కాంకరియా సరస్సు
కాంకరియా సరస్సు (ఆంగ్లం: Kankaria Lake) గుజరాత్ లోని అహ్మదాబాదులో గల ఒక సరస్సు. దీని పూర్వపు పేరు హౌజ్-ఏ-కుతుబ్. పట్టణం లోని ఆగ్నేయదిశలో ఉన్న మణినగర్ ప్రాంతంలో ఇది ఉన్నది. ఇది 1451 లో సుల్తాన్ కుతుబ్ ఉద్దీన్ కట్టించాడని ఒక వాదన, చాళుక్య కాలంలో నిర్మించబడినదని మరొక వాదన కలదు. 2008 లో ఈ సరస్సును పునరుద్ధరించారు. ఈ సరస్సు వృత్తాకారంలో ఉన్నది. సందర్శకులను ఆకర్షించేందుకు సరస్సు యొక్క చుట్టు ప్రక్కల జూ, రైలు బండి, కిడ్స్ సిటీ, బెలూన్ రైడ్, వాటర్ రైడ్, వాటర్ పార్క్, భోజన/ఫలహార విక్రయశాలలు వంటివి కలవు.
Kankaria Lake | |
---|---|
ప్రదేశం | Maninagar, Ahmedabad, Gujarat |
అక్షాంశ,రేఖాంశాలు | 23°00′22″N 72°36′04″E / 23.006°N 72.6011°E |
సరస్సు రకం | Artificial lake |
సరస్సులోకి ప్రవాహం | Storm water[1] |
పరీవాహక విస్తీర్ణం | 640,000 మీ2 (6,900,000 sq ft)[1] |
ప్రవహించే దేశాలు | India |
గరిష్ట పొడవు | 560 మీ. (1,840 అ.) |
గరిష్ట వెడల్పు | 560 మీ. (1,840 అ.) |
ఉపరితల వైశాల్యం | 76 ఎకరం (31 హె.) |
సరాసరి లోతు | 6 మీ. (20 అ.)[1] |
గరిష్ట లోతు | 7 మీ. (23 అ.)[1] |
తీరంపొడవు1 | 2.25 కి.మీ. (1.40 మై.)[1] |
Islands | Nagina wadi[1] |
ప్రాంతాలు | Ahmedabad |
1 Shore length is not a well-defined measure. |
వ్యుత్పత్తి
మార్చుసరస్సును తవ్వకంలో పలు కంకర రాళ్ళు బయల్పడటంతో దీనికి ఈ పేరు వచ్చినదని నానుడి. సుల్తాన్ కుతుబుద్దీన్ సరస్సును నిర్మించుటకు సరియైన ప్రదేశం సూచించమని షాహ్ ఆలం అనే మునిని కోరగా అతను విసిరి వేసిన కంకర రాళ్ళ మధ్యలోనే సరస్సును తవ్వారని, అందుకే, దీనికి ఆ పేరు వచ్చినదని మరొక వాదన కలదు. ఇంకో వాదన ప్రకారం తవ్వకాలు జరిపే సమయంలో హజరతి షాహ్ ఆలం పాదానికి కంకర రాళ్ళ వలన గాయం అయినదని, అందుకే ఈ పేరు వచ్చినది అని ప్రతీతి.
కమలా నెహ్రూ జంతు ప్రదర్శన శాల
మార్చుసరస్సుకు ఒక ప్రక్కన ఉన్న జంతు ప్రదర్శనశాల లో ఏనుగు, నెమళ్ళు, మొసళ్ళు, పులులు, సింహాలు కలవు.
-
జంతు ప్రదర్శన శాలలో ఉన్న తెల్లపులి