కల్పేశ్వర్

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హిందూ దేవాలయం

కల్పేశ్వర్, అనేది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని గర్వాల్ ప్రాంతంలోని సుందరమైన ఉర్గామ్ లోయలో ఎత్తులో 2,200 మీ. (7,217.8 అ.) శివునికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం. గర్వాల్ ప్రాంతంలోని ఐదు శివాలయాలను కలిగి ఉన్న పంచ కేదార్ తీర్థయాత్ర (కేదార్‌నాథ్, తుంగనాథ్, రుద్రనాథ్, మధ్యమహేశ్వర్, కల్పేశ్వర్)లలో ఇదీ ఒకటి. ఈ దేవాలయాన్ని పాండవులు నిర్మించారని నమ్ముతారు.[1][2] ఏడాది పొడవునా అందుబాటులో ఉండే ఏకైక పంచ కేదార్ దేవాలయం ఈ కల్పేశ్వర్.[1]

కల్పేశ్వర్ దేవాలయం
కల్పేశ్వర్ గుహ దేవాలయం
కల్పేశ్వర్ గుహ దేవాలయం
కల్పేశ్వర్ is located in Uttarakhand
కల్పేశ్వర్
ఉత్తరాఖండ్ లో దేవాలయం ప్రాంతం
భౌగోళికం
భౌగోళికాంశాలు30°34′37.35″N 79°25′22.49″E / 30.5770417°N 79.4229139°E / 30.5770417; 79.4229139
దేశంభారతదేశం
రాష్ట్రంఉత్తరాఖండ్
జిల్లాగర్వాల్ జిల్లా
ప్రదేశంగౌండర్‌
సంస్కృతి
దైవంశివుడు
ముఖ్యమైన పర్వాలుమహాశివరాత్రి
వాస్తుశైలి
నిర్మాణ శైలులునార్త్ ఇండియన్ - హిమాలయన్ ఆర్కిటెక్చర్
చరిత్ర, నిర్వహణ
సృష్టికర్తపాండవులు (చరిత్ర ఆధారంగా)

చరిత్ర

మార్చు
 
గర్వాల్ హిమాలయాలలో కనిపించే మంచు శిఖరాల సాయంత్రం దృశ్యం
 
నందా దేవి శిఖరం దృశ్యం

గర్వాల్ ప్రాంతం శివుడు, పంచ కేదార్ దేవాలయాల సృష్టి గురించి అనేక జానపద ఇతిహాసాలు ప్రాచూర్యంలో ఉన్నాయి.

కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు తమ దాయాదులను - కౌరవులను ఓడించి చంపిన తరువాత సోదరహత్య, బ్రాహ్మణహత్య చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవడంకోసం వారు తమ రాజ్యాధికారాన్ని తమ బంధువులకు అప్పగించి, శివుడిని ఆశీర్వాదం కోసం బయలుదేరారు. మొదట వారణాసి (కాశీ)కి వెళ్ళి కాశీ విశ్వనాథునిని వేడుకున్నారు. కానీ కురుక్షేత్ర యుద్ధంలో నిజాయితీ లేని కారణంగా శివుడు, పాండవుల ప్రార్థనలను పట్టించుకోలేదు. శివుడు నంది రూపాన్ని ధరించి, గర్వాల్ ప్రాంతంలో దాక్కున్నాడు.

వారణాసిలో శివుడు కనిపించకపోవడంతో పాండవులు గర్వాల్ హిమాలయాలకు వెళ్ళారు. అక్కడ భీముడు రెండు పర్వతాల వద్ద నిలబడి శివుని కోసం వెతకగా, గుప్తకాశి సమీపంలో ఒక ఎద్దు మేస్తున్నట్లు కనిపించింది. భీముడు వెంటనే గుర్తించి, ఎద్దును దాని తోక, వెనుక కాళ్ళను పట్టుకున్నాడు. కానీ ఎద్దురూపంలో ఉన్న శివుడు భూమిలోకి అదృశ్యమయ్యాడు. కేదార్‌నాథ్‌లో మూపురం పెరగడం, తుంగనాథ్‌లో చేతులు కనిపించడం, రుద్రనాథ్‌లో ముఖం, నాభి, మధ్యమహేశ్వర్‌లో పొత్తికడుపు, కల్పేశ్వర్ లో వెంట్రుకలు కనిపిస్తాయి. ఐదు వేర్వేరు రూపాల్లో తిరిగి కనిపించడంతో పాండవులు సంతోషించారు. శివుడిని పూజించడం కోసం ఐదు ప్రదేశాలలో దేవాలయాలను నిర్మించారు. ఆ విధంగా పాండవులు తమ పాపాల నుండి విముక్తులయ్యారు.[3]

