శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని కసుమూరు హజరత్ సయ్యద్ కరిముల్లా షా ఖాదరీ మస్తాన్‌వలి దర్గా ఈ కసుమూరు మస్తాన్‌వలి దర్గాలో గంధోత్సవం ఘనంగా జరుగుతుంది. ఇందులో సిజరా (వంశవృక్షం పేర్లతో కూడిన పాటలు ) పాడుతారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కసుమూరు మస్తానయ్య [1] (మస్తాన్‌వలి) దర్గా సర్వమతాలకు సమ్మేళనానికి నిదర్శనం.కసుమూరు మస్తానయ్యను దర్శించేందుకు ఆంధ్ర రాష్ట్రం నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి వేలాది సంఖ్యలో భక్తులు విచ్చేస్తుంటారు.ఈ దర్గాకు ముస్లింలు మాత్రమే కాక హిందూవులు కూడా అధిక సంఖ్యలో వచ్చి స్వామి వారిని దర్శించుకుంటారు.గత 233 సంవత్సరాల నుండి ఘనంగా గంధమహోత్సవ కార్యక్రమం జరుగుతుంది.కసుమూరు మస్తానయ్య దర్గా రాష్ట్రంలోని ప్రఖ్యాతి గాంచిన పర్యాటక పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా నిలిచింది.అత్యంత సర్వాంగ సుందరమైన ఈ కట్టడం అశేష ప్రజల ఆధరాభిమానాలకు నిలయమైంది.ప్రతీ రోజూ నిత్యనైవేద్యాలతో అలరింపబడుతోంది. దర్గాకు కిసోమీటరు దూరంలో ఉన్న బంగ్లాలో గంధమహోత్సవం నాడు స్వామి వారి గంధాన్ని ఉంచి ముస్లిం మతపీఠాధిపతులు పూజలు నిర్వహించి యాదవ కులస్తుల చేతుల మీదుగా గంధాన్ని గ్రామ పురవీధుల్లో ఊరేగించి దర్గాకు తీసుకెళతారు. బాగ్లాద్‌ నగరంలో ఫాతిమాభీ, కరిముల్లా దంపతులకు మస్తాన్‌వలీ జన్మించారు.ఆయన చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించడంతో వివిధ ప్రాంతాల్లో సంచరించి చివరకు నెల్లూరు జిల్లాలోని కసుమూరు గ్రామంలో నిలిచిపోయి కొంత కాలం పశువుల కాపరిగా పశువులను మేపుతూ ఉండేవాడు.అనంతరం కాలగర్భంలో కసుమూరు గ్రామంలోని చెరువుకట్ట వద్ద సమాధి అయ్యారు.

కసుమూరు మస్తానయ్య మానసిక వైద్యునిగా ఖ్యాతి పొందారు.ఎన్ని హాస్పిటల్స్‌కు తిరిగినా నయంకాని జబ్బులతో బాధపడుతుండేవారు దర్గాలోని తన చుట్టూ తిరిగే అభాగ్యులకు నయం చేసి పంపేవారు.వివిధ ప్రాంతాల నుండి వచ్చి దర్గా ఆవరణంలో ఉంటూ స్వామి వారికి పూజలు చేసుకుంటూ ఎంతో మంది ఉంటారు.[ఆధారం చూపాలి] [2]మతిస్థిమితం లేని వారికి కాళ్ళకు సంఖ్యళ్ళు వేసిన వారు దర్గాలో వందల సంఖ్యలో వ్యాధి గ్రస్తులు ఉంటారు. దర్గాకు మూడు కిలోమీటర్ల దూరంలో వెంకట కృష్ణాపురం వద్ద బావిలో స్వామి నిత్యం స్నానమాచరించేవారు.అందుకనుగుణంగా ఈ బావిని షఫా బావిగా పిలుస్తారు.ఈ బావిలో స్నానమాచరిస్తే శారీరక రుగ్మతలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. మస్తాన్‌బాబా తన చిన్నవయస్సులో గ్రామంలో ఉండే కొండపై ఆటలాడుకునే వాడని చరిత్ర చెబుతుంది.తన చిన్న వయస్సులో తోటి స్నేహితులతో గోలీలాడు ప్రదేశాలలో భక్తులు సంచరించవచ్చు.కొండపై గేదెలు మేపుతూ నిత్యం ఒక బండపై నిద్రించే వాడు. ఆప్రాంతం గుంతగా ఏర్పడి ఉయ్యాల బండగా ఏర్పడింది.నేడు ఆ ప్రాంతాన్ని ఉయ్యాల బండగా భక్తులు పిలుస్తుంటారు.ఈ ఉయ్యాల బండలో పిల్లలు లేని వారు పడుకుంటే సంతానం కలుగుతుందని భక్తుల యొక్క విశ్వాసం.అక్కడే ఉన్న మర్రి వృక్షానికి ముడుపులు, ఉయ్యాలలు కడితే కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం.స్వామి వారి పాదాలు, జారుడుబండ వంటి ప్రదేశాలలో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.

బయటి లంకెలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-01-26. Retrieved 2015-02-06.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-08-20. Retrieved 2015-02-06.