భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు

భారత జాతీయ పరిపాలనా ఉపవిభాగాలు

భారతదేశం, 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలతో కూడిన సమాఖ్య వ్యవస్థ. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో జిల్లాలు, జిల్లాలలో తాలూకా లేక మండలం లేక తహసీల్ అని పిలవబడే పరిపాలనా విభాగాలున్నాయి.

భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు
రకంరాష్ట్రాల సమాఖ్య
స్థానంభారతదేశం
సంఖ్య28 రాష్ట్రాలు
8 కేంద్రపాలిత ప్రాంతాలు
జనాభా వ్యాప్తిరాష్ట్రాలు: సిక్కిం - 610,577 (అత్యల్ప); ఉత్తర ప్రదేశ్ - 199,812,341 (అత్యధిక)
కేంద్రపాలిత ప్రాంతాలు: లక్షద్వీప్ - 64,473 (అత్యల్ప); ఢిల్లీ - 16,787,941 (అత్యధిక)
విస్తీర్ణాల వ్యాప్తిరాష్ట్రాలు: 3,702 కి.మీ2 (1,429 చ. మై.) గోవా – 342,269 కి.మీ2 (132,151 చ. మై.) రాజస్థాన్
కేంద్ర భూభాగాలు: 32 కి.మీ2 (12 చ. మై.) లక్షద్వీప్ – 59,146 కి.మీ2 (22,836 చ. మై.) లడఖ్
ప్రభుత్వంరాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రప్రభుత్వం
ఉప విభజనజిల్లాలు, పరిపాలనా విభాగాలు

బాధ్యతలు, అధికారాలు

మార్చు

భారత రాజ్యాంగం రాష్ట్ర భూభాగానికి సంబంధించి సార్వభౌమిక కార్యనిర్వాహక, శాసన అధికారాలను కేంద్రానికి రాష్ట్రాలకు పంచింది.[1]

చరిత్ర

మార్చు
 
1951 లో భారతదేశ పరిపాలనా విభాగం

స్వాతంత్రానికి పూర్వం

మార్చు

చరిత్రలో భారతీయ ఉపఖండాన్ని అనేక విభిన్న జాతుల వారు పాలించారు. ప్రతి ఒక్కరూ ఈ ప్రాంతంలో పరిపాలనా విభజన కోసం వారి స్వంత విధానాలను ఏర్పాటు చేశారు.[2][3][4][5][6][7][8][9][10] బ్రిటిష్ పాలన కాలంలోను, అంతకు ముందరి మొఘలు పరిపాలనా విధానాన్నే ఎక్కువగా ఉంచేసారు.భారతదేశాన్ని ప్రావిన్స్‌లుగా (ప్రెసిడెన్సీలు అని కూడా అంటారు) విభజించారు. వీటిని బ్రిటిషు వారు నేరుగా పాలించారు. కొన్ని సంస్థానాలను సంస్థాధీశులు నేరుగా పరిపాలించినప్పటికీ, వీటిని స్థానిక రాజో యువరాజో నామమాత్రంగా నియంత్రించేవారు. ఈ రాజు బ్రిటిషు సామ్రాజ్యానికి విధేయుడుగా ఉండేవాడు. అంతిమంగా బ్రిటిషు వారు సంస్థానాలపై వాస్తవ సార్వభౌమత్వాన్ని కలిగి ఉండేవారు.

1947-1950 ల మధ్య సంస్థానాలు రాజకీయంగా భారత యూనియన్‌లో కలిసిపోయాయి. వీటిలో చాలావరకు అప్పటికే ఉన్న ప్రావిన్సులలో విలీనం కాగా, మిగిలినవి రాజ్‌పుతానా, హిమాచల్ ప్రదేశ్, మధ్య భారత్, వింధ్య ప్రదేశ్ వంటివి బహుళ రాచరిక రాష్ట్రాలుగా ఏర్పాటయ్యాయి. మైసూరు, హైదరాబాదు, భోపాల్, బిలాస్‌పూర్‌ వంటివి ప్రత్యేక ప్రావిన్సులుగా మారాయి. 1950 జనవరి 26 న అమల్లోకి వచ్చిన కొత్త రాజ్యాంగం ప్రకారం భారతదేశం సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా మారింది. కొత్త రిపబ్లిక్‌ను "యూనియన్ ఆఫ్ స్టేట్స్"గా ప్రకటించారు.[11] 1950 రాజ్యాంగం మూడు ప్రధాన రకాల రాష్ట్రాలను నిర్వచించింది:

