భారతీయ కామశాస్త్రంలో ఒక ప్రముఖమైన రచన - అనంగరంగ. దీన్ని 16 వ శతాబ్దంలో కళ్యాణ మల్లుడు అనే కవి రచించాడు. ఈ కవి 1451 నుండి 1526 వరకూ న్యూఢిల్లీని రాజధానిగా చేసుకొని పాలించిన లోడి సామ్రాజ్యానికి చెందిన వాడు. అహ్మద్ ఖాన్ లోడి కుమారుడైన లాడ్ ఖాన్ కోసం అనంగరంగ గ్రంథాన్ని రచించాడు కళ్యాణ మల్లుడు. అనంగరంగ గ్రంథం వాత్సాయనుడు రచించిన కామసూత్ర గ్రంథంతో పోల్చబడుతుంది. 1885 లో ఈ గ్రంథాన్ని కామశాస్త్ర సొసైటీ అనువదించింది. ఇందులో స్వభావాలను బట్టి స్త్రీ జాతులు, శరీర ఆకృతిని బట్టి స్త్రీ పురుష జాతులు, ప్రాంతాలబట్టి స్త్రీల రకాలు, వశీకరణం, స్త్రీ పురుషుల్లో వివిధ గుర్తులు, బాహ్య, అంతరంగిక సంతోషాలు, వివాహ సంబంధమైన పంచాంగం మొదలైనవి ఉంటాయి.

దస్త్రం:అనంగరంగ.jpg
అనంగరంగ

మైనారిటీ నిండిన ప్రతీ భారతీయ స్త్రీ, పురుషుడు తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం అనంగరంగ.. సుప్రసిద్ధ వాత్సాయనుడు రచించిన కామ శాస్త్రాన్ని పోలియుండే ఈ పుస్తకమును కల్యాణమల్లుడు రచించాడు.

శరీర ఆకృతిని బట్టి పద్మిని, చిత్రిణి, శంకిణి, హస్తిణి అను స్త్రీ జాతులను, యోని లోతులను బట్టి మృగ, వాదవ (అశ్విని), కరిణి అను స్త్రీ జాతులను; అంగము పొడవు బట్టి శశ (కుందేలు), అశ్వ, వృషభ అను పురుష జాతులను కళ్యాణమల్లుడు అద్భుతంగా వర్ణించాడు. పురుషులు స్త్రీలతో సంభోగించే పద్ధతులు - వేళలు, వయసు, ప్రాంతాల బట్టి స్త్రీల స్వభావాలు, శరీర ఆకృతిని బట్టి స్త్రీల స్వభావాలు కూడా రచించాడు. ఇవే కాకుండా మోహించే స్త్రీలను గుర్తించడం,, వివాహిత స్త్రీలు దారి తప్పడానికి గల కారణాలు, అసంతృప్తి చెందే స్త్రీలను గుర్తించడం, స్త్రీలు శృంగారంపై ఆసక్తి చూపే సందర్భాలు, యోని రకాలు, స్త్రీలను ఆకర్షించడానికి వశీకరణ విద్యలో పలు ఔషధాల తయారీలు ఇవ్వబడ్డాయి .

ముఖ్యాంశాలు

  • శరీర ఆకృతిని బట్టి స్త్రీలలో పద్మినీ, చిత్రిణీ, శంకిణీ, హస్తిణీ అను జాతులున్నవి.
  • ప్రతిపాద, ద్వితీయ, చతుర్థి, పంచమి అను తిధుల్లో పద్మిని స్త్రీ తన మర్మాంగాలనుండి సంతృప్తి చెందుతుంది.
  • సప్తమి, అష్టమి, దశమి, ద్వాదశి అను తిధుల్లో చిత్రిణి స్త్రీ తన మర్మాంగాలనుండి సంతృప్తి చెందుతుంది.
  • తృతీయ, సప్తమి, ఏకాదశి, త్రైయోదశి అను తిధుల్లో శంకిణి స్త్రీ తన మర్మాంగాలనుండి సంతృప్తి చెందుతుంది.
  • నవమి, చతుర్దశి, పూర్ణిమ, అమావాస్య అను తిధుల్లో హస్తిణి స్త్రీ తన మర్మాంగాలనుండి సంతృప్తి చెందుతుంది.
  • పద్మినీ స్త్రీ రాత్రి వేళల్లో రతికి ఇష్టపడదు. ఆమె సూర్య కమలము వలె పగటివేళల్లో భర్త బాలుడైనా సరే ఇష్టపడుతుంది.
  • చిత్రిణి, శంకిణీ స్త్రీలు రాత్రివేలల్లో రతికి ఇష్టపడుదురు.
  • సాయంత్రవేళ 3 నుండి 6 గంటల సమయంలో పద్మిని స్త్రీ రతిని ఆనందించును.
  • సాయంత్రం 6 నుండి 9 గంటల సమయంలో చిత్రిణి స్త్రీ రతిని ఆనందించును.
  • అర్ధరాత్రి 12 నుండి 3 గంటల సమయంలో శంకిణీ స్త్రీ రతిని ఆనందించును.
  • హస్తిణీ స్త్రీ అన్ని వేళలా రతిని ఆనందించును.

