కామాపంతుల సంపూర్ణ చంద్రిక

కామాపంతుల సంపూర్ణ చంద్రిక ప్రముఖ సంగీత కళాకారిణి, సామాజిక కార్యకర్త.

సంపూర్ణ చంద్రిక... భువనేశ్వరి, వేదుల సూర్యనారాయణశాస్తి దంపతులకు 1937లో ఆంధ్ర ప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా, తణుకు లో జన్మించారు. చిన్నప్నటినుండే కళలపై ఆసక్తి ఉండడం గమనించిన ఈవిడ తాతగారు చర్ల భాష్యకారిశాస్త్రి బాల్యంలోనే సంగీతం నేర్పించారు. వీరికి చిన్నతనంలోనే వెంకట రామన్ తో వివాహం జరిగింది. వివాహం జరిగిన కొద్దిరోజుల్లోనే భర్త మరణించడంతో, తండ్రి దగ్గరే ఉండి ఎం.ఎ. (హిందీ), ఎం.ఎ. (మ్యూజిక్) లు చదివారు

బాలసరస్వతి స్త్రీ సమాజంలో చదువుతున్న సమయంలో సహ విద్యార్థినులకు హిందీ పాఠాలు బోధించారు. అంతేకాకుండా భర్తపోయిన స్త్రీలకు హిందీ నేర్పించి, వారి ఫీజులను కట్టి, వారిచే పరీక్షలు రాయించేవారు. బుర్ర కథలు కూడా చెప్పేవారు. పాటలు పాడడంలోను, నృత్యం చేయడంలోను ప్రవేశం ఉండేది. నాటకాలు రాసి తన స్నేహితులతో వేయించేవారు.

వయోలిన్ ఓకల్ కూడా నేర్చుకున్నారు. పలురకాలైన సంగీత, సాహిత్య సేవా, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనేవారు. మహిళామండలి ద్వారా కుట్టు శిక్షణను ఇచ్చి వెనుకబడిన మహిళలకు ఉపాధి కల్పించారు. రీడర్ ఫోరమ్ మహిళాశాఖా గ్రంథాలయ సెక్రటరీగా 18 సంవత్సరాలు వనిచేశారు. గ్రంథాలయ సంస్థ భవన నిర్మాణంకోసం కృషి చేసి, గ్రంథాలయానికి స్వంత భవనాన్ని ఏర్పాటుచేసారు. సంధ్యాజ్యోతి వృద్ధాశ్రమం వైస్ ప్రెసిడెంటుగా 20 సం.లు పనిచేసారు. ఆకాలంలో స్వామీజీల ప్రసంగాల నిర్వహణకోసం మహిళా విభాగాన్ని నిర్వహించారు. హైదరాబాద్ లో జరిగిన విశ్వహిందూ పరిషత్ రాష్ట్రస్థాయి మీటింగులకు తణుకుశాఖ తరపున పాల్గొన్నారు. ఇంటినే విశ్వవిద్యాలయంగా మలుచి, వివిధ రంగాల్లో కృషి చేశారు.

ఈవిడ 2010, మార్చి 16 న మరణించారు.

మూలాలు

మార్చు

కామాపంతుల సంపూర్ణ చంద్రిక, తణుకు తళుకులు (జీవన చిత్రాలు), భదరీనాథ్, 2010, పుట. 88.