సారాయి ఆంధ్ర ప్రదేశ్లో వారుణివాహినిగా పిలువబడే ఒక ఆల్కహాల్ కలిగిన మత్తు పానీయం. ఆంధ్రప్రదేశ్ ప్రతి పల్లె పల్లెలో సారాయి దుకాణాలు చూడవచ్చు.తాగి తూలి అరుగులపై పడిపోయే వారు, మద్యం మత్తులో ఇంటా, బయట ఘర్షణలకు దిగేవారి సంఖ్య అధికమవుతోంది.పనిచేసే చోటికి మొబైల్‌ షాపులూ వెళ్లిపోతున్నాయి. కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. ఆరోగ్యాలు పాడైపోతున్నాయి.ఈ మద్యం వ్యాపారంతో లబ్ధి పొందుతోంది ప్రభుత్వం, రాజకీయ నేతలు, వ్యాపారులు, వైద్యరంగం.

తయారీ విధానం

మార్చు

వివిధ రకాలైన పండ్లు / బెల్లం లను పులియ బెట్టి తద్వారా సారాయిని తయారు చేస్తారు. దీనినే వివిధ సార్లు డిస్టిలేషనుకు గురి చేసి సువాసను కలిపితే వచ్చేవే విస్కీ,బ్రాందీ, రమ్ మొదలగునవి.

సారాయి - నష్టాలు

మార్చు

మితంగా తాగినా చేటే. తగు మోతాదులో మద్యం తాగితే హృదయం పదిలంగా ఉంటుందని చెప్పడం అతిశయోక్తే అని శాస్త్రజ్ఞులు తాజాగా ప్రకటించారు. పరిమిత స్థాయిలో మద్యం తీసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుందన్న దానికి సరైన ఆధారాలు లేవని న్యూజిలాండ్‌కు చెందిన శాస్త్రజ్ఞులు తెలిపారు.మితంగా మధ్యం తాగితే హృదయ సంబంధ వ్యాధులు దగ్గరకు రావంటూ గతంలో రెండు సర్వేలు వెలువడ్డాయి. మద్యపానం వల్ల ఆరోగ్యానికి పెను అని శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. మద్యపానం వల్ల రక్తపోటుతో పాటు గుండెపోటు కూడా వచ్చే ప్రమాదముందని వారు హెచ్చరించారు. సారాయి వలన ముఖ్యంగా కాలేయము దెబ్బతింటుంది.

చూడండి

మార్చు

మూలాలు

మార్చు

వెలుపలిలంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=సారాయి&oldid=3892860" నుండి వెలికితీశారు