కాడు మల్లేశ్వర దేవాలయం
కాడు మల్లేశ్వర దేవాలయం, బెంగుళూరులోని మల్లేశ్వరం ప్రాంతంలో ఉన్న శివాలయం. సా.శ. 17వ శతాబ్దంలో నిర్మించబడిన హిందూ దేవాలయం. ఈ దేవాలయం పేరుమీదుగా ఈ ప్రాంతానికి మల్లేశ్వరం అనే పేరు పెట్టారు.[1] ప్రధాన గర్భగుడి లోపల ఒక పెద్ద శివలింగం ఉంది.
కాడు మల్లేశ్వర దేవాలయం | |
---|---|
భౌగోళికం | |
భౌగోళికాంశాలు | 13°00′18″N 77°34′17″E / 13.004966°N 77.5714462°E |
చరిత్ర
మార్చుసా.శ. 17వ శతాబ్దంలో మరాఠా రాజు శివాజీ సోదరుడు వెంకోజీ ద్రావిడ శైలిలో ఈ దేవాలయాన్ని నిర్మించాడు.[2] శివుడిని మల్లికార్జునుడిగా పూజిస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలో నందిశ్వర తీర్థ (బసవ తీర్థ) దేవాలయం కూడా ఉంది. దీనిన వృషభవతి నది యొక్క ప్రధాన వనరు లేదా జన్మస్థలం అని అంటారు.
నిర్మాణ శైలి
మార్చుబెంగళూరులోని ఘనత పొందిన అనేక పాత దేవాలయాలలో ఇదీ ఒకటి. దాదాపు 200 సంవత్సరాల క్రితం ద్రవిడ శైలిలో నిర్మించబడింది. ఇక్కడ శివుడితోపాటు పార్వతి దేవిని కూడా పూజిస్తారు. ప్రధాన ఆలయ ప్రాంగణం ముందు నందిశ్వర తీర్థ ఆలయం కూడా నిర్మించబడింది. ఈ ఆలయ సముదాయం విస్తారమైన తోట మధ్యలో విస్తరించి ఉంది. 1669లో "శివలింగం" మీద ఉన్న శాసనాలలో ఛత్రపతి శివాజీ సోదరుడు వెంకోజీకి చెందిన చరిత్ర తెలియజేస్తోంది.
ఉత్సవాలు
మార్చుఈ ఆలయంలో సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు ఉదయం 7 నుండి మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు పూజలు నిర్వహించబడుతాయి. ఈ ఆలయంలో దాదాపు అన్ని పండుగలను ఆచారాలతో జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం శివరాత్రి సందర్భంగా ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి. ఇక్కడ ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వ సమయంలో పదిహేను రోజుల ఉత్సవం ఏర్పాటు చేయబడుతోంది. ఈ పెద్ద పండుగను జరుపుకునేందుకు స్థానిక భక్తులు, నిర్వాహకులు ఒక వేడుకను నిర్వహిస్తారు. భక్తులు ఈ రాత్రి ఉపవాసం పాటిస్తూ, శివలింగం మీద పండ్లు, పువ్వులు, బెల్ ఆకులను సమర్పిస్తారు.
మూలాలు
మార్చు- ↑ "Temples of Malleshwaram – Venugopal Swamy, Kaadu Malleshwara and Sai Baba Temple". Archived from the original on 23 నవంబరు 2019. Retrieved 6 February 2021.
- ↑ Dasharathi, Poornima. "A whiff of Malleswaram". Citizen Matters. Retrieved 6 February 2021.