కళరిపయట్టు

కేరళలో ఆవిర్భవించిన యుద్ధక్రీడ
(కలరిపయట్టు నుండి దారిమార్పు చెందింది)

కళరిపయట్టు లేదా కళరి కేరళ రాష్ట్రంలో ఆవిర్భవించిన ఒక ద్రవిడ యుద్ధ క్రీడ.[1] దీన్ని ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన యుద్ధ క్రీడగా అభివర్ణిస్తారు.[2] దీన్ని కేరళలోనే కాక పక్క రాష్ట్రమైన తమిళనాడు లో, శ్రీలంక లో, మలేషియా లోని మలయాళీలు కూడా ప్రదర్శిస్తారు.[3]

కళరిలో ఒక భంగిమను ప్రదర్శిస్తున్న యోధుడు

పదం పుట్టుకసవరించు

మలయాళంలో కళరి అంటే పాఠశాల లేదా వ్యాయామశాల అని అర్థం. పయట్టు అంటే యుద్ధం, వ్యాయామం, లేదా కఠిన శ్రమతో కూడిన పని అర్థం. కళరిపయట్టు అనే పదం ఈ రెండు పదాల కలయిక వల్ల ఉద్భవించింది.

చరిత్రసవరించు

పరశురాముడు ఈ యుద్ధక్రీడకు ఆధ్యుడిగా భావిస్తారు. కలరి నిర్మించేటపుడు వాస్తుశాస్త్ర పద్ధతులను కచ్చితంగా పాటించాలి. మంత్ర శాస్త్రము, తంత్ర శాస్త్రము, మర్మ శాస్త్రము మొదలైన వాటిని కలరిలో శక్తులను బ్యాలన్స్ చెయ్యడానికి వాడతారు. భారతదేశంలోని ఇతర కళలాగానే ఇది కూడా మానవుని ఆధ్యాత్మిక ఉన్నతికి, ఆత్మ సాక్షాత్కారానికి దోహదపడుతుంది.

పునరుజ్జీవనంసవరించు

కొంతకాలం పాటు మరుగున పడ్డ ఈ కళ 1920 వ దశకంలో కేరళలోని తలస్సేరిలో పురాతన విద్యలను మరల వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నాల్లో భాగంగా ప్రాచుర్యం పొందింది. అప్పుడే ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో కూడా యుద్ధవిద్యలపై మక్కువ పెరగడంతో 1970 వరకు ఈ కృషి సాగుతూ వచ్చింది.[1] సినిమాల్లో కూడా ఈ కళను ప్రదర్శించడం ప్రారంభించారు.

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. 1.0 1.1 Zarrilli, Phillip B. (1992). "To Heal and/or To Harm: The Vital Spots (Marmmam/Varmam) in Two South Indian Martial Traditions Part I: Focus on Kerala's Kalarippayattu". Journal of Asian Martial Arts. 1 (1).
  2. Kalaripayatta- Discovery Channel
  3. Zarrilli, Phillip B. (1998). When the Body Becomes All Eyes: Paradigms, Discourses and Practices of Power in Kalarippayattu, a South Indian Martial Art. Oxford: Oxford University Press.