కామధేనువు
హిందూ పురాణాలలో, కామధేనువు (English: Kamadhenu), (సంస్కృతం: कामधेनु) అతి పవిత్రమైన ధేనువు అనగా ఆవు. గోమాత సర్వదేవతలు కొలువై వుంటారు. అందుకే గోమాతను పూజిస్తే సకల దేవతలను పూజించినంత ఫలితం దక్కుతుంది. పశువులన్నింటికీ మూలం కామధేనువు అని పురాణాలు చెబుతున్నాయి. అమృతం కోసం దేవతలు, రాక్షసులు ఆదిశేషువు తాడుగా మంధర పర్వతాన్ని కర్రగా చేసుకుని క్షీర సాగరాన్ని మథిస్తారు. అయితే ఆ క్షీర సాగర మథనంలో కామధేనువు కూడా మథనం నుంచి ఉద్భవిస్తుంది. ఈ ఆవునే సురభి అని కూడా పిలుస్తారు. లోకంలో ఉన్న పశుసంపదలన్నిటికీ ఈ కామధేనువే ఆధారం అని పురాణాలు చెప్తాయి. కామధేనువు ఇంద్రుడి వద్ద ఉంటుంది. మరికొన్ని పురాణగాథల్లో వశిష్ఠుడి ఇంటిలో, కొన్ని పురాణగాథల్లో గౌతమ ముని వద్ద ఉన్నట్టు కనిపిస్తుంది. కామధేనువు వశిష్టుని తపస్సు కోసం కావలసినవన్నీ ప్రసాదించింది. కామధేనువు పుత్రిక శబల అనే గోవు, కామధేనువు పుత్రుడు నంది. ఏ పురాణంలో అయినా కామధేనువు మాత్రం, ఏది కోరినా దాన్ని తక్షణమే ప్రసాదించే మహిమ గలది.
కొన్ని పురాణగాథల్లో
మార్చు- కామధేనువు సురభి ఆవు ఉద్భవించడం వెనుక పలు రకాల భిన్నమైన కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అవేమిటంటే…[1]
- రామాయణము ప్రకారమైతే రుషి కశ్యపుడు, అతని భార్య క్రోధవశల కుమార్తె సురభి. ఆమెకు మళ్లీ ఇద్దరు కూతుళ్లు జన్మిస్తారు. వారు రోహిణి, గోదావరి. ఈ క్రమంలో సురభి కోరిన కోర్కెలు తీర్చే కామధేనువుగా మారిందని పురాణాలు చెబుతున్నాయి.
- ఇంద్రుడు వశిష్ట మహర్షి యొక్క యజ్ఞాలకు మెచ్చి పుత్రిక అయిన శబల అనే గోవుని ఇస్తాడు. ఇది కామధేనువు లాగే తన యజమానికి ఏది కోరితే అది ఇవ్వగలదు.
- దేవీభాగవతము చెబుతున్న దాని ప్రకారమైతే శ్రీకృష్ణుడే స్వయంగా సురభి ఆవును బృందావనంలో సృష్టించాడట ... గోపికలతో బృందావనంలో నాట్యమాడుతుండగా అకస్మాత్తుగా కృష్ణునికి తీవ్రమైన దాహం వేస్తుందట. దీంతో శ్రీకృష్ణుడు అప్పటికప్పుడే సురభిని సృష్టించి దాని పాలను తాగుతాడట.
- అయితే మహాభారతం ప్రకారం ... వశిష్ఠ మహర్షి తలపెట్టిన భూయాగం పట్ల దేవేంద్రుడు అసహనానికి లోనవుతాడు. ఆ ప్రాంతంలో కరవు కాటకాలను సృష్టిస్తాడు. ఆశ్రమంలోని శిష్యులంతా ఆకలితో బాధలు పడుతుంటారు.అరుంధతి బిడ్డల ఆకలి తీర్చే శక్తిని ప్రసాదించమని పార్వతి దేవి అమ్మవారిని కోరుతుంది. అమ్మవారు అరుంధతికి గోమాతను ఇస్తు కామధేనువు మహిమ ఆ తల్లి సెలవిస్తుంది. అరుంధతి ఆశ్రమంలోని అందరి ఆకలిని తీరుస్తుంది.[2]
- హిందూ పత్రిక చిహ్నంలో కామధేనువు, [3] ఐరావతం ప్రముఖంగా కనిపిస్తాయి.
మూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-07-20. Retrieved 2020-07-20.
- ↑ "వశిష్ఠ మహర్షి అరుంధతి పుణ్యదంపతులు.. కామధేనువు..!". telugu.webdunia.com. Retrieved 2020-07-20.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-06-04. Retrieved 2020-06-04.