కల్కి కృష్ణమూర్తి
రామస్వామి అయ్యర్ కృష్ణమూర్తి (1899 సెప్టెంబరు 9 – 1954 డిసెంబరు 5), "కల్కి" కలం పేరుతో సుపరిచితుడు. అతడు తమిళ రచయిత, జర్నలిస్టు, రచయిత, విమర్శకుడు, భారత స్వాతంత్ర్య సమరయోధుదు.
ఆర్. కృష్ణమూర్తి | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | రామస్వామి అయ్యర్ కృష్ణమూర్తి 1899 సెప్టెంబరు 9 పూతమంగళం, (మానల్మేడు దగ్గర) |
మరణం | 1954 డిసెంబరు 5 చెన్నై, భారతదేశము | (వయసు 55)
కలం పేరు | కల్కి తమిళం: கல்கி |
వృత్తి | జర్నలిస్టు, విమర్శకుడు , రచయిత. |
జాతీయత | భారతీయుడు |
విద్య | ఉన్నత పాఠశాల |
పూర్వవిద్యార్థి | నేషనల్ హైస్కూలు, తిరుచ్చి |
కాలం | 1899–1954 |
రచనా రంగం | చారిత్రాత్మక కల్పన, సాంఘిక కల్పన |
గుర్తింపునిచ్చిన రచనలు | పొన్నియిన్ సెల్వన్, శివగామియిన్ శబ్దం |
పురస్కారాలు | "అలాయ్ ఒసాయ్" కు సాహిత్య అకాడమీ పురస్కారం. |
జీవిత భాగస్వామి | కళ్యాణి |
సంతానం | కల్కి రాజేంద్రన్ & ఆనంది రామచంద్రన్ |
ఆయనకు మహావిష్ణువు 10 వ అవతారంగా భావిస్తున్న కల్కి పేరును పెట్టారు.[1] అతడి రచనలలో 120 లఘు కథలు, 10 నవలలు, 3 చారిత్రిక ప్రేమ కథలు, సంపాదకీయాలు, రాజకీయ రచనలు ఉన్నాయి. అనేక వందల సంఖ్యలో సినిమా, సంగీత సమీక్షలున్నాయి.
ప్రారంభ జీవితం
మార్చుఅతడి తండ్రి రామస్వామి అయ్యర్. అతని తండ్రి మద్రాసు ప్రెసిడెన్సీ లోని పాత తంజావూరు జిల్లాకు చెందిన పుట్టమంగళం జిల్లాలో అకౌంటెంట్ గా పనిచేసేవాడు. అతడు ప్రాథమిక విద్యను తన స్వంత గ్రామంలో, ఉన్నత విద్యను మాయావరం లోని మ్యునిసిపల్ హైస్కూల్ లో 1921లో పూర్తి చేసాడు. పాఠశాల విద్యను పూర్తి చేసిన తరువాత 1921 లో మహాత్మా గాంధీ ఆధ్వర్యంలో జరుగుతున్న సహాయనిరాకరణోద్యమంలో పాల్గొన్నాడు.[2][3]
జీవితం
మార్చు1923 లో అతడు "నవశక్తి" పత్రికకు సబ్-ఎడిటర్ గా చేరాడు. ఆ పత్రిక ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, తమిళ పండితుడు "తిరు వి.కళ్యాణసుందరం" ద్వారా నడుపబడుతుండేది. కృష్ణమూర్తి రాసిన మొదటి పుస్తకం 1928 లో ప్రచురింపబడింది. 1928 లో నవశక్తిని వదలి రాజగోపాలచారితో కలసి సేలం జిల్లాలోని తిరుచెన్‌గొడెలోగల మహాత్మాగాంధీ ఆశ్రమంలో గడిపాడు. అచట తమిళ జర్నల్ "విమోచనం"కు ఎడిటింగ్ చేసేవాడు. 1931 లో అతడు మరల ఆరు నెలల పాటు జైలు శిక్ష అనుభవించాడు. తరువాత సంవత్సరం ఎస్.ఎస్.వాసన్ ద్వారా నడుపబడుతున్న "ఆనంద వికటన్" అనే హాస్య వార పత్రికలో చేరాడు.
అతడు "కల్కి", "రా.కి", "తమిళ్ తెన్ని", "కర్ణాటకం" వంతి కలం పేర్లతో రాసేవాడు. వికటన్ పత్రిక అతడు రాసిన అనేక లఘు కథలు, నవలలను ప్రచురించింది. 1941లో అతడు "ఆనంద వికటన్"ను వదలి మరల స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నాడు. జైలు శిక్ష అనుభవించాడు.
