కవితా లాడ్
కవితా లాడ్, మహారాష్ట్రకు చెందిన నాటకరంగ, టెలివిజన్, సినిమా నటి. చార్ దివాస్ ససుచే, [1] ఉంచ్ మాజా జోకా, రాధా హి బవారీ, రాధా ప్రేమ్ రంగి రంగాలిలో వంటి సీరియళ్ళలోనూ, సుందర్ మి హోనార్, ఎకా లగ్నాచి గోష్ట, చార్ దివాస్ ప్రేమచే, లగ్నాచి పుఢ్చి గోష్ట వంటి నాటకాలలో నటించింది.[2]
కవితా లాడ్ | |
---|---|
జననం | |
విద్య | హోలీ క్రాస్ కాన్వెంట్ హైస్కూల్ |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1993-ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | ఆశిష్ మేధేకర్ (m. 2003) |
పిల్లలు | 2 |
జననం, విద్య
మార్చుకవితా లాడ్ 1973, నవంబరు 13న మహారాష్ట్రలోనే థానే ప్రాంతంలో జన్మించింది. థానేలోని హోలీ క్రాస్ కాన్వెంట్ హైస్కూల్ లోనూ, ఠాణా కళాశాలలోనూ తన విద్యాభ్యాసాన్ని పూర్తిచేసింది.
వ్యక్తిగత జీవితం
మార్చుకవితకు 2003లో ఆశిష్ మేధేకర్‌తో వివాహం జరిగింది.[3] వారికి ఇద్దరు పిల్లలు.
నటనారంగం
మార్చుకవితా లాడ్ తొలిసారిగా ఎన్. చంద్రస్ తీసిన ఘయాల్ అనే మరాఠీ సినిమాలో అజింక్యా డియోతో కలిసి నటించింది. లక్ష్మీకాంత్ బెర్డే సరసన జిగర్, ప్రశాంత్ దామ్లే సరసన తూ తిథే మీ అనే సినిమాలలో నటించింది.[4]
డా. శ్రీరామ్ లాగూ, వందనా గుప్తే నటించిన సుందర్ మి హోనార్ అనే నాటకంతో మరాఠీ నాటకరంగంలోకి అడుగుపెట్టింది. చార్ దివస్ ప్రేమచే, ఏక లగ్నాచి గోష్టా, మజియా భౌజిన్నా రీట్ కలేన్ ఎ, ఏకా లగ్నాచి పుడ్చి గోష్ట్ వంటి నాటకాలలో ప్రశాంత్ దామ్లేతో కలిసి నటించింది.[5] [6]
2014లో వచ్చిన చంద్రకాంత్ చిప్లుంకర్ సీడీ బంబావాలా[7] సీరియల్ తో మరాఠీ టెలివిజన్ పరిశ్రమలో అడుగుపెట్టి చార్ దివాస్ ససుచే, కే పహిలాస్ మజ్యాత్, దార్ ఉగాడ నా గాడే, ఉంచ్ మాజా జోకా, రాధా హాయ్ బవారీ, తుమ్చా ఆమ్చా సేమ్ అస్తా, తుజ్యా వచున్ కర్మేనా, రాధా ప్రేమ్, రంగి రంగాలి మొదలైన సీరియళ్ళలో నటించింది.
