కళాపూర్ణోదయము

తెలుగు పద్యకావ్యం
(కళాపూర్ణోదయం నుండి దారిమార్పు చెందింది)

కళాపూర్ణోదయం అష్టదిగ్గజాలలో ఒకరైన పింగళి సూరన రచించిన తెలుగు కావ్యం. దీనిని ప్రప్రథమ పరమ స్వతంత్రాంధ్ర నవలగా అభివర్ణించారు. ఇది కట్టమంచి రామలింగారెడ్డి వంటి ప్రసిద్ధ విమర్శకుల ఆదరానికి పాత్రమైన ప్రబంధం. దీనిని ఉషశ్రీ పురాణపండ తెలుగు వచనంలోనికి అనువదించారు.

పింగళి సూరన రచించిన తెలుగు కావ్యంకళాపూర్ణోదయము.ఇది తెలుగు భాషలో వచ్చిన మొదటి పద్య కావ్యమైన నవల. pdf

చరిత్ర రచనలో

మార్చు

కళాపూర్ణోదయం ప్రబంధం యొక్క కథావస్తువు రచన కాలం నాటిది కాకున్నా రచనలో అప్పటి స్థితిగతులు ప్రతిబించింది. యుద్ధానికి పోతున్న సైన్యం వర్ణన ఇందులో దొరుకుతోంది. సైన్యంతో పాటు కళాకారులు, కవులు, పండితులు, వారకాంతలు, కుటుంబం వంటి జనాన్ని తీసుకుపోయేవారు. ఇందరు వెళ్తుండడంతో ఆ సైన్యం వెళ్ళే ప్రాంతాన్ని ముందుగానే తెలుసుకుని అక్కడ వ్యాపారస్తులు గుడారాలు వేసుకుని అమ్మేవారు. అలా యుద్ధానికి వెళ్తుంటే భాగ్యవంతులు తమ ఇళ్ళలో అనుభవించే అన్ని రకాల సౌఖ్యాలు కూడా అనుభవించేవారు. ఇలా సైన్యం వెళ్తుంటే ఓ నగరమే తరలివెళ్తోందా అనిపించిస్తోందన్న వివరాలు కళాపూర్ణోదయంలో ఉన్నాయి.[1] విజయనగరాన్ని రాయల కాలంలోనూ, ఆయన అనంతరమూ చూసిన యాత్రాచరిత్రకారుడు న్యూనిజ్ వ్రాసిపెట్టిన రచనలో కూడా ఇదే విధమైన వర్ణన ఉంది.[2]

మూలాలు

మార్చు
  1. పింగళి సూరన:కళాపూర్ణోదయము. 2వ ఆశ్వాసం, పద్యాలు 85-110
  2. వెంకట శివరావు, దిగవల్లి (1944). కథలు-గాథలు (1 ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. pp. 127–140. Retrieved 1 December 2014.

బయటి లింకులు

మార్చు