గురుజాడ రాఘవశర్మ

(గురజాడ రాఘవశర్మ నుండి దారిమార్పు చెందింది)

గురుజాడ రాఘవశర్మ (ఫిబ్రవరి 11, 1899 - ఆగష్టు 8, 1987) ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, కవి, బహుగ్రంథకర్త.[1][2] ఈయన తన కవితల ద్వారా, ఉత్తేజకరమైన రచనల ద్వారా భారతదేశ ప్రజలలో స్వాతంత్ర్య కాంక్ష రగిలించినాడు. గాంధేయ మార్గాన్ని అవలంభించారు. వీరు గురజాడ అప్పారావు గారి వంశీకులు.

గురజాడ రాఘవశర్మ

జీవిత సంగ్రహం మార్చు

వీరు కృష్ణా జిల్లా ఉయ్యూరు సమీపంలోనున్న గురజాడ గ్రామంలో ఫిబ్రవరి 11, 1899 తేదీన జన్మించారు. వీరి తల్లిదండ్రులు: త్రయంబకం, వెంకమ్మ. వీరి నివాసస్థలం బందరు. వీరు వీరంకి సీతారామయ్య, సుదర్శనం నారాయణాచార్యులు, జొన్నలగడ్డ శివసుందరరావు, మండలీక వెంకటశాస్త్రి వంటి ప్రముఖుల వద్ద వివిధ శాస్త్రాలలో విద్యాభ్యాసం సాగించి మంచి పాండిత్యాన్ని సంపాదించారు. బమ్మెర పోతన తనకు ఉత్తేజాన్ని కలిగించినట్లుగా స్వయంగా చెప్పుకున్నారు. వీరు కూడా కృష్ణుని భక్తులు.

1921 లో మహాత్మాగాంధీ పిలుపు విని ఉపాధ్యాయ వృత్తిని వీడి జాతీయోద్యమంలో ప్రవేశించారు. 1930-31 మధ్యకాలంలో ఖైదీగా రాజమండ్రి, రాయవెల్లూరులలో జైలుశిక్ష అనుభవించారు. 1964లో ప్రముఖ స్వాతంత్ర్య యోధునిగా రాష్ట్రపతితో సన్మానింపబడ్డారు.

మరణం మార్చు

వీరు 1987, ఆగష్టు 8 తేదీన పరమపదించారు.

రచనలు మార్చు

మూలాలు మార్చు

  1. రాఘవశర్మ, గురజాడ, 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, రెండవ భాగము, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005, పేజీ: 472.
  2. జి., రాజరాజేశ్వరి. "కవిశేఖర్ శ్రీ గురుజాడ రాఘవ శర్మ రచనలు పరిశీలన". శోధ్ గంగ.
  3. భారత డిజిటల్ లైబ్రరీలో జాతీయ గీతాలు పుస్తక ప్రతి.