నటించినవి
మార్చుసినిమాలు
మార్చుసంవత్సరం | సినిమా పేరు | పాత్ర | ఇతర వివరాలు |
---|---|---|---|
1993 | ఘయాల్ | సంగీతా మాండ్కే | తొలి సినిమా |
1995 | చల్ కన్వరియా శివ కే ధామ్ | ||
1998 | జిగర్ | లూసీ పాస్కల్/లతా పావస్కర్ | |
1998 | తూ తిథే మీ | కవిత | మరాఠీలో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారం |
2006 | లాపున్ చపున్ | ||
2008 | అనోల్ఖి హే ఘర్ మేజ్ | శుభదా దేశ్‌ముఖ్ | |
2009 | సుఖంత్ | వినా గుంజే | |
2015 | ఉర్ఫీ | అమృత తల్లి | |
2016 | డాక్టర్ రఖ్మాబాయి | జయంతీబాయి | |
2018 | అసేహి ఏకదా వ్హవే | రేణుకా పరాంజపే | |
2019 | లవ్ యు జిందగీ | నలుడు | [8] |
2019 | గర్ల్ ఫ్రెండ్ | నచికేత్ తల్లి |
నాటకరంగం
మార్చుసంవత్సరం | నాటకం పేరు | పాత్ర | మూలాలు |
---|---|---|---|
1996 | సుందర్ మి హోనర్ | సంజయ్ భార్య | |
1996 | చార్ దివస్ ప్రేమచే | [9] | |
1997 | ష్...కుతే బోలాయ్చ నహీ | ||
1998 | ఏక లగ్నాచి గోష్ట | మనీషా | [10] |
2012 | మజియా భౌజినా రీత్ కలేనా | [11] | |
2018 | ఏక లగ్నాచి పుఢచి గోష్ట | మనీషా | [12] |
టెలివిజన్
మార్చుసంవత్సరం | సీరియల్ పేరు | పాత్ర | మూలాలు |
---|---|---|---|
2000 | కామెడీ డాట్ కామ్ | సఖు | |
2000 | కే పహిలాస్ మజ్యాత్ | ||
2001-2012 | చార్ దివాస్ ససుచే | అనురాధ దేశ్‌ముఖ్ | |
2016-2012 | మేజ్వానీ పరిపూర్ణ కిచెన్ | హోస్ట్ | |
2007 | దార్ ఉఘడ నా గాడే | ఎపిసోడిక్ పాత్ర | |
2008 | జోడి జమ్లీ రే | హోస్ట్ | |
2012-2013 | ఉంచ్ మాజా జోకా | ఉమాబాయి కుర్లేకర్ | [13] |
2013-2014 | రాధ హాయ్ బవారీ | సీమా ధర్మాధికారి | |
2014-2015 | చంద్రకాంత్ చిప్లుంకర్ సీడీ బంబావాలా | హేమాలి చిప్లుంకర్ | [14] |
2015-2016 | తుమ్చా ఆమ్చా సేమ్ అస్తా | ఇషాన్ తల్లి | [15] |
2016-2017 | తుజ్య వచున్ కర్మేణ | సిద్ధార్థ్ తల్లి | [16] |
2017-2019 | రాధా ప్రేమ్ రంగి రంగాలి | మాధురీ పరాంజపే | [17] |
మూలాలు
మార్చు- ↑ "Exclusive: I never wore jeans offscreen when Char Divas Sasuche was on air", says Kavita Lad-Medhekar - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-09-03.
- ↑ "I wish, I were part of films like 'Shala' and 'Deool' - Kavita Lad Medhekar". 2012-04-01. Retrieved 2022-09-03.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Kavitha Lad biography".[permanent dead link]
- ↑ "Eye-opener: Sukhant - Indian Express". archive.indianexpress.com. Retrieved 2022-09-03.
- ↑ "Kavita Lad loves these two Marathi plays - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-09-03.
- ↑ "Post-lockdown, Eka Lagnachi Pudhchi Goshta becomes first Marathi play to return to auditoriums - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-09-03.
- ↑ "Who is firefighter Chandrakant Chiplunkar Seedi Bambawala? - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-09-03.
- ↑ "Love You Zindagi: Sachin Pilgaonkar and Kavita Lad's film will start our new year with a bang". Box Office India (in ఇంగ్లీష్). 2018-11-21. Retrieved 2022-09-03.[permanent dead link]
- ↑ "'Char Divas Premache' crosses the 1000th mark". Retrieved 2022-09-03.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Meet the Eka Lagnachi Pudhchi Gosht cast before watching them on stage - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-09-03.
- ↑ ""Mazhiya Bhaujina Reet Kalena" Marathi Natak Cast Crew Photos". MarathiStars. 2013-01-20. Retrieved 2022-09-03.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Theatre Review: Eka Lagnachi Pudhchi Goshta - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-09-03.
- ↑ "Kavita Lad exit from Char Divas Sasuche for Unch Maaza Zoka". Divya Marathi. 2012-08-04. Retrieved 2022-09-03.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "I am looking forward to another great innings with Prashant in Chandrakant Chiplunkar - Kavita Lad". Tellychakkar.com (in ఇంగ్లీష్). Retrieved 2022-09-03.
- ↑ megamarathi (2015-08-26). "Tumcha Amcha Same Asta| Star Pravah Serial". MegaMarathi.Com. Archived from the original on 2022-09-03. Retrieved 2022-09-03.
- ↑ "Tujhya Vachun Karmena - Colors Marathi Serial". MarathiStars. 2016-06-28. Retrieved 2022-09-03.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Radha Prem Rangi Rangli Colors Marathi Serial Starcast". 2017-12-17. Archived from the original on 2022-09-03. Retrieved 2022-09-03.
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో కవితా లాడ్ పేజీ
- Images at టైమ్స్ ఆఫ్ ఇండియా
- Images[permanent dead link] at మరాఠీయాక్టర్స్.కామ్
- Article about Kavita Lad in మహారాష్ట్ర టైమ్స్