బలిజ

(కాపు నుండి దారిమార్పు చెందింది)

దక్షిణ భారతదేశంలో అతిపెద్ద సామాజిక వర్గమైన బలిజ, ముఖ్యముగా తెలుగు నాట ప్రముఖమైన వ్యాపార సామాజిక వర్గము. ఈ కులము ఆంధ్ర ప్రదేశ్,తెలంగాణా, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సాలలో విస్తరించి ఉంది.

బలిజ వధూవరులు - 1900 ల నాటి ఫొటో

బలిజ పదం మూలంసవరించు

  • వీరినే తమిళనాడులో కవరై అని, కర్ణాటకలో బనజిగర్ అని కూడా అంటారు...ఉత్తరాదిన "బనియా, "వనియా" అనీ అంటారు. ఈ పేర్లన్నీ "వణిజ" అనే మూల సంస్కృత పదమునుండి వచ్చినవి.
  • వీరినే గౌరీదేవి పేరుమీద గౌరీపుత్రులు అనీ, గవరై, కవరై అని పిలిచేవారు. యజ్ఞ సంభవులవుట వలన "బలిజలు" అని పిలువబడినారు, బలి చక్రవర్తి పేరుమీద ఆతని సంతతులు "బలిజలు" అని కూడా పిలువబడినారు.

చరిత్రసవరించు

  • బలిజలు ఆర్యావర్తనంలోని అహిచ్ఛత్రపురము నుండి దక్షిణాపథమునకు వచ్చినవారము అని తమచే వేసుకోబడిన అనేక శాసనాలలో చెప్పుకుంటూ వచ్చినారు. వీరు నేటి కర్ణాటకలోని ప్రపంచప్రసిద్దిగాంచిన, చాళుక్యులు వంశీయులకు తొలిరాజధానిగా వర్ధిల్లిన ఐహోలు అనే ఆర్యాపురం ముఖ్య కేంద్రముగా దక్షిణాది అంతా విస్తరించారు. దీనినే అయ్యావళి అని పిలిచేవారు. వీరు అహిచ్ఛత్ర పురవరాధీశ్వరులు, అయ్యావళి పురవరాధీశ్వరులు అని పేర్కొనబడేవారు. 56 దేశాలవారు అని పిలువబడేవారు. మహాజనులు అని పిలువబడేవారు. వీరు శెట్టి, సేట్, శ్రేష్టి లను తమ పేర్ల చివర ప్రధానంగా ధరిస్తారు.
  • చాళుక్యులు, చోళులు, విజయనగర, మదురై, తంజావూరు, జింజి, కండి, కేలడీ వంటి రాజ వంశ సంతతులు కూడా బలిజవారిలో కలిసి క్షత్రియ బలిజ వారిగా పేర్కొనబడినారు.[ఆధారం చూపాలి] ఈ విధంగా బలిజవారు తరతరాలుగా వేల సంవత్సరాల నుండి వ్యాపార వాణిజ్యాలతో బాటు రాచరిక పరిపాలనలలో నిమగ్నమై ఉన్న వర్గం అని చరిత్ర ఉన్నది.

వ్యాపారంసవరించు

  • 56 దేశాలలోనూ, 9 ఖండాలలోనూ నవరత్నాలు, బంగారం, వెండి, ఏనుగులు, గుర్రాలు, సుగంధ ద్రవ్యాలు, గాజులు, పసుపు, కుంకుమ, పూసలు, ఆహార ధాన్యాలు, కలప, ఇత్తడి, రాగి పాత్రలు వంటి సమస్తమైన వాణిజ్య "వ్యాపారాలు" చేసేవారు. గొప్ప గొప్ప నావికాదళాలతో తూర్పుదేశాలలో వలస వ్యాపార స్థావరాలు ఏర్పాటుచేసుకొనెను.

సామాజిక హోదాసవరించు

  • వీర బలిజ సమయ ధర్మ ప్రతిపాలకులు, అన్నికులాలకు కులపెద్దలుగా వ్యవహారాలూ చక్కబెట్టే పెద్దరికం కలిగినవారు.. కులపెద్దలుగా "బలిజ మహానాడు"లు నిర్వహించేవారని శాసనాలలో పేర్కొన్నారు. 
  • శెట్టి, పెద్ద శెట్టి, గావుండ, దేశాయి, దేశాయి శెట్టి, రాయ, రాయుడు, రాయలు, నాయుడు, రావు, దొర గారు మొదలగునవి వీరి ప్రధాన పట్టపు బిరుదులు.

