కలిదిండి బి.ఆర్.వర్మ (జననం జూన్ 1, 1950) భారతీయ భౌతికశాస్త్రవేత్త. ఆయన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడు.[1] ఆయన 1981లో చెన్నైలోని మద్రాసు విశ్వవిద్యాలయం నుండి భౌతికశాస్త్రంలో పి.హెచ్.డి పొందాడు. ఆయన అమెరికా సంయుక్త రాష్ట్రాలలొని స్ట్రాత్‌క్లైడ్ విశ్వవిద్యాలయం నుండి ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీలో పోస్టు డాక్టరల్ పరిశోధకునిగా ఉన్నాడు. ఆ తర్వాత ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో చేరాడు. అచట మెటీరియల్స్ రిసెర్చ్ సెంటర్ కు ప్రొఫెసరుగా పనిచేసాడు. ప్రస్తుతం ఆయన శ్రీ సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆప్ హయ్యర్ లెర్నింగ్ కు ఉప కులపతి గా ఉన్నాడు.

కలిదిండి బి. ఆర్. వర్మ
జననం (1950-06-01) 1950 జూన్ 1 (వయస్సు: 70  సంవత్సరాలు)
ఆంధ్రప్రదేశ్
రంగములుమెటీరియల్ సైన్సు
విద్యాసంస్థలుశ్రీ సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లర్నింగ్ కు ఉపకులపతి
పూర్వ విద్యార్థిపి. ఎస్. జి. కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ

ఆయన పరిశోధనలలో ముఖ్యంగా డైఎలక్ట్రిక్స్, ఫెర్రో ఎలక్ట్రిక్స్, నాన్-లీనియర్ ఆప్టిక్స్ వంటివి ముఖ్యమైనవి. ఆయన సిరామిక్స్, గ్లాస్ నానో క్రిస్టల్ కంపోసిట్స్, సింగిల్ క్రిస్టల్స్ మొదలగువటిపై కూడా దృష్టి పెట్టాడు. అయన అంతర్జాతీయ జర్నల్స్ లో సుమారు 200 పరిశోధనా పత్రాలను ప్రచురించారు.

మూలాలుసవరించు

  1. "FACULTY - K. B. R. Varma, Professor". Materials Research Center, Indian Institute of Science. మూలం నుండి 1 అక్టోబర్ 2011 న ఆర్కైవు చేసారు. Retrieved 13 June 2011. Cite web requires |website= (help)