  • పార్ట్ ఎ రాష్ట్రాలు: బ్రిటిష్ ఇండియా లోని మాజీ గవర్నర్ల ప్రావిన్సులు, ఎన్నికైన గవర్నరు, రాష్ట్ర శాసనసభలు పాలించాయి. ఈ విభాగం లోని తొమ్మిది రాష్ట్రాలు అస్సాం, బీహార్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ (పూర్వం సెంట్రల్ ప్రావిన్స్, బెరార్), మద్రాస్, ఒరిస్సా, పంజాబ్ (పూర్వం తూర్పు పంజాబ్), ఉత్తర ప్రదేశ్ (గతంలో యునైటెడ్ ప్రావిన్సెస్), పశ్చిమ బెంగాల్ (గతంలో బెంగాల్‌లో భాగం).
  • ఎనిమిది పార్ట్ బి రాష్ట్రాలు: వీటిలో పూర్వపు రాచరిక రాష్ట్రాలు లేదా రాచరిక రాష్ట్రాల సమూహాలు. వీటిని రాజ్‌ప్రముఖ్ (సాధారణంగా రాజ్యాంగ బద్ధంగా పాలకుడు), ఎన్నుకోబడిన శాసనసభలు పాలిస్తారు. రాజ్‌ప్రముఖ్‌ను భారత రాష్ట్రపతి నియమిస్తారు. ఈ రాష్ట్రాలు హైదరాబాద్, జమ్మూ కాశ్మీర్, మధ్య భారత్, మైసూర్, పాటియాలా, తూర్పు పంజాబ్ స్టేట్స్ యూనియన్ (పిఇపిఎస్‌యు), రాజస్థాన్, సౌరాష్ట్ర, ట్రావెన్కోర్-కొచ్చిన్ .
  • పది పార్ట్ సి రాష్ట్రాలు: వీటిలో మాజీ చీఫ్ కమిషనర్ల ప్రావిన్సులు, కొన్ని రాచరిక రాష్ట్రాలు ఉన్నాయి,, ప్రతి ఒక్కటి భారత రాష్ట్రపతి నియమించిన చీఫ్ కమిషనర్ చేత పాలించబడుతుంది. పార్ట్ సి రాష్ట్రాలు అజ్మీర్, భోపాల్, బిలాస్‌పూర్, కూర్గ్, దిల్లీ, హిమాచల్ ప్రదేశ్, కచ్, మణిపూర్, త్రిపుర, వింధ్య ప్రదేశ్ .
  • పార్ట్ డి రాష్ట్రం ఇది ఒక్కటే: అండమాన్, నికోబార్ దీవులు, వీటిని కేంద్ర ప్రభుత్వం నియమించిన లెఫ్టినెంట్ గవర్నర్ పరిపాలిస్తారు.

రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ (1951-1956)

మార్చు
 ఆఫ్ఘనిస్తాన్మయన్మార్చైనాతజికిస్తాన్హిందూ మహాసముద్రంబంగాళాఖాతంఅండమాన్ సముద్రంఅరేబియా సముద్రముLaccadive Seaఅండమాన్ నికోబార్ దీవులుచండీగఢ్దాద్రా, నగర్ హవేలీ, డామన్, డయ్యూఢిల్లీలక్షద్వీప్పుదుచ్చేరిపుదుచ్చేరిగోవాకేరళమణిపూర్మేఘాలయమిజోరాంనాగాలాండ్సిక్కింత్రిపురపాకిస్తాన్నేపాల్భూటాన్బంగ్లాదేశ్శ్రీలంకశ్రీలంకశ్రీలంకశ్రీలంకశ్రీలంకశ్రీలంకశ్రీలంకశ్రీలంకశ్రీలంకసియాచెన్ హిమానీనదంDisputed territory in Jammu and KashmirDisputed territory in Jammu and KashmirJammu and Kashmirలడఖ్చండీగఢ్ఢిల్లీదాద్రా, నగర్ హవేలీ, డామన్, డయ్యూదాద్రా, నగర్ హవేలీ, డామన్, డయ్యూPuducherryPuducherryPuducherryPuducherryగోవాగుజరాత్కర్ణాటకకేరళమధ్య ప్రదేశ్మహారాష్ట్రరాజస్థాన్తమిళనాడుఅసోంమేఘాలయఆంధ్రప్రదేశ్అరుణాచల్ ప్రదేశ్నాగాలాండ్మణిపూర్మిజోరాంతెలంగాణత్రిపురపశ్చిమ బెంగాల్సిక్కింబీహార్జార్ఖండ్ఒడిషాఛత్తీస్గఢ్ఉత్తరప్రదేశ్ఉత్తరాఖండ్హర్యానాPunjabహిమాచల్ ప్రదేశ్
భారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు (గతిశీల పటం) (ఆంధ్రప్రదేశ్ హద్దులు విభజన నాటివి)

గతంలో ఫ్రెంచి వారి అధీనంలో ఉన్న పాండిచ్చేరి, కారైకల్, యానాం, మహే లని కలిపి 1954 లో పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాన్ని ఏర్పాటు చేసారు.[12] మద్రాస్ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ఉత్తర జిల్లాలను విడదీసి, 1953 అక్టోబరు 1 న ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పరచారు.[13]

