నిత్యావసర వస్తువులలో అనవసర పదార్ధాలను కలిపి చలామణీ చేయడం నేరం. దీనినే కల్తీ చేయడం (Adulteration) అంటారు. ఈ కల్తీ వలన కొన్నిసార్లు ప్రాణాలకు ప్రమాదం కలుగుతుంది.ఆహార కల్తీ విపణిలో ఏ వస్తువుకు డిమాండ్‌ ఉంటుందో.. ఏ వస్తువుకు ధర ఎక్కువగా ఉంటుందో.. ఆ వస్తువు కల్తీ అవడానికి అవకాశాలెక్కువ. నూనె, పాలు, నెయ్యి, కారం, పప్పు దినుసులను ఎక్కువగా కల్తీ చేస్తున్నారు. ప్రమాదకరమైన రంగులేసి అమ్ముతుంటారు'

ఆహార పదార్థాలలో కల్తీ మార్చు

నూనెకల్తీ మార్చు

బ్లెండెడ్‌ వెజిటెబుల్‌ ఆయిల్‌' పేరుతో రెండు రకాల నూనెలను కలిపి విక్రయిస్తారు. 'బ్లెండెడ్‌' అనే పదాన్ని చాలా చిన్నగా ముద్రించి అమ్ముతుంటారు. ఉదాహరణకు వేరుశెనగ నూనె (80శాతం), పామాయిల్‌(20 శాతం)ను కలిపి ఒక కిలో ప్యాకెట్‌ చేస్తే.. ఏది ఎంత మోతాదులో ఉందో స్పష్టంగా కనిపించేలా ముద్రించాలి. కానీ ఉత్పత్తిదారులు తక్కువ ధర ఉన్న నూనెను ఎక్కువ మోతాదులో కలిపి.. ఆ వివరాలేవీ కనిపించకుండా 'వేరు శెనగ'ల బొమ్మలను కవర్‌పై పెద్దగా ముద్రిస్తారు. దీనివల్ల వినియోగదారు ఆర్థికంగా నష్టపోతారు.

పప్పులు కల్తీ మార్చు

పాత, దెబ్బతిన్న పప్పులను విక్రయించడానికి ఉత్పత్తిదారులు.. మిఠాయిలో వాడే రంగులను పప్పుల్లో కలుపుతారు. చేతుల్లోంచి జారిపోతూ.. నిగనిగలాడే పప్పును చూసి.. ఇది నాణ్యమైనదనుకొని వినియోగదారులు కొంటుంటారు. నిజానికి నాణ్యమైన పప్పు అంతగా మెరవదు. మినప్పప్పు విషయంలోనూ టాల్కం పౌడర్‌ను వాడుతుంటారు. మినపప్పును చేతుల్లోకి తీసుకుంటే.. చేతికి పిండి తగిలితే.. అదీ కల్తీనే.

నెయ్యి కల్తీ మార్చు

ఇందులో ఎక్కువగా వనస్పతిని కలిపి అన్ని ప్రముఖ సంస్థల పేర్లతోనూ విపణిలోకి తీసుకొస్తున్నారు. సాధారణ ఉష్ణోగతలో స్వచ్ఛమైన నెయ్యి గడ్డ కట్టదు. బాగా చల్లని వాతావరణంలో కొద్దిగా గడ్డకడుతుంది. వనస్పతిని కలిపిన నెయ్యి సాధారణ వాతావరణంలోనూ గడ్డకడుతుంది. వేడి చేస్తేగానీ కరగదు.

కారం కల్తీ మార్చు

మిరపకాయల్లో తెల్లగా, పనికిరాని వాటిని పొడిచేసే క్రమంలో దానికి ఎరుపు రంగు రావడానికి 'సూడాన్‌' రంగులు వాడుతారు.

పండ్లు కల్తీ మార్చు

మామిడి, అరటి పండ్లను ప్రత్యేక రసాయనాల్లో మగ్గబెడతారు. ఈ రసాయనాలు ఉపయోగించడం వల్ల ఆ పండ్ల పైపొర రంగు మారుతుంది. కానీ లోపల మాత్రం పచ్చిదనం అలాగే ఉంటుంది.

మాంసం కల్తీ మార్చు

పశువైద్య నిపుణుల ఆమోదముద్ర ఉన్న మేకలు, గొర్రెల మాంసాన్ని విక్రయించాల్సి ఉండగా.. అదెక్కడా అమలు కావడం లేదు

బిర్యానీ కల్తీ మార్చు

చికెన్‌, మటన్‌ బిర్యానీలు, తందూరీ చికెన్‌లలోనూ రంగులేస్తుంటారు. ముఖ్యంగా ఫాస్ట్‌ఫుడ్‌ కేంద్రాల్లో చికెన్‌ను దోరగా వేయించి, వేలాడదీసి అమ్ముతుంటారు. చిత్రమైన రంగులో మెరుస్తుంటుంది. ఇలా రంగు రావడానికి చికెన్‌పై రంగు వేస్తారు.

మిఠాయిలు కల్తీ మార్చు

వీటిలో పరిమిత స్థాయిలో రంగులేయాల్సి ఉంటుంది. కిలో పరిమాణానికి 10 మి.గ్రా. రంగు వేయాలి. చాలావరకూ ఈ ప్రమాణాలు పాటించరు. కొన్ని మిఠాయి దుకాణాల్లో నిషేధిత 'మెటానిల్‌' పసుపు రంగును జిలేబీల కోసం, 'రొడొమిన్‌ బి' పింకు రంగును పీచు మిఠాయిలకు వాడుతుంటారు.

  • చికొరీ (Chicory) గింజల్ని కాఫీ (Coffee) గింజలతో కలిపి చవకైన కాఫీ పొడిని తయారుచేయడం.
  • ఆహార పదార్థాలులో కలిపే కృత్రిమ రంగులు (Artificial colors) కలిపి ఆకర్షనీయంగా చేయడం.
  • సూడాన్ పసుపు (Sudan yellow) రంగు పసుపు గుండలోను, సూడాన్ ఎరుపు (Sudan red) రంగు మిరప గుండలోను కలపడం.పసుపు: పనికిరాని పసుపుకొమ్ములను సేకరించి, వాటిని పొడి చేసే క్రమంలో నూకలు, రంగులు వాడుతుంటారు. ఇలాంటి పసుపును సంతలు, జాతర్లలో ఎక్కువగా విక్రయిస్తుంటారు.
  • నీరు చేర్చి పాలు, సారాయి మొదలైన వాటిని పలుచగా తయారుచేయడం.
  • చెరకు రసం మొదలైనవి తేనె (Honey) లో కలపడం.

అనారోగ్య సమస్యలు మార్చు

కల్తీ ఆహారాలతో ప్రజారోగ్యం దెబ్బతింటోంది, కల్తీ ఆహారం వల్ల దీర్ఘకాలంలో మధుమేహం, అధిక రక్తపోటు వంటి అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. జీర్ణకోశ సమస్యలు, క్యాన్సర్‌ వంటి ప్రమాదకర జబ్బులకు దారితీస్తుంది. రోడ్డు పక్కన ఆహారాలను సాధ్యమైనంత వరకూ తినకపోవడమే మంచిది.

బయటి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=కల్తీ&oldid=3593472" నుండి వెలికితీశారు