కాకినాడ టౌన్ - తిరుపతి స్పెషల్ ఎక్స్‌ప్రెస్

కాకినాడ టౌన్ - తిరుపతి స్పెషల్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలు.[1] ఇది కాకినాడ టౌన్ రైల్వే స్టేషను, తిరుపతి రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.[2]

జోను , డివిజను

మార్చు

ఈ ఎక్స్‌ప్రెస్ రైలు భారతీయ రైల్వేలు లోని దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది. రైలు నంబరు: 07431. ఈ రైలు వారానికి ఒక రోజు (శనివారం) నడుస్తుంది.

ప్రత్యేక సేవలు

మార్చు

ప్రయాణీకుల రద్దీ ననుసరించి రైలు నంబరు: 07431 కాకినాడ టౌన్ - తిరుపతి స్పెషల్ ఎక్స్‌ప్రెస్ 2016, 23 వ జనవరి నుండి 19:00 గంటలకు కాకినాడ టౌన్ లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 07.05 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.[3] ఈ క్రమంలో, ఈ ప్రత్యేక రైలు సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, తెనాలి, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది.

ఈ ప్రత్యేక రైలు 15 కోచ్‌లు కలిగి ఉంటుంది. ఇందులో ఒక ఏసీ టూ టైర్, ఒక ఏసీ త్రీ టైర్, ఎనిమిది స్లీపర్ క్లాస్, రెండు సాధారణ రెండవ తరగతి, ఒక చైర్ కారు, రెండు రెండవ తరగతి లగేజీ కం బ్రేక్ వ్యాన్ కోచ్‌లు ఉంటాయి.

మూలాలు

మార్చు