1956 నాటి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం భాష ఆధారంగా రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరించింది. దీని ఫలితంగా కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి.[14] ఈ చట్టం ఫలితంగా, మద్రాస్ రాష్ట్రం లోని కన్యాకుమారి జిల్లాను చేర్చడంతో ట్రావెన్కోర్-కొచ్చిన్ ఏర్పడింది . విలీనం రూపొందించారు ఆంధ్ర రాష్ట్రాన్ని హైదరాబాద్ రాష్ట్రం లోని తెలుగు మాట్లాడే జిల్లాలనూ కలిపి 1956 నవంబరు 1 న ఆంధ్ర ప్రదేశ్‌ను ఏర్పరచారు. మద్రాస్ రాష్ట్రంలోని మలబార్ జిల్లా, దక్షిణ కెనరా జిల్లా లోని కాసరగోడ్ తాలూకాలను ట్రావెన్కోర్-కొచ్చిన్తో విలీనం చేసి కేరళ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసారు. మద్రాస్ రాష్ట్రం నుండి బళ్లారి, దక్షిణ కెనరా జిల్లాలు (కాసరగోడ్ తాలూకా మినహా), కోయంబత్తూర్ జిల్లాలోని కొల్లెగల్ తాలూకాలు, బొంబాయి రాష్ట్రం లోని బెల్గాం, బీజాపూర్, ఉత్తర కెనరా, ధార్వాడ్ జిల్లాలను, హైదరాబాద్ రాష్ట్రంలో కన్నడ మట్లాడే బీదర్, రాయచూర్, గుల్బర్గా జిల్లాలనూ కూర్గ్ ప్రావిన్సునూ, మైసూరు రాష్ట్రంతో కలిపి కర్ణాటక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసారు. మద్రాస్ రాష్ట్రంలోని దక్షిణ కెనరా, మలబార్ జిల్లాల్లో ఉండే లక్కదీవులను విడదీసి, లక్షద్వీప్‌ కేంద్రపాలిత ప్రాంతాన్ని ఏర్పరచారు. మధ్యప్రదేశ్‌లోని నాగ్‌పూర్ డివిజన్‌లోని మరాఠీ మాట్లాడే జిల్లాలు, హైదరాబాద్ రాష్ట్రంలోని మరాఠ్వాడా ప్రాంతం, సౌరాష్ట్ర రాష్ట్రం, కచ్ స్టేట్‌ను చేర్చడం ద్వారా బొంబాయి రాష్ట్రాన్ని విస్తరించారు. రాజస్థాన్ లోకి, అజ్మీర్ పంజాబ్ లోకి, పాటియాలా, తూర్పు పంజాబ్ స్టేట్స్ యూనియన్ లను కలిపారు.బీహార్ లోని కొన్ని ప్రాంతాలను పశ్చిమ బెంగాల్‌కు బదిలీ చేసారు.

1960 మే 1 న బాంబే పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా బొంబాయి రాష్ట్రాన్ని గుజరాత్, మహారాష్ట్ర భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా విభజించారు.[15] 1963 డిసెంబరు 1 న నాగాలాండ్ ఏర్పడింది.[16] 1966 పంజాబ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ఫలితంగా నవంబరు 1 న హర్యానా ఏర్పడింది. పంజాబ్ రాష్ట్రపు ఉత్తర జిల్లాలను హిమాచల్ ప్రదేశ్‌కు బదిలీ చేసారు.[17] ఈ చట్టం ప్రకారమే చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతంగాను, పంజాబ్, హర్యానాల ఉమ్మడి రాజధానిగానూ ఏర్పాటు చేసారు.[18][19]

1968 లో మద్రాస్ రాష్ట్రాన్ని తమిళనాడుగా మార్చారు. 1972 జనవరి 21 న ఈశాన్యంలో మణిపూర్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాలని ఏర్పాటు చేసారు.[20] 1973 లో మైసూర్ రాష్ట్రానికి కర్ణాటకఅని పేరు మార్చారు. 1975 మే16 న సిక్కిం భారతదేశపు 22 వ రాష్ట్రంగా అవతరించింది. అక్కడ రాచరికాన్ని రద్దు చేసారు.[21] 1987 లో, ఫిబ్రవరి 20 న అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం రాష్ట్రాలు అవతరించగా, మే 30 న గోవా రాష్ట్రం, డామన్ డయ్యు, దాద్రా నగర్ హవేలీ కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయి.[22]

2000 నవంబరులో మూడు కొత్త రాష్ట్రాలను ఏర్పరచారు. అవి, తూర్పు మధ్యప్రదేశ్ నుండి ఛత్తీస్‌గఢ్, వాయవ్య ఉత్తర ప్రదేశ్ నుండి ఉత్తరాంచల్ (2007 లో ఈ పేరును ఉత్తరాఖండ్గా పేరు మార్చారు), బీహార్ దక్షిణ జిల్లాల నుండి జార్ఖండ్.[23][24][25][26] ఒరిస్సా రాష్ట్రం పేరును 2011 లో ఒడిషాగా మార్చారు. 2014 జూన్ 2 న వాయవ్య ఆంధ్రప్రదేశ్‌లోని పది జిల్లాలను విడదీసి, తెలంగాణను ఏర్పరచారు.[27][28]