జైల నుండి విడుదలైన తరువాత మూడు నెలల తరువాత "కల్కి" పేరుతో పత్రికను ప్రారంభించాడు. ఈ పత్రికకు అతడు 1954, డిసెంబరు 5 న తాను మరణించే వరకు సంపాదకునిగా కొనసాగాడు. చారిత్రాత్మక కల్పనా రచనలలో కృష్ణమూర్తి సాధించిన విజయం అసాధారణమైనది. అక్షరాస్యత స్థాయి తక్కువగా ఉన్న సమయంలో ఆంగ్లంలో చదువుకున్న తమిళులు తమిళంలో ఉన్న రచనపై ఆకర్షితులైనారు. దీని ఫలితంగా "కల్కి" యొక్క సర్క్యులేషన్ 71,000 కాపీలను చేరినది. ఇది దేశంలో అత్యధిక సర్క్యులేషన్ గల వార పత్రికగా గుర్తింపు పొందింది.
కల్కి ఎం.ఎస్.సుబ్బలక్ష్మి నటించిన సినిమా "మీరా"కు కథ, సంభాషణలు రాసాడు.
ఆతడు గాంధీజీ రాసిన "మై ఎక్స్‌పెరిమెంట్స్ విత్ ట్రూత్"ను తమిళంలో అనువదించి "సత్య సోతానై"గా ప్రచురించాడు.
నవలలు
మార్చుకల్కి "ఆలాయ్ ఓసయ్" నవలను 1948-49 లలో కల్కి పత్రికలో సీరియల్ రూపంలో ప్రచురించాడు. దీనిని 1963 లో పుస్తకంగా ప్రచురించాడు. ఈ నవలకు 1956లో సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఈ నవలలో భారత సమాజంలో వివిధ ఒడిదుడుకులను తెలియజేయడం ద్వారా ఆ కాలంలో ప్రజలపై ప్రభావం చూపింది.
అతని ఇతర నవలలు "త్యాగ భూమి", "కల్వనిన్ కడలి". ఈ రెండూ కూడా సినిమాలుగా నిర్మిపబడ్డాయి. త్యాగభూమిలో ఉప్పు సత్యాగ్రహం, మహిళా హక్కులు, అస్కృశ్యతను గూర్చి తెలియజేసాడు. ఈ నవల "ఆనంద వికటన్" పత్రికలో సీరియల్ గా ప్రచురితమైనైది. అదే కాలంలో సినిమాగా కూడా నిర్మితమైంది. కల్కి రాసిన అన్ని నవలలు మొదట సీరియల్ రూపంలోను తరువాత పుస్తకం రూపంలోను వచ్చాయి.
గౌరవాలు
మార్చు- కల్కికి గుర్తింపుగా పోస్టల్ స్టాంపును శతజయంతి ఉత్సవాల సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం విడుదల చేసింది.
- 1953లో ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ నుండి "సంగీత కళాశిఖామణి" పురస్కారం లభించింది.
మరణం
మార్చుఅతడు 1954 డిసెంబరు 5 న తన 55వ యేట టి.బి వ్యాధితో మరణించాడు. కల్కి పత్రిక 1954 డిసెంబరు 5 న ప్రచురించిన ప్రత్యేక సంచికలో శారదాదేవి గురించి అతడు రాసిన చివరి సంపాదకీయం ప్రచురింపబడింది.[4]
మూలాలు
మార్చు- ↑ Room, Adrian (2010). Dictionary of Pseudonyms: 13,000 assumed names and their origins (5 ed.). Jefferson, North Carolina: Macfarland. p. 254. ISBN 978-0-7864-4373-4. Retrieved 15 April 2013.
- ↑ Viswanathan, S. (9 October 1999). "Renaissance man". Frontline. The Hindu group. Retrieved 14 April 2013.
- ↑ Anandhi, K. "Kalki – the man behind the legend: An intimate portrait by his daughter K. Anandhi". ChennaiBest.com. Indias-Best.Com Pvt Ltd. Archived from the original on 14 ఏప్రిల్ 2013. Retrieved 15 ఏప్రిల్ 2018.
- ↑ "Sri Ramakrishna Vijayam December 2014 page 36,37". Archived from the original on 2016-11-06. Retrieved 2018-04-15.
బయటి లింకులు
మార్చు- Kalki's Ponniyin Selvan (Tamil) Wikisource (Unicode)
- Kalki's novels online, Chennailibrary.com (in Tamil)
- Ponniyin Selvan Facts and Fiction, ponniyinselvan.in
- English translation by Nandini Vijayaraghavan of Sivakamiyin Sabadham