2 వ అధ్యాయము

3 వ అధ్యాయము

  • శరీర ఆకృతిని బట్టి పురుషుల్లో షాష, వృషభ, అశ్వ అను జాతులున్నవి.
  • యోని లోతుల బట్టి స్త్రీలో మృగి, వాదవ (అశ్విని), కరిణి అను జాతులున్నవి.
  • స్త్రీ యొక్క యోని పురుషుడియొక్క అంగము కొలతలు సమానముగా ఉన్నచో రతిలో మరపురాని ఆనందము కలుగును
  • అంగము 6 అంగుళాల పొడవున్న షష పురుషుడు యోని 6 అంగుళాల లోతు గల మృగి స్త్రీతో జరిపేది ఉత్తమ రతి, యోని 9 అంగుళాల లోతు గల అశ్విని స్త్రీతో జరిపేది మధ్యమ రతి, యోని 12 అంగుళాల లోతు గల కరిణి స్త్రీతో జరిపేది కనిష్ఠ రతి,.
  • అంగము 12 అంగుళాల పొడవున్న అశ్వ పురుషుడు యోని 6 అంగుళాల లోతు గల మృగి స్త్రీతో జరిపేది కనిష్ఠ రతి,. యోని 9 అంగుళాల లోతు గల అశ్విని స్త్రీతో జరిపేది మధ్యమ రతి. యోని 12 అంగుళాల లోతు గల కరిణి స్త్రీతో జరిపేది ఉత్తమ రతి.

5 వ అధ్యాయము

  • రతి పట్ల ఆసక్తి ఉండే స్త్రీ యొక్క ప్రవర్తనా తీరు: అదే పనిగా జుత్తుని రుద్దుకోవడం, తల గోక్కోవడం, బుగ్గలపై పాముకోవడం, ఎద పైన వస్త్రాన్ని సర్దుకొని ఎద కొద్దిగా బయటకు కనిపించేలా చేయడం, క్రింది పెదాన్ని కొద్దిగా కొరకడం లేదా చప్పరించడం, కొన్ని సార్లు సిగ్గు లేకపోవడం, ఒక మూలన కూర్చోవడం, స్నేహితురాళ్ళను కౌగలించుకోవడం, పెద్దగా నవ్వడం, తీయటి కబుర్లు చెప్పడం, మగపిల్లలను ముద్దు పెట్టుకోవడం, ఒక వైపు నవ్వడం, ఒళ్ళు విరుచుకోవడం, భుజాలను, చంకలను చోసుకోవడం, కంగారుగా నత్తిగా మాట్లాడటం, కారణం లేకుండా ఏడవటం, భర్త వెళ్ళే దారిలో అడ్డుపడటం వంటివి.
  • స్త్రీ దారి తప్పి చెడిపోవడానికి గల కారణాలు : పెద్ద ఎదిగిన తర్వాత కూడా పుట్టింట్లో ఉండిపోవడం, దుష్టులతో సంభాషణ, ఎక్కువకాలం భర్తకు దూరంగా ఉండుట, పేదరికము,, ఆహారము, వస్త్రాలపై మమకారం.

మానసిక వత్తిడి, అసంతృప్తి .

  • స్త్రీని అసంతృప్తి పరచే కారణాలు: ధనం పట్ల తల్లిదండ్రుల పిసినారితనము, అనారోగ్యము, ఆనందంకోసం భర్తనుండి వేరవ్వడం, అతిగా పనిచేయవలసివచ్చినప్పుడు, అమానుష చ్ అర్యలు, అపనిందలు, తిట్లు, చెడువార్తలు, దారిద్ర్యము, బాధలు, భర్తలో నపుంసకత్వము,
  • స్త్రీ రతి కోసం తపించి, బాగా సంతృప్తి పొందే సమయాలు: నడక, పనివలన అలసట తర్వాత, భర్తతో రతిలో పాల్గొన్నాలని చాలా కాలంనుండి కోరుకొన్న తర్వాత, బిడ్డకు జన్మనిచ్చిన నెల తర్వాత, గర్భందాల్చిన తొలిరోజుల్లో, ఖాళీ - నిద్ర - డల్ గా ఉన్నప్పుడు, జ్వరం తగ్గినప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు, కన్యగా ఉన్నప్పుడు, వసంత ఋతువు, ఉరుములు - మెరుపులు - వర్షము.

6 వ అధ్యాయము: ఇది వశీక్రణ విద్యకు సంబంధిచింది. స్త్రీలను ఆకర్షించడానికి పురుషులు ఏ ఔషధాలు తయరుచేసుకొని వాడాలి, స్త్రీలు భర్తను ఆకర్షించడానికి ఏం చేయాలి, ప్రేమను, స్నేహాన్ని గెల్చుకోవడానికి తయారు చేసుకోవలసిన అంజనాలు, ఎడుటి మనిషి లొంగిపోవడానికి ఏ ఔషధాలు తయరుచేసుకొని వాడాలి వగైరా వివరాలు ఉన్నాయి.