2019 ఆగస్టులో, భారత పార్లమెంటు జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2019 ను ఆమోదించింది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని జమ్మూ కాశ్మీర్, లడఖ్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా పునర్వ్యవస్థీకరించడానికి ఇందులో ప్రతిపాదనలు ఉన్నాయి; 2019 అక్టోబరు 31 నుండి అమలులోకి వచ్చింది.[29]

2019 నవంబరులో, డామన్ డయ్యూ, దాద్రా నగర్ హవేలీ కేంద్రపాలిత ప్రాంతాలను విలీనం చేసి ఒకే కేంద్రపాలిత ప్రాంతంగా చేయడానికి భారత ప్రభుత్వం చట్టాన్ని ప్రవేశపెట్టింది. దీనిని దాద్రా, నగర్ హవేలి, డామన్, డయ్యు అని పిలుస్తారు, ఇది 2020 జనవరి 26 నుండి అమలులోకి వచ్చింది.[30][31][32]

రాష్ట్రాలు

మార్చు
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు జాబితా
వరుస సంఖ్య రాష్ట్రం ఐఎస్ఒ 3166-2:ఐఎన్ వాహన రిజిస్ట్రేషను కోడ్ ప్రాంతం రాజధాని అతిపెద్ద నగరం రాష్ట్రావతరణ జనాభా[33] విస్తీర్ణం (చ.కి.మీ.) అధికారిక భాషలు [34] అదనపు అధికారిక భాషలు [34]
1 ఆంధ్రప్రదేశ్ IN-AP AP దక్షిణ అమరావతి Note 1[35] విశాఖపట్నం 1953 అక్టోబరు 1 49,506,799 160,205 తెలుగు
2 అరుణాచల్ ప్రదేశ్ IN-AR AR ఈశాన్య ఇటానగర్ 1987 ఫిబ్రవరి 20 1,383,727 83,743 ఇంగ్లీషు
3 అసోం IN-AS AS ఈశాన్య దిస్పూర్ గువహాటి 1950 జనవరి 26 31,205,576 78,550 అస్సామీ బెంగాలీ, బోడో
4 బీహార్ IN-BR BR తూర్పు పాట్నా 1950 జనవరి 26 104,099,452 94,163 హిందీ ఉర్దూ
5 చత్తీస్‌గఢ్ IN-CT CG మధ్య నవ రాయ్‌పూర్ 2000 నవంబరు 1 25,545,198 135,194 హిందీ
6 గోవా IN-GA GA పశ్చిమ పనాజీ వాస్కో డా గామా 1987 మే 30 1,458,545 3,702 కొంకణి ఇంగ్లీషు, మరాఠీ
7 గుజరాత్ IN-GJ GJ పశ్చిమ గాంధీనగర్ అహ్మదాబాదు 1960 మే 1 60,439,692 196,024 గుజరాతీ
8 హర్యానా IN-HR HR ఉత్తర చండీగఢ్ ఫరీదాబాదు 1966 నవంబరు 1 25,351,462 44,212 హిందీ పంజాబీ[36][37]
9 హిమాచల్ ప్రదేశ్ IN-HP HP ఉత్తర సిమ్లా (వేసవి) ధర్మశాల (శీతాకాలం) సిమ్లా 1971 జనవరి 25 6,864,602 55,673 హిందీ ఇంగ్లీషు
10 జార్ఖండ్ IN-JH JH తూర్పు రాంచీ జంషెడ్‌పూర్ 2000 నవంబరు 15 32,988,134 74,677 హిందీ ఉర్దూ[38]
11 కర్ణాటక IN-KA KA దక్షిణ బెంగుళూరు 1956 నవంబరు 1 61,095,297 191,791 కన్నడ ఇంగ్లీషు
12 కేరళ IN-KL KL దక్షిణ తిరువనంతపురం కొచ్చి 1956 నవంబరు 1 33,406,061 38,863 మలయాళం ఇంగ్లీషు
13 మధ్య ప్రదేశ్ IN-MP MP మధ్య భోపాల్ ఇండోర్ 1956 నవంబరు 1 72,626,809 308,252 హిందీ
14 మహారాష్ట్ర IN-MH MH పశ్చిమ ముంబై (వేసవి)నాగపూర్ (శీతాకాలం)[39] ముంబై 1960 మే 1 112,374,333 307,713 మరాఠీ
15 మణిపూర్ IN-MN MN ఈశాన్య ఇంఫాల్ 1972 జనవరి 21 2,855,794 22,347 మీటీ ఇంగ్లీషు
16 మేఘాలయ IN-ML ML ఈశాన్య షిల్లాంగ్ 1972 జనవరి 21 2,966,889 22,720 ఇంగ్లీషు కాశీ భాష[a]
17 మిజోరం IN-MZ MZ ఈశాన్య ఐజాల్ 1987 ఫిబ్రవరి 20 1,097,206 21,081 ఇంగ్లీషు, హిందీ, మిజో
18 నాగాలాండ్ IN-NL NL ఈశాన్య కోహిమా జిల్లా దీమాపూర్ జిల్లా 1963 డిసెంబరు 1 1,978,502 16,579 ఇంగ్లీషు
19 ఒరిస్సా IN-OR OD తూర్పు భుబనేశ్వర్ 1936 ఏప్రిల్ 1 41,974,218 155,820 ఒడియా
20 పంజాబ్ IN-PB PB ఉత్తర చండీగఢ్ లుధియానా 1966 నవంబరు 1 27,743,338 50,362 పంజాబీ
21 రాజస్థాన్ IN-RJ RJ ఉత్తర జైపూర్ 1956 నవంబరు 1 68,548,437 342,269 హిందీ ఇంగ్లీషు
22 సిక్కిం IN-SK SK ఈశాన్య గాంగ్‌టక్ 1975 మే 16 610,577 7,096 నేపాలీ, ఇంగ్లీషు భూటియా, గురుంగ్, లెప్చా, లింబు, మంగర్, ముఖియా, నెవారి, రాయ్, షెర్పా, తమంగ్
23 తమిళనాడు IN-TN TN దక్షిణ చెన్నై 1950 జనవరి 26 72,147,030 130,058 తమిళం ఇంగ్లీషు
24 తెలంగాణ IN-TG TG దక్షిణ హైదరాబాదు Note 1 2014 జూన్ 2 35,193,978[40] 114,840[40] తెలుగు, ఉర్దూ[41]
25 త్రిపుర IN-TR TR ఈశాన్య అగర్తలా 1972 జనవరి 21 3,673,917 10,492 బెంగాలీ, ఇంగ్లీషు, కోక్బోరోక్ భాష
26 ఉత్తర ప్రదేశ్ IN-UP UP ఉత్తర లక్నో కాన్పూర్ 1950 జనవరి 26 199,812,341 243,286 హిందీ ఉర్దూ
27 ఉత్తరాఖండ్ IN-UT UK ఉత్తర డెహ్రాడూన్ Note 2 2000 నవంబరు 9 10,086,292 53,483 హిందీ సంస్కృతం[42]
28 పశ్చిమ బెంగాల్ IN-WB WB తూర్పు కోల్‌కాతా 1950 జనవరి 26 91,276,115 88,752 బెంగాలీ, నేపాలీ[b] హిందీ, ఒడియా, పంజాబీ, సంతాలీ, ఉర్దూ
  • ^Note 1 2014 జూన్ 2 న ఆంధ్రప్రదేశ్‌ను విభజించి తెలంగాణను ఏర్పాటు చేసారు.[43][44] తెలంగాణ లోని హైదరాబాదు తెలంగాణాకు రాజధాని. ఆంధ్రప్రదేశ్‌కు కూడా గరిష్ఠంగా పదేళ్ళ పాటు రాజధానిగా ఉంతుంది.[45] ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన కొత్త రాజధాని అమరావతికి 2017 లోనే ప్రభుత్వాన్ని శాసనసభనూ తరలించింది.[35]
  • ^Note 2 ఉత్తరాఖండ్‌కు డెహ్రాడూన్ తాత్కాలిక రాజధాని. రాష్ట్రానికి కొత్త రాజధానిగా గెయిర్‌సైన్ ను నిర్ణయించారు.

