగుది రచించినని కొందరౌ అంటారు. దీనికి పూర్వము ఈగ్రంథముసన్యాసుల దగ్గెర ఉండేది.
"కర్మందకృశాశ్వాదినిః" (అష్టా-4-3-111) సూత్రమువలన కర్మందమస్కరి పాణినికి పూర్వుడని తెలియుచున్నది. కర్మందుని భిక్షుసూత్రము వ్యాసుని భిక్షుసూత్రముకంటె పూర్వమని కొందరందురు. వ్యాసుని భిక్షుసూత్రమునకు తరువాత మరియొక భిక్షుసూత్రము ప్రకటిత కాలేదు.