కాంతార
కాంతారా 2022లో విడుదలైన తెలుగు సినిమా. కన్నడలో హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ సినిమాకు దర్శకత్వం వహించగా రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగులో గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ తెలుగులో విడుదల చేసింది. రిషబ్ శెట్టి, కిషోర్‌కుమార్, అచ్యుత్ కుమార్, సప్తమిగౌడ, ప్రమోద్‌శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 30న కన్నడలో విడుదలై, తెలుగులో అక్టోబర్ 15న విడుదలైంది.[2] రిషభ్ శెట్టి నటనకుగాను జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం దక్కింది.[3]
కాంతారా | |
---|---|
దర్శకత్వం | రిషబ్ శెట్టి |
రచన | రిషబ్ శెట్టి |
నిర్మాత | విజయ్ కిరగందూర్ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | అరవింద్ ఎస్ కశ్యప్ |
కూర్పు | కే. ఎం. ప్రకాష్ ప్రతీక్ శెట్టి |
సంగీతం | బి. అజనీష్ లోక్‌నాథ్ |
నిర్మాణ సంస్థ | |
పంపిణీదార్లు | గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ |
విడుదల తేదీ | 2022 అక్టోబర్ 15 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | 16 కోట్లు |
బాక్సాఫీసు | 400 కోట్లు[1] |
కథ
మార్చు18వ శతాబ్దంలో మొదలైన ఈ కథ 90దశకంలోకి ప్రవేశించి గ్రామానికి చెందిన దొర కుటుంబం (అచ్యుత్ కుమార్) తరతరాలుగా పల్లె ప్రజలకు అండగా ఉంటూ వాళ్లకు సమస్యలు వస్తే ముందు నిలుచుంటాడు. ఆయనకి అదే గ్రామానికి చెందిన శివ(రిషబ్ శెట్టి) కొన్ని పనుల్లో దొరకు సహాయంగా ఉంటాడు. ఈ క్రమంలో ఆ గ్రామానికి ఫారెస్ట్ అధికారిగా మురళీ (కిశోర్) వస్తాడు.
కొన్నేళ్ల తర్వాత ఆ భూమి రిజర్వ్ ఫారెస్ట్‌లో భాగమని, దానిని ఊరి ప్రజలు ఆక్రమించుకున్నారని ఫారెస్ట్ ఆఫీసర్ (కిశోర్) సర్వే చేస్తుంటాడు. ఊరిలో యువకుడు శివ (రిషబ్ శెట్టి)కి, ఫారెస్ట్ ఆఫీసర్‌కి గొడవలు కూడా అవుతాయి. ఈ క్రమంలోనే అనుకోని సంఘటన జరిగి శివ జైలుకు వెళ్తాడు. శివ జైల్లో ఉన్న సమయంలో అతడి మిత్రుడు గురువా (స్వరాజ్ శెట్టి) హత్యకు గురవుతాడు. ఇంతకీ హత్య చేసింది ఎవరు? తన గ్రామం కోసం భూమిని శివ కాపాడుకున్నాడా ? లేదా ? అనేదే మిగతా సినిమా కథ.[4][5]
ఇందులో భూతకోల దేవతలు కూడా చిత్రీకరించబడ్డారు.
నటీనటులు
మార్చు- రిషబ్ శెట్టి - శివ
- సప్తమి గౌడ - లీలా[6]
- కిషోర్‌కుమార్ - మురళీధర్, డిప్యూటీ రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ (DRFO)
- అచ్యుత్ కుమార్ - దొర
- నవీన్ డి పాడిల్ - లాయర్
- మానసి సుధీర్ - కమల, శివ తల్లి
- స్వరాజ్ శెట్టి - గురువా
- ప్రమోద్ శెట్టి - మోహన
- షానిల్ గురు
- ప్రకాష్ తుమినాడ్
- దీపక్ రాయ్ పనాజే
- రక్షిత్ రామచంద్ర శెట్టి
- చంద్రకళా రావు
- పుష్పరాజ్ బొల్లార
- రఘు పాండేశ్వర్
- పుష్పరాజ్ బొల్లూరు
- మైమ్ రాందాస్
- బసుమ కొడగు
- రంజన్ సాజు
- రాజీవ్ శెట్టి
- అతీష్ శెట్టి దేవేంద్ర
- రాధాకృష్ణ కుంబాలే
- నవీన్ బొండెల్
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: హోంబలే ఫిలింస్
- నిర్మాత: విజయ్ కిరగందూర్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రిషబ్ శెట్టి
- సంగీతం: బి. అజనీష్ లోక్‌నాథ్
- సినిమాటోగ్రఫీ: అరవింద్ ఎస్ కశ్యప్
మూలాలు
మార్చు- ↑ Namasthe Telangana (23 November 2022). "అరుదైన రికార్డు సాధించిన కాంతార..!". Archived from the original on 24 November 2022. Retrieved 24 November 2022.
- ↑ TV9 Telugu (11 October 2022). "అదిరిపోయే సినిమాలు, సిరీస్‌లతో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్..ఈ వారం థియేటర్లు, ఓటీటీ రిలీజులివే". Archived from the original on 13 October 2022. Retrieved 13 October 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "National Film Awards: జాతీయ చలనచిత్ర పురస్కారాలు: హీరో- రిషభ్, హీరోయిన్లు - నిత్య మేనన్, మానసి పరేఖ్". EENADU. Retrieved 2024-08-16.
- ↑ Eenadu (17 October 2022). "రివ్యూ: కాంతార". Archived from the original on 17 October 2022. Retrieved 17 October 2022.
- ↑ "'కాంతార' మూవీ రివ్యూ". 15 October 2022. Archived from the original on 17 October 2022. Retrieved 17 October 2022.
- ↑ "ఆ హద్దులేం లేవు.. దేనికైనా రెడీ అంటున్న హీరోయిన్ సప్తమి గౌడ" (in ఇంగ్లీష్). 18 October 2022. Archived from the original on 18 October 2022. Retrieved 18 October 2022.