కేంద్ర పాలిత ప్రాంతాలు

మార్చు
వరుస సంఖ్య కేంద్ర భూభాగం ISO 3166- 2: IN వాహన నమోదు కోడ్ రాజధాని అతిపెద్ద నగరం జనాభా [33] ప్రాంతం (కిమీ 2 ) అధికారిక భాషలు [34] అదనపు అధికారిక భాషలు [34]
1 అండమాన్, నికోబార్ దీవులు IN-AN AN పోర్ట్ బ్లెయిర్ 380.581 8.249 ఇంగ్లీష్, హిందీ
2 చండీగఢ్ IN-CH CH చండీగఢ్ - [c] 1.055.450 114 ఆంగ్ల
3 దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ IN-DD DD డామన్ 586.956 603 ఇంగ్లీష్, గుజరాతీ, హిందీ, కొంకణి హిందీ
4 ఢిల్లీ IN-DL DL న్యూఢిల్లీ - [d] 16.787.941 1,490 హిందీ పంజాబీ, ఉర్దూ [46]
5 జమ్మూ కాశ్మీరు IN-JK JK శ్రీనగర్ (వేసవి కాలం) జమ్మూ (శీతాకాలం) శ్రీనగర్ 12.258.433 55,538 Note 3 హిందీ, ఇంగ్లీష్ డోగ్రి, కాశ్మీరీ, ఉర్దూ
6 లడఖ్ IN-LH LA లేహ్, కార్గిల్ లేహ్ 290.492 174,852 Note 4 లద్దాఖీ బల్టీ
7 లక్షద్వీప్ IN-LD LD కవరట్టి 64.473 32 మలయాళం ఆంగ్ల
8 పుదుచ్చేరి IN-PY PY పాండిచ్చేరి 1.247.953 492 ఇంగ్లీష్,[47] తమిళం మలయాళం, తెలుగు

^Note 3 జమ్మూకాశ్మీరులో 42,241 చ.కి.మీ. భూభాగాన్ని భారత్ పాలిస్తూండగా, 13,297 చ.కి.మీ. భాగం పాకిస్తాన్ ఆక్రమణలో ఉంది. కాశ్మీరు ప్రభువు మహారాజా హరిసింగ్ భారత్‌లో కలవాలని 1947 అక్టోబరు 26 న సంతకం చేసాడు కాబట్టి, ఈ భూభాగం కూడా చట్టపరంగా భారత్‌దే.

