కల్పలత ఖండకావ్యాన్ని కవి, స్వాతంత్ర్య సమరయోధుడు గురజాడ రాఘవశర్మ రచించారు.

కల్పలత
కృతికర్త: గురజాడ రాఘవశర్మ
దేశం: భారత దేశం
భాష: తెలుగు
ప్రక్రియ: ఖండ కావ్యం
ప్రచురణ: బృందావన ప్రచురణలు
విడుదల: 1953

రచన నేపథ్యం

మార్చు

కల్పలత గ్రంథం 1953లో తొలిముద్రణ పొందింది. ఈ గ్రంథాన్ని బృందావన ప్రచురణలు (మచిలీపట్టణం) సంస్థ బృందావన ప్రసూనము శీర్షికన ఐదవ ముద్రణగా రెండవసారి ప్రచురించారు. 1955లలో పునర్ముద్రితమైంది.[1]

ఇతివృత్తం

మార్చు

భక్తి, అర్పణం, స్వాతంత్ర్య సమరం వంటివి ఈ ఖండకావ్యానికి వస్తువులుగా స్వీకరించి రచించారు.

ఇతరుల మాటలు

మార్చు
  • ఇందులో (కల్పలత ఖండకావ్యంలో) ఏ పద్యం చూసినా మెత్తగా మధురంగా ఉంటుంది. యతి ప్రాసల కోసం వెతుక్కోవడం ఉండదు. మాట్లాడుతూ ఉన్నట్లు ఉంటుంది.
- విశ్వనాథ సత్యనారాయణ, సుప్రతిష్ఠుడైన కవి, రచయిత, జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత.[2]

మూలాలు

మార్చు
  1. విశ్వనాథ అసంకలిత సాహిత్యం-పీఠికలు 1:విశ్వనాథ సత్యనారాయణ:1995 సంకలనం
  2. కల్పలత ఖండకావ్యానికి విశ్వనాథ సత్యనారాయణ వ్రాసిచ్చిన పండితాభిప్రాయము
"https://te.wikipedia.org/w/index.php?title=కల్పలత&oldid=3903220" నుండి వెలికితీశారు