కాజల్‌గావ్
కాజల్‌గావ్, అసోం రాష్ట్రంలోని చిరాంగ్ జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కార్యాలయం. బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ పరిధిలో ఈ పట్టణం ఉంది. బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ అస్సాం రాష్ట్రంలోని బోడోలాండ్ టెరిటోరియల్ ఏరియా జిల్లాలను నియంత్రిస్తుంది.[1] రాష్ట్ర రాజధానికి 152 కి.మీ.ల దూరంలో ఉంది.
Kajalgaon | |
---|---|
పట్టణం | |
Coordinates: 26°28′27″N 90°33′52″E / 26.474226°N 90.564443°E | |
దేశం | India |
రాష్ట్రం | అసోం |
జిల్లా | చిరంగ్ |
Government | |
• Body | Kajalgaon Municipal Board |
Languages | |
• Official | Bodo |
Time zone | UTC+5:30 (IST) |
ISO 3166 code | IN-AS |
Vehicle registration | AS-26 |
భౌగోళికం
మార్చుకాజల్గావ్ పట్టణం దక్షిణం వైపు డాంగ్‌టోల్ తహసీల్, బొంగైగావ్ తహసీల్, శ్రీజాంగ్రామ్ తహసీల్, తూర్పు వైపు బోరోబజార్ తహసీల్ ఉన్నాయి. బొంగైగావ్, కోక్రఝార్, బిలాసిపారా, గోల్‌పారా వంటి నగరాలు కాజల్‌గావ్‌కు సమీపంలో ఉన్నాయి. ఈ స్థలం చిరాంగ్ జిల్లా, బొంగైగావ్ జిల్లాల సరిహద్దులో ఉంది.
పరిపాలన
మార్చుఈ పట్టణం పరిపాలన, అభివృద్ధి కార్యకలాపాలను కాజల్‌గావ్ పట్టణ కమిటీ నిర్వర్తిస్తోంది. కాజల్‌గావ్ పిన్ కోడ్ 783385 కాగా, పోస్టల్ ప్రధాన కార్యాలయం ధాలిగావ్ వద్ద ఉంది.
రవాణా
మార్చురైలు మార్గం డాంగ్టాల్ రైల్వే స్టేషను, న్యూ బొంగైగావ్ యార్డ్ రైల్వే స్టేషను కాజల్‌గావ్ పట్టణానికి చాలా దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్లు.
మూలలు
మార్చు- ↑ "Kajalgaon Village". www.onefivenine.com. Retrieved 2020-12-21.