^Note 4 లడాఖ్‌లో 59,146 చ.కి.మీ. భూభాగం భారత్ నియంత్రణలో ఉంది. 72,971చ.కి.మీ. భూభాగం పాకిస్తాన్ ఆక్రమణలో ఉంది. ఇదే కాకుండా పాకిస్తాన్ 5,180 చ.కి.మీ. భూభాగాన్ని కారకోరం రహదారి కోసం చైనాకు అప్పజెప్పింది. లడాఖ్‌లో మరో 37,555 చ.కి.మీ. అక్సాయ్‌చిన్ ప్రాంతం చైనా ఆక్రమణలో ఉంది. ఈ భూభాగాలన్నీ భారత్‌వేనని భారత్ వాదన.

పూర్వ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు

మార్చు

పూర్వ రాష్ట్రాలు

మార్చు
మ్యాప్ రాష్ట్రం రాజధాని సంవత్సరాలు ప్రస్తుత రాష్ట్రం (లు)
  అజ్మీర్ రాష్ట్రం అజ్మీర్ 1950–1956 రాజస్థాన్
  ఆంధ్ర రాష్ట్రం కర్నూలు 1953–1956 ఆంధ్రప్రదేశ్
  భోపాల్ రాష్ట్రం భోపాల్ 1949–1956 మధ్యప్రదేశ్
  బిలాస్‌పూర్ రాష్ట్రం బిలాస్‌పూర్ 1950–1954 హిమాచల్ ప్రదేశ్
  బాంబే స్టేట్ బాంబే 1950–1960 మహారాష్ట్ర, గుజరాత్, పాక్షికంగా కర్ణాటక
  కూర్గ్ రాష్ట్రం మడికేరి 1950–1956 కర్ణాటక
  తూర్పు పంజాబ్ సిమ్లా (1947–1953)
చండీగఢ్ (1953–1966)
1947–1966 పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ చండీగఢ్ (కేంద్రపాలిత ప్రాంతం)
  హైదరాబాద్ రాష్ట్రం హైదరాబాద్ 1948–1956 తెలంగాణ, పాక్షికంగా మహారాష్ట్ర కర్ణాటక
 
జమ్మూ కాశ్మీరు శ్రీనగర్ (వేసవి)
జమ్ము (శీతాకాలం)
1952–2019 జమ్మూ కాశ్మీరు (కేంద్రపాలిత ప్రాంతం)

లడఖ్ (కేంద్రపాలిత పాంత్రం)

  కచ్ రాష్ట్రం భుజ్ 1947–1956 గుజరాత్
  మధ్య భారత్ ఇండోర్ (వేసవి)
గ్వాలియర్ (శీతాకాలం)
1948–1956
  మద్రాసు రాష్ట్రం మద్రాస్ 1950–1969 ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పాక్షికంగా కర్ణాటక, కేరళ
  మైసూర్ రాష్ట్రం బెంగళూరు 1947–1973 కర్ణాటక
  పాటియాలా ఈస్ట్ పంజాబ్ స్టేట్స్ యూనియన్ పాటియాలా 1948–1956
  సౌరాష్ట్ర రాజ్‌కోట్ 1948–1956 గుజరాత్
  ట్రావెన్‌కోర్–కొచ్చిన్ త్రివేండ్రం 1949–1956
  వింధ్య ప్రదేశ్ రేవా 1948–1956 మధ్యప్రదేశ్