ఉప కులాలుసవరించు

  • వీరు ఋగ్వేదం, రామాయణం, మహాభారతం వంటి పురాణ గ్రంధాలలోను, జైన, బౌద్ధ వాఙ్మయాలలోనూ వర్ణించబడినారు. వీరు 56 దేశాలలో ఆయా దేశాల పేర్లతో కూడా పిలవబడతారు. కన్నడ ప్రాంతం వారు "కన్నడ బలిజ" అని, తమిళ ప్రాంతం వారు "ఆరవ బలిజ" అని, తెలుగు ప్రాంతం వారు "తెలుగు బలిజ" లేదా "తెలగబలిజ" అని పిలవబడ్డారు. ఈ బలిజవారిలో అనేక ఉప కులాలు వర్గాలు ఉన్నాయి. వాటిలోకొన్ని: రాచబలిజ, క్షత్రియబలిజ, తుర్వ బలిజ, తుళువ కవరై, రాహుతబలిజ, ఒప్పనకారబలిజ, ముసుగుబలిజ, రత్నాలబలిజలు, తెలగబలిజ, పట్టణశెట్టి, పట్టణస్వామి, వలయాలసెట్టి, గాజులబలిజ, గంధంబలిజ, పువ్వులబలిజ, బలిజిగ, బందరుకవరై, కవరై వడుగన్, లింగమండికవరై, కవరై చెట్టి, రాయదుర్గంబలిజ, కాంచిపురంబలిజ, వక్కలబలిజ, ఉప్పుకవరై, నాయుడు, అరవబలిజ, ఆకుబలిజ, బలిజశెట్టి, బుట్టిబలిజ, పెరికబలిజ, బలిజనాయుడు, దూదిబలిజ, ఏనూటిబలిజ, గవరబలిజ, గండవరంబలిజ, కుల్లూరుబలిజ, గోపతిబలిజ, గోనుగుంటబలిజ, గుగ్గిళ్ళబలిజ, మిరియాలబలిజ, గురుబలిజ, గోరిబలిజ, గౌరబలిజ, గోనిబలిజ,కొండేటిబలిజ, లింగబలిజ, మహతడిబలిజ, నీలిబలిజ, పెదకంటిబలిజ, పాటిబలిజ, పలాసకవరై, పగడాలబలిజ, రాజమహేంద్రవరంబలిజ, శెట్టిబలిజ, తోటబలిజ, తొగరుబలిజ, ఆదిబనజిగ, జైనబణజిగ, సజ్జనబలిజ, లింగాయత బలిజ, దాసబలిజ, విజయనగరంబలిజ, పెనుకొండబలిజ, చంద్రగిరిబలిజ, గంజాముబలిజ, ఓరుగంటిబలిజ, దేశాయిశెట్టి, మహానాటిబలిజలు, ముత్యాలబలిజలు, రాళ్ళ బలిజలు, కండీబలిజలు, కొయిలడిబలిజలు, మహాజనబలిజ, చిత్రాలబలిజ, పత్తిబలిజ, జనపబలిజ, ఓడబలిజ, వలసబలిజ, పూందమల్లిబలిజ ఇలా ఎన్నో ఎన్నెన్నో బలిజ ఉప కులాలు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఒడిషా, కేరళ, పాండిచ్చేరి, ఆంద్ర, ఉత్తరభారతం, శ్రీలంక లలో గణనీయంగా ఉన్నాయి.

రాజకీయ ప్రముఖులుసవరించు

పుంజాల శివ శంకర్,

అన్నయ్యగారి సాయి ప్రతాప్,

బండారు రత్నసభాపతి శెట్టి,

చెన్నంశెట్టి రామచంద్రయ్య,

మాదాసు గంగాధరం,

కళారంగంలో ప్రముఖులుసవరించు

వ్యాపారవేత్తలుసవరించు

దళవాయి ఆదికేశవులు నాయుడు

గాజుల లక్ష్మీనరసు చెట్టి

మూలాలుసవరించు

https://www.google.co.in/books/edition/Questioning_Ramayanas/7RW6MrAiJ-0C?hl=en&gbpv=1&dq=katta+varadaraju+balija&pg=PA166&printsec=frontcover

"https://te.wikipedia.org/w/index.php?title=బలిజ&oldid=3867684" నుండి వెలికితీశారు