కవర్ధా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కబీర్‌ధామ్ జిల్లాలోని పట్టణం, ఈ జిల్లా ముఖ్యపట్టణం. పట్ట పాలనను పురపాలక సంఘం చూస్తుంది. కవర్ధా "భోరమ్‌దేవ్ దేవాలయాని" కి ప్రసిద్ధి చెందింది.

కవర్ధా
పట్టణం
కవర్ధా is located in Chhattisgarh
కవర్ధా
కవర్ధా
ఛత్తీస్‌గఢ్ పటంలో పట్టణ స్థానం
Coordinates: 22°01′N 81°15′E / 22.02°N 81.25°E / 22.02; 81.25
దేశం India
రాష్ట్రంChhattisgarh
జిల్లాకబీర్‌ధాం
విస్తీర్ణం
 • Total2,066 కి.మీ2 (798 చ. మై)
Elevation
353 మీ (1,158 అ.)
జనాభా
 (2012)
 • Total45,451
 • జనసాంద్రత22/కి.మీ2 (57/చ. మై.)
భాషలు
 • అధికారికహిందీ, ఛత్తీస్‌గఢీ
Time zoneUTC+5:30 (IST)
PIN
491995
ప్రాంతపు కోడ్7741
Vehicle registrationCG-09

చరిత్ర

మార్చు

1751 లో మొదటి పాలకుడు మహాబలి సింగ్ కవర్ధా రాజ్యాన్ని స్థాపించాడు. బ్రిటిష్ రాజ్ సమయంలో, ఇది కవర్ధా సంస్థానానికి రాజధానిగా ఉండేది. [1] 1806 లో కబీర్ పంత్ యొక్క ఎనిమిదవ గురువైన హక్ నామ్ సాహెబ్ ఇక్కడ గురు గద్దీని స్థాపించాడు. 1936 లో స్వాతంత్ర్యానికి ముందు కవర్ధా పట్టణం మునిసిపాలిటీగా మారింది. పట్టణంలో ప్రసిద్ధ భోరమ్‌దేవ్ ఆలయం ఉంది.

భౌగోళికం

మార్చు

కవర్ధా 22°01′N 81°15′E / 22.02°N 81.25°E / 22.02; 81.25 వద్ద ఉంది. [2] సముద్రమట్టం నుండి దీని ఎత్తు 353 మీటర్లు (1,158 అ.) .

జనాభా

మార్చు

2011 భారత జనగణన ప్రకారం [3] కవర్ధాా జనాభా 44,205. జనాభాలో పురుషులు 52%, మహిళలు 48% ఉన్నారు. కవర్ధా సగటు అక్షరాస్యత 66%. ఇది జాతీయ సగటు 59.5%కంటే ఎక్కువ. పురుషుల అక్షరాస్యత 76%, స్త్రీల అక్షరాస్యత 55%. కవర్ధా జనాభాలో 15% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు.

మూలాలు

మార్చు
  1. Malleson, G. B.: An historical sketch of the native states of India, London 1875, Reprint Delhi 1984
  2. "Maps, Weather, and Airports for Kawardha, India". www.fallingrain.com. Retrieved 2016-04-10.
  3. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.

 

"https://te.wikipedia.org/w/index.php?title=కవర్ధా&oldid=3848766" నుండి వెలికితీశారు