పూర్వ కేంద్రపాలిత ప్రాంతాలు

మార్చు
భారతదేశంలోని పూర్వ కేంద్రపాలిత ప్రాంతాలు[48]
పేరు జోన్ రాజధాని ప్రాంతం ప్రారంభించండి ముగింపు వారస ప్రాంతాలు లేదా భూభాగాలు మ్యాప్
అరుణాచల్ ప్రదేశ్ నార్త్-ఈస్ట్రన్ ఇటానగర్ 83,743 కి.మీ2 (32,333 చ. మై.) 0లోపం: సమయం సరిగ్గా లేదు21 జనవరి 1972 0లోపం: సమయం సరిగ్గా లేదు20 ఫిబ్రవరి 1987 భారత రాష్ట్రంగా  
దాద్రా నగర్ హవేలీ పశ్చిమ సిల్వాస్సా 491 కి.మీ2 (190 చ. మై.) 0లోపం: సమయం సరిగ్గా లేదు11 ఆగస్టు 1961 0లోపం: సమయం సరిగ్గా లేదు26 జనవరి 2020 దాద్రా నగర్ హవేలీ డామన్ డయ్యూ (కేంద్రపాలిత ప్రాంతం)  
డామన్ డయ్యూ పశ్చిమ డామన్ 112 కి.మీ2 (43 చ. మై.) 0లోపం: సమయం సరిగ్గా లేదు30 మే 1987 0లోపం: సమయం సరిగ్గా లేదు26 జనవరి 2020 దాద్రా, నగర్ హవేలీ, డామన్, డయ్యూ (కేంద్రపాలిత ప్రాంతం)  
గోవా, డామన్ , డయ్యూ పశ్చిమ పనాజీ 3,814 కి.మీ2 (1,473 చ. మై.) 0లోపం: సమయం సరిగ్గా లేదు19 డిసెంబరు 1961 0లోపం: సమయం సరిగ్గా లేదు30 మే 1987 గోవా (రాష్ట్రం), దాద్రా, నగర్ హవేలీ, డామన్, డయ్యూ (కేంద్రపాలిత ప్రాంతం)  
హిమాచల్ ఉత్తర సిమ్లా 55,673 కి.మీ2 (21,495 చ. మై.) 0లోపం: సమయం సరిగ్గా లేదు1 నవంబరు 1956 0లోపం: సమయం సరిగ్గా లేదు25 జనవరి 1971 భారత రాష్ట్రంగా  
మణిపూర్ నార్త్-ఈస్ట్రన్ ఇంఫాల్ 22,327 కి.మీ2 (8,621 చ. మై.) 0లోపం: సమయం సరిగ్గా లేదు1 నవంబరు 1956 0లోపం: సమయం సరిగ్గా లేదు21 జనవరి 1972 భారత రాష్ట్రంగా  
మిజోరం నార్త్-ఈస్ట్రన్ ఐజాల్ 21,081 కి.మీ2 (8,139 చ. మై.) 0లోపం: సమయం సరిగ్గా లేదు21 జనవరి 1972 0లోపం: సమయం సరిగ్గా లేదు20 ఫిబ్రవరి 1987 భారత రాష్ట్రంగా  
నాగాలాండ్ నార్త్-ఈస్ట్రన్ కోహిమా 16,579 కి.మీ2 (6,401 చ. మై.) 0లోపం: సమయం సరిగ్గా లేదు29 నవంబరు 1957 0లోపం: సమయం సరిగ్గా లేదు1 డిసెంబరు 1963 భారత రాష్ట్రంగా  
త్రిపుర నార్త్-ఈస్ట్రన్ అగర్తలా 10,491 కి.మీ2 (4,051 చ. మై.) 0లోపం: సమయం సరిగ్గా లేదు1 నవంబరు 1956 0లోపం: సమయం సరిగ్గా లేదు21 జనవరి 1972 భారత రాష్ట్రంగా  

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు

Notes

  1. Khasi language has been declared as the Additional Official Language for all purposes in the District, Sub-Division and Block level offices of the State Government located in the Districts of Khasi-Jaintia Hills of Meghalaya.
  2. Bengali and Nepali are the Official Languages in Darjeeling and Kurseong sub-divisions of Darjeeling district.
  3. Chandigarh is both a city and a union territory.
  4. Delhi is both a city and a union territory.