ఎద్దు ఐదు భాగాలుగా విడిపోయి హిమాలయాలలోని గర్వాల్ ప్రాంతంలోని కేదార్ ఖండ్‌లోని ఐదు ప్రదేశాలలో కనిపించింది.[4] పంచ కేదార్ దేవాలయాలను నిర్మించిన తరువాత, పాండవులు మోక్షం కోసం కేదార్‌నాథ్‌లో ధ్యానంచేసి, యజ్ఞంచేసి, ఆపై మహాపంత్ (స్వర్గరోహిణి) అనే స్వర్గ మార్గం ద్వారా స్వర్గం లేదా మోక్షాన్ని పొందారు. పంచ కేదార్ దేవాలయాలు ఉత్తర-భారత హిమాలయ దేవాలయ నిర్మాణంలో కేదార్‌నాథ్, తుంగనాథ్, మధ్యమహేశ్వర్ దేవాలయాలు ఒకే విధంగా కనిపిస్తాయి.

పంచ కేదార్ దేవాలయాల వద్ద శివ దర్శన తీర్థయాత్రను పూర్తిచేసిన తర్వాత, బద్రీనాథ్ దేవాలయంలో విష్ణువును సందర్శించడం ఒక అలిఖిత మతపరమైన ఆచారం.[5]

భౌగోళికం

మార్చు

ఈ కల్పేశ్వర్ దేవాలయం హిమాలయ పర్వత శ్రేణులలోని ఉర్గాం లోయలో ఉర్గాం గ్రామానికి సమీపంలో ఉంది. హెలాంగ్ నుండి కల్పేశ్వర్ వరకు వంతెన మార్గంలో అలకనంద, కల్పగంగ నదుల సంగమం కనిపిస్తుంది. కల్పగంగా నది ఉర్గాం లోయ గుండా ప్రవహిస్తుంది.[6][7] ఉర్గాం లోయ దట్టమైన అటవీ ప్రాంతం. లోయలో ఆపిల్ తోటలు, బంగాళాదుంపలను విస్తృతంగా పండించే టెర్రస్ పొలాలు ఉన్నాయి.[8]

ఆదిశంకర శిష్యులైన దాస్నామీలు, గోస్సైన్‌లు ఈ దేవాలయంలో పూజారులుగా ఉన్నారు. తుంగనాథ్ వద్ద కూడా పూజారులు ఖాసియా బ్రాహ్మణులు. ఈ పూజారులు దక్షిణ భారతదేశానికి చెందినవారు; బద్రీనాథ్ వద్ద పూజించే కేరళ శాఖకు చెందిన నంబూద్రి బ్రాహ్మణులు. కేదార్‌నాథ్ వద్ద జంగమలు కర్ణాటకలోని మైసూర్‌కు చెందిన లింగాయత్‌లు. ఈ దేవాలయాలన్నింటిలో పూజా కార్యక్రమాలు ఆదిశంకరులచే రూపొందించబడ్డాయి. ఈ పూజారులు కూడా ఆదిశంకరులచే నియమించబడతారు. రుద్రనాథ్ దేవాలయంలో పూజారులు దస్నామీలు, గోసైన్లు. [9]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "Kalpeshwar". Shri Badrinath -Shri Kedarnath Temple Committee. Retrieved 2022-11-03.
  2. "Kalpeshwar: Panch Kedar- Travel Guide". chardhamyatra.org. Retrieved 2022-11-03.
  3. "Panch Kedar Yatra". Archived from the original on 24 May 2011. Retrieved 2022-11-03.
  4. "Panch Kedar Yatra". Archived from the original on 24 May 2011. Retrieved 2022-11-03.
  5. "Panch Kedar". Archived from the original on 31 August 2009. Retrieved 2022-11-03.
  6. "Sight seeing and Things to do in Kalpeshwar". Archived from the original on 20 June 2009. Retrieved 2022-11-03.
  7. "Kalpeshwar". Archived from the original on 13 August 2007. Retrieved 2022-11-03.
  8. "Trekking in India". Retrieved 2022-11-03.
  9. India and Nepal.

వెలుపలి లింకులు

మార్చు