7వ అధ్యాయము: భార్యకు ఉండవలసిన లక్షణాలు, భర్తకు ఉండవలసిన లక్షణాలు, అల్లుడుకి ఉండవలసిన లక్షణాలు, స్త్రీపురుషుల్లో హస్తసాముద్రికము, రతి చేయకూడని స్త్రీలు, తేలికగా నియంత్రించదగ్గ స్త్రీలు, తేలికంగా లొంగని స్త్రీలు, రతి చేయకూడని వేళలు, వగైరా వివరాలు ఉన్నాయి.

8వ అధ్యాయము: స్త్రీ పురుష ఆలింగన రకాలు, ముద్దుల్లో రకాలు, గోళ్ళతో స్పృసించే విధానాలు, పళ్ళతో స్పృసించే విధానాలు, ఖండితనాయిక, వాసకసజ్జిత, కళకంతరిత, అభిసారిక, విప్రలబ్ధ, వియోగిని, స్వాధీనపూర్వపతిక, ఉత్కంటిత వంటి అష్టమహానాయికల లక్షణాలు ఇవ్వబడినవి

9 వ అధ్యాయము: రతిలో వివిధ భంగిమలు ఇవ్వబడినవి.

10 అధ్యాయము: ఇది వివాహము గూర్చిన పంచాంగము (Astrology). పరుసవేది (Alchemy) కూడా ఇవ్వబడింది.

ఇతర విషయాలు

  • రతి అనేది స్త్రీ పురుషుల మధ్య జరిగే పవిత్రమైన లైంగిక కార్యము.
  • ఆరోగ్య కరమైన రతి జీవితకాలమును పెంచుతుంది, స్త్రీ పురుషులమధ్య ప్రేమను పెంచుతుంది.
  • కామశక్తి, కామకోరిక పురుషుల్లోకంటే స్త్రీలలో ఎక్కువవుంటుంది . కామ శాస్త్రం ప్రకారం ఒక స్త్రీ ఆపులేకుండా ఎంతసేపైనా ఒకరు లేక అంతకంటే ఎక్కువమంది పురుషులతో రమించగలదు, ఒకసారి లేక అంతకంటే ఎక్కువసార్లు భావప్రాప్తి పొందగలదు. పురుషుడికి అంతటి శక్తి ఉండదు.
  • చాణక్య నీతి శాస్త్రం ప్రకారం కామకోరిక పురుషులకంటే స్త్రీలలో ఎనిమిది రెట్లు ఎక్కవ ఉంటుంది.
  • రతిలో పాల్గొనడానికి స్త్రీకి కనీసం 16 సంవత్సరాల వయసు, పురుషుడికి కనీసం 20 సంవత్సరాల వయసు ఉండాలి.
  • స్త్రీ పురుషులు ఇరువురూ తమ శరీర భాగాలను, మర్మాంగాలను సున్నితంగా చేతులతో, నాలుకతో స్పృసిస్తూ రతిని ప్రారంభించాలి . దీన్ని ఆంగ్లంలో ఫోర్ ప్లే అంటారు. ఫోర్ ప్లే వల్ల పురుషాంగం గట్టిపడుతుంది, యోనిలోని స్రవాలు విడుదల అవుతాయి. అప్పుడు మాత్రమే యోనిలోకి పురుషాంగాన్ని ప్రవేశబెట్టాలి.
  • పురుషుడు తన పురుషాంగం స్త్రీ యోనిలో ఉండగానే వీర్యం స్కలించగలిగి, అదే సమయంలో స్త్రీ భావప్రాప్తి పొందగలిగితే ఇద్దరికీ మోక్షం పొందినంత ఆనందం కలుగుతుంది.
  • పురుషుడు కోరుకున్నప్పుడు జరిపే రతికంటే స్త్రీ కోరుకున్నప్పుడు మాత్రమే జరిపిన రతి శ్రేయస్కరము.
  • స్వలింగ సంపర్కము, హస్తప్రయోగము, వివాహేతర సంబంధము ఆరోగ్యానికి హానికరము.
  • బహిష్టు, అనారోగ్య సమయల్లోను రతి చేయుట హానికరము .
  • మద్యపానం, ధూమపానం, గుట్కాలు, అధిక సెల్ ఫోన్ వాడకం, మానసిక వత్తిడులు, పౌష్టికాహార లోపం వంటివి కామ శక్తిని, వీర్యశక్తిని హరించివేస్తాయి .
  • స్త్రీని లైంగికంగా తృప్తిపరచడం పురుషుడి బాధ్యత. లేకపోతే అక్రమ సంబంధాలకు దారితీసే అవకాశాలు ఎక్కువ.

ఇంకా చదవండి

లంకెలు

"https://te.wikipedia.org/w/index.php?title=అనంగరంగ&oldid=2983108" నుండి వెలికితీశారు