Citations

  1. "Article 73 broadly stated, provides that the executive power of the Union shall extend to the matters with respect to which Parliament has power to make laws. Article 162 similarly provides that the executive power of a State shall extend to the matters with respect to which the Legislature of a State has power to make laws. The Supreme Court has reiterated this position when it ruled in the Ramanaiah case that the executive power of the Union or of the State broadly speaking, is coextensive and coterminous with its respective legislative power." Territoriality of executive powers of states in India, Balwant Singh Malik, Constitutional Law, 1998
  2. Krishna Reddy (2003). Indian History. New Delhi: Tata McGraw Hill. ISBN 978-0-07-048369-9.
  3. Ramesh Chandra Majumdar (1977). Ancient India. Motilal Banarsidass Publishers. ISBN 978-81-208-0436-4.
  4. Romila Thapar (1966). A History of India: Part 1.
  5. V.D. Mahajan (2007). History of medieval India (10th ed.). New Delhi: S Chand. pp. 121, 122. ISBN 978-8121903646.
  6. Antonova, K.A.; Bongard-Levin, G.; Kotovsky, G. (1979). A History of India Volume 1. Moscow, USSR: Progress Publishers.
  7. Gupta Dynasty – MSN Encarta. Archived from the original on 1 November 2009.
  8. Nilakanta Sastri, K.A. (2002) [1955]. A history of South India from prehistoric times to the fall of Vijayanagar. New Delhi: Indian Branch, Oxford University Press. p. 239. ISBN 978-0-19-560686-7.
  9. Chandra, Satish. Medieval India: From Sultanate To The Mughals. p. 202.
  10. Grewal, J. S. (1990). "Chapter 6: The Sikh empire (1799–1849)". The Sikh empire (1799–1849). The New Cambridge History of India. Vol. The Sikhs of the Punjab. Cambridge University Press. Archived from the original on 2012-02-16. Retrieved 2020-02-16.
  11. "Article 1". Constitution of India. Archived from the original on 2 ఏప్రిల్ 2012.
  12. "Reorganisation of states" (PDF). Economic Weekly.
  13. "Map of Madras Presidency in 1909". Archived from the original on 2021-02-24. Retrieved 2020-02-16.
  14. "Article 1". Constitution of India. Law Ministry, GOI. Archived from the original on 2 ఏప్రిల్ 2012. Retrieved 31 డిసెంబరు 2015.
  15. J.C. Aggarwal, S.P. Agrawal (1995). Uttarakhand: Past, Present, and Future. New DElhi: Concept Publishing. pp. 89–90.
  16. "Nagaland History & Geography-Source". india.gov.in. Retrieved 17 June 2013.
  17. "Himachal Pradesh Tenth Five Year Plan" (PDF). Archived from the original (PDF) on 13 మే 2014. Retrieved 17 June 2013.
  18. "The Punjab Reorganisation Act 1966" (PDF). india.gov.in. Retrieved 17 June 2013.
  19. "State map of India". Travel India guide. Archived from the original on 1 జూన్ 2013. Retrieved 17 June 2013.
  20. "Snapshot of North Eastern States" (PDF). thaibicindia.in.
  21. "About Sikkim". Official website of the Government of Sikkim.
  22. "Goa Chronology". goaonline.in. Archived from the original on 2011-07-21. Retrieved 2020-02-16.
  23. "Official Website of Government of Jharkhand". Jharkhand.gov.in. Archived from the original on 21 జూన్ 2013. Retrieved 17 June 2013.
  24. "Chhattisgarh state – History". Cg.gov.in. Archived from the original on 4 జూలై 2010. Retrieved 17 June 2013.
  25. "Uttaranchal is Uttarakhand, BJP cries foul". Times of India. Archived from the original on 2013-05-10. Retrieved 22 January 2013.
  26. "About Us: Uttarakhand Government Portal, India". Uk.gov.in. Retrieved 17 June 2013.
  27. "The Andhra Pradesh Reorganisation Act, 2014" (PDF). Ministry of law and justice, Government of India. Archived from the original (PDF) on 8 జనవరి 2016. Retrieved 3 March 2014.
  28. "Telangana bill passed by upper house". The Times of India. Retrieved 20 February 2014.
  29. "Jammu and Kashmir Reorganisation Bill (No. XXIX of) 2019" (PDF). Parliament of India. 5 August 2019. Retrieved 22 August 2019.
  30. Dutta, Amrita Nayak (10 July 2019). "There will be one UT less as Modi govt plans to merge Dadra & Nagar Haveli and Daman & Diu". New Delhi. The Print. Retrieved 22 August 2019.
  31. https://www.devdiscourse.com/article/national/754685-govt-plans-to-merge-2-uts----daman-and-diu-dadra-and-nagar-haveli
  32. http://164.100.47.4/BillsTexts/LSBillTexts/Asintroduced/366_2019_LS_Eng.pdf
  33. 33.0 33.1 "List of states with Population, Sex Ratio and Literacy Census 2011".
  34. 34.0 34.1 34.2 34.3 "Report of the Commissioner for linguistic minorities: 50th report (July 2012 to June 2013)" (PDF). Commissioner for Linguistic Minorities, Ministry of Minority Affairs, Government of India. Archived from the original (PDF) on 2016-07-08. Retrieved 2020-02-16.
  35. 35.0 35.1 "After 2200 Years, Amaravati Gets Back Power!".
  36. "Haryana grants second language status to Punjabi". Hindustan Times. 28 January 2010. Archived from the original on 3 సెప్టెంబరు 2015. Retrieved 16 ఫిబ్రవరి 2020.
  37. "Punjabi gets second language status in Haryana". Zee news. 28 January 2010.
  38. "Research data". Archived from the original on 2021-02-25. Retrieved 2020-02-16.
  39. Monsoon session to start in Maha’s winter Capital Nagpur from July 4
  40. 40.0 40.1 "Telangana State Profile". Telangana government portal.
  41. "Urdu Gets First Language Status".
  42. "Sanskrit: Reviving the language in today's India – Livemint".
  43. "T-party today: India's 29th state Telangana is born". The Times of India. 2014-06-02. ISSN 0971-8257. Retrieved 2023-09-13.
  44. "Bifurcated into Telangana State and residual Andhra Pradesh State". The Times of India. 2 June 2014.
  45. Sanchari Bhattacharya (1 June 2014). "Andhra Pradesh Minus Telangana: 10 Facts". NDTV.
  46. "Official Language Act 2000" (PDF). Government of Delhi.
  47. "Regional data" (PDF). Archived from the original (PDF) on 2020-05-03. Retrieved 2020-02-16.
  48. "Article 1". Constitution of India (PDF) (Report). Government of India. Retrieved 31 December 2023.

వెలుపలి లంకెలు

మార్చు