కలియుగం
(కలియుగము నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
కలి యుగం (దేవనాగరి: कली युग) హిందూ పురాణాలననుసరించి మహాయుగములోని చివరి, నాలుగవ యుగం. ఇది ప్రస్తుతం నడుస్తున్న యుగం. వేదాల ననుసరించి యుగాలు నాలుగు,
- సత్యయుగం
- త్రేతాయుగం
- ద్వాపరయుగం
- కలియుగము
కలి యుగం కాల పరిమాణం 432000 సంవత్సరములు, అందు సుమారుగా ఐదు వేల సంవత్సరాలు గడిచిపోయాయి. హిందూ, బౌద్ధ కాలమానములకు ఆధార గ్రంథమైన సూర్య సిద్ధాంత ప్రకారం సా.శ.పూ. 3102 ఫిబ్రవరి 18 అర్ధరాత్రి (00:00) కలియుగం ప్రారంభమైంది. కృష్ణుడు సరిగ్గా అదే సమయానికి అవతారంను చాలించాడని హిందువులు భావిస్తారు. కలియుగాంతంలో కల్కి రూపంలో భగవంతుడు అవతరించి తిరిగి సత్య యుగ స్థాపనకు మార్గం సుగమం చేస్తాడు .
కలియుగ లక్షణాలుసవరించు
కలియుగంలో అంతా అధర్మమే. అంతా అన్యాయమే. మంచి వాళ్ళకు చెడు ఎదురవుతూ ఉంటుంది. అసలు భగవంతుడిని తలచుకొనే వారే కనిపించరు. సంసారంలో భార్యాపుత్రులు, ధనధాన్యాలు లాంటి వన్నీ సులభంగా సమకూరతాయి.