కామశాస్త్రం : భారతీయ సాహిత్యంలో "కామం" గురించి, శాస్త్రీయ దృక్ఫదంతో రచించబడిన సాహిత్యం. చాణక్యుడు ఆర్థికశాస్త్రం గురించి రచించిన అర్థశాస్త్రం లాగానే, కామశాస్త్రంకూడా ఒక శాస్త్రీయ గ్రంథము. కామశాస్త్రం, నాగరికుల కొరకు సశాస్త్రీయ జ్ఞానంతో, శారీరక ఇచ్ఛను పొందే మార్గాలను సూచించే సాహిత్యం.

వాత్సాయన మహర్షి రాసిన కామసూత్ర పుస్తకం లోని ఒక పేజీ

ప్రాచీన సాహిత్యాలలో ఇప్పటికీ లభ్యమవుతున్న గ్రంథం కామసూత్ర. దీనిని వాత్స్యాయనుడు రచించాడు. వాత్స్యాయనుడి తరువాత, అనేకులు అనేక గ్రంథాలు వ్రాశారు, వాటిలో లభ్యమవుతున్నవి, ముఖ్యమైనవి;

ఎటైమాలజీ

మార్చు

కామ (ఆంగ్లం : Kama) (సంస్కృతం : काम కామ) ఒక సంస్కృత పదజాలము. అర్థం, కోరిక, వ్యామోహం, కాంక్ష, మరీ ముఖ్యంగా శారీరక కాంక్ష.[1] హిందూ సంస్కృతిలో మన్మథుడు కామదేవుడు.

కామశాస్త్ర పుస్తకాల జాబితా

మార్చు

పోగొట్టబడిన పుస్తకాలు

మార్చు
  • కామశాస్తం - నంది లేదా నందికేశ్వరుడు. (1000 అధ్యాయాలు)
  • కామశాస్తం - అద్దులాకి శ్వేతకేతు (500 అధ్యాయాలు)
  • కామశాస్తం లేదా బభ్రవ్యాకరిక
  • కామశాస్తం - చారాయణ
  • కామశాస్తం - ఘోటకముఖ
  • కామశాస్తం - గోనర్దీయ
  • కామశాస్తం - గోనికపుత్ర
  • కామశాస్తం - దత్తక. ఓ కథనం ప్రకారం రచయిత కొద్దికాలంకొరకు స్త్రీగా మారాడు.
  • కామశాస్తం లేదా రాతినిర్యాణ - సువర్ణనాభ

మధ్యకాలం , నవీన కాలపు పుస్తకాలు

మార్చు
  • కళ్యాణమల్ల : అనంగరంగ
  • దత్తకసూత్ర : 2వ మహదేవుడు (గంగా సామ్రాజ్యపు రాజు)
  • జనవశ్య : కల్లారస, కొక్కాకుడు రచించిన "రతిరహస్యం" ఆధారంగా.
  • జయమంగల, - యశోధర.
  • జయ : దేవదత్త శాస్త్రి (హిందీ వ్యాఖ్యానం) కామసూత్రపై వ్యాఖ్యానం 20వ శతాబ్దం.
  • కామసమూహ - అనంత (15వ శతాబ్దం)
  • కామసూత్ర
  • కందర్ప చూడామణి
  • కుచోపనిషద్ లేదా కుచుమార తంత్రం - కుచుమార (10వ శతాబ్దం)
  • కుట్టనిమాత - దామోదర గుప్త, కాశ్మీరీ కవి (8వ శతాబ్దం).
  • మనసోల్లాస లేదా అభిలషితార్థ చింతామణి - రాజు సోమదేవ III (చాళుక్య రాజ్యం) [1] [2]
  • నాగర సర్వస్వం - బిక్షు పద్మశ్రీ (బౌద్ధుడు) (10వ/11వ శతాబ్దం)
  • పంచశయాక - జ్యోతిరీశ్వర కవిశేఖర (పంచశాక్య) (14వ శతాబ్దం)
  • రసమంజరి - [[:en:Bhânudatta|భానుదత్తుడు]]
  • రతికల్లోలిణి - దీక్షిత సమారాజ.
  • రతిరహస్య - కొక్కోకుడు
  • రతిమంజరి - జయదేవుడు
  • రతిరత్నప్రదీపిక - ప్రౌఢ దేవరాజ (విజయనగర రాజు, 15వ శతాబ్దం)
  • శృంగారరస ప్రబంధ దీపిక - కుమార హరిహర
  • స్మారదీపిక - మీననాధ
  • సమయమాతృక - క్షేమేంద్ర
  • శృంగారదీపిక - హరిహర
  • స్మార ప్రదీపిక - గుణకర, వాచస్పతి కుమారుడు
  • సూత్ర వృత్తి - నారింఘ శాస్త్రి 18వ శతాబ్దం, కామసూత్రపై వ్యాఖ్యానం.
  • వాత్స్యాయన సూత్రసారము - క్షేమేంద్ర, కాశ్మీరీ రచయిత, కామసూత్రపై వ్యాఖ్యానం (11వ శతాబ్దం)

కామశాస్త్రం , కావ్యాలు

మార్చు

కామశాస్త్రానికీ, కామశాస్త్ర రచనలకూ, కవిత్వానికీ చాలా దగ్గర సంబంధాలు కానవస్తాయి. సంస్కృత కవులు కామశాస్త్రం గురించి తమ కావ్యాలు రచించడానికి ప్రముఖ కారణం, ఆయా శాస్త్రాలలో ప్రావీణ్యాలు క్షుణ్ణమైన అధ్యయనాలు ఉండడమే.

మూలాలు

మార్చు
  1. Arthur Anthony Macdonell. A Practical Sanskrit Dictionary. p. 66.