కామరాజుపేట , తూర్పు గోదావరి జిల్లా, గోకవరం మండలానికి చెందిన గ్రామం.

ఇరవయ్యో శతాబ్దపు ప్రారంభంలో కామరాజుగారనే జమీందారు ఏర్పరచిన పల్లె ఈ కామరాజుపేట అని చెబుతారు. ఇది కొత్తపల్లికి జంట పల్లె. గోకవరంనకు ఐదు మైళ్ళ దూరంలో ఉంది.మధ్యలో దొంగ ఏరు దాటి వెళ్ళాలి. ఇప్పుడు వంతెన వుంది గాని, 1970 ల వరకు ఈ వంతెన సదుపాయమే వుండేది కాదు. ఇప్పటికీ సినిమాలకీ, బట్టలకీ గోకవరానికి వెళ్ళటం ఈ పల్లెకు అలవాటు.

మూలాలు

మార్చు