కవాడిగూడ

తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన ఒక నివాసప్రాంతం

కవాడిగూడ తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన ఒక నివాసప్రాంతం.[1] ఇది సికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గంలోని, ముషీరాబాద్ శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన ప్ర్రాంతం.ఇది హైదరాబాదు మహానగరపాలక సంస్థ సెంట్రల్ జోన్ లోని 3 వ సర్కిల్ 94 వ వార్డుకు చెందిన ప్రాంతం.

కవాడిగూడ
సమీప ప్రాంతం
కవాడిగూడ is located in Telangana
కవాడిగూడ
కవాడిగూడ
భారతదేశంలోని తెలంగాణలో ప్రాంతం ఉనికి
కవాడిగూడ is located in India
కవాడిగూడ
కవాడిగూడ
కవాడిగూడ (India)
Coordinates: 17°25′52″N 78°30′36″E / 17.431°N 78.510°E / 17.431; 78.510
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాదు
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
Government
 • Bodyహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (IST)
పిన్ కోడ్
500 080
Vehicle registrationటిఎస్
లోక్‌సభ నియోజకవర్గంసికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంముషీరాబాద్ శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ

చరిత్ర

మార్చు

400 సంవత్సరాల చరిత్ర గల హైదరాబాదు నగరంలో హుస్సేన్‌ సాగర్‌ సమీపంలో ఈ కవాడిగూడ బస్తి ఉంది. హుస్సేన్‌ సాగర్‌ చెరువు కట్ట నిర్మాణానికి కావడిలలో రాళ్ళు మోసిన కూలీలు గుడిసెలు వెసుకుని నివసించిన ఈ ప్రాంతాని మొదట్లో కావడీల గూడెం అని పిలిచేవారు. అది వాడుకలో క్రమంగా కవాడిగూడగా మారింది. హైదరాబాదు నగరం మధ్యలో, సికింద్రాబాదు (మేజర్ రైల్వేహబ్), ఆర్టీసీ క్రాస్ రోడ్స్ (బావార్చి బిర్యానీ), పాట్నీ (పారడైజ్ బిర్యానీ) వంటి వివిధ ప్రాంతాలకు సమీపంలో ఈ కవాడిగూడ ఉంది.

రవాణా

మార్చు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో కవాడిగూడ మీదుగా నగరంలోని అన్ని ప్రాంతాలకు బస్సులు నడుపబడుతున్నాయి. కవాడిగూడకు సమీపంలో సీతాఫల్‌మండి వద్ద ఎంఎంటిఎస్ రైలు స్టేషన్ ఉంది.

మూలాలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=కవాడిగూడ&oldid=4148835" నుండి వెలికితీశారు