కాప్రొలిక్ ఆమ్లం అనునది ఒక కొవ్వు ఆమ్లం.ఒక ద్విబంధాన్ని కలిగిన అసంతృప్త కొవ్వు ఆమ్లం.కొవ్వు ఆమ్లాలు ఒకరకమైన మోనోకార్బోక్సిలిక్ ఆమ్లాలు.ఆమ్ల సమ్మేళనంలో హైడ్రోకార్బన్ లతోకూడిన ఒకసరళమైన, శాఖరహితమైన గొలుసు వలె ఏర్పడిన నిర్మాణంలో ఒక చివర ఒకే కార్బోక్సిల్ (COOH) సమూహాన్ని కలిగివున్న దానిని మోనోకార్బోక్సిలిక్ ఆమ్లం (Mono carboxlyic acid) అని అంటారు[1].

కాప్రోలిక్ ఆమ్ల నిర్మాణం-ఇతరలక్షణాలుసవరించు

కాప్రోలిక్ ఆమ్లం హైడ్రోకార్బను శృంఖలంలో 10 కార్బనులను కలిగి, ఒకద్వింధాన్ని 9 వకార్బన్ వద్ద కలిగివున్న అసంతృప్త ఆమ్లం[2]. సాధారణంగా ద్విబంధాలనేవి కొవ్వు ఆమ్లంలో హైడ్రోకార్నన్ గొలుసులో ఇరువైపుల వున్న మిథైల్ (CH3), కార్బోక్సిల్ (COOH) సమూహాంలో వున్న కార్బన్ పరమాణులను మినహాయించి ద్విబంధాన్ని ఏర్పరచుతాయి.కానీ కార్పోలిక్ ఆమ్లంలో 9 వ కార్బన్ వద్ద (9-10 కార్బనుల మధ్య) ద్విబంధం ఏర్పడినది, ఫలితంగా పదవ కార్బన్ యొక్క మూడు హైడ్రోజనులలో ఒక హైడ్రోజన్ తొలగింబడి=CH2ఏర్పడుతుంది. కాప్రోలిక్ ఆమ్లంయొక్క సాధారణ అణుఫార్ములా C10H18O2.హైడ్రోకార్బన్ గొలుసులో ద్విబంధాన్ని సూచించే అణుఫార్ములా H2C=CH (CH2) 7-COOH. కాప్రోలిక్ ఆమ్లం యొక్క శాస్త్రీయమైన పేరు 9-డొసెనోయిక్ ఆమ్లం (9-decenoic acid).ఆమ్లంయొక్క అణుభారం 170.25.ఆల్కహాల్ లలో కరుగుతుంది. నీటిలో 25 °C వద్ద ఒకలీటరు నీటిలో 74.1 గ్రాంలవరకు కరుగుతుంది[3] .

ఆమ్లంయొక్క భౌతిక, రసాయనిక ధర్మాల పట్టిక '[4]

గుణము విలువల మితి
శాస్త్రీయ పేరు 9-డెసెనోయిక్ ఆసిడ్ (9-DECENOIC ACID)
స్థితి వర్ణరహితం లేదా లేదా పసుపు.
ద్రవ రూపంలో వుండును
వక్రీభవన సూచిక,20 °C వద్ద 1.445-1.449
విశిష్ట గురుత్వం,25 °C వద్ద 0.914-0.920
బాష్పీకరణ ఉష్ణోగ్రత 277.55 °C
ఫ్లాష్ పాయింట్ 177.7 °C

ఉపయోగాలుసవరించు

ఇవికూడా చూడండిసవరించు

బయటి లింకులుసవరించు

  1. http://www.parchem.com/chemical-supplier-distributor/9-decenoic-acid-009441.aspx

మూలాలు/ఆధారాలుసవరించు

  1. "Carboxylic Acids". www2.chemistry.msu.edu/. Retrieved 2013-11-30. Cite web requires |website= (help)
  2. "caproleic acid". rgd.mcw.edu/. Retrieved 2013-11-30. Cite web requires |website= (help)
  3. "9-decenoic acid". thegoodscentscompany.com. Retrieved 2013-11-30. Cite web requires |website= (help)
  4. "Product Information". bedoukian.com. మూలం నుండి 2015-01-08 న ఆర్కైవు చేసారు. Retrieved 2013-11-30. Cite web requires |website= (help)