తణుకు

ఆంధ్రప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లా, తణుకు మండల పట్టణం

తణుకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా, తణుకు మండలానికి చెందిన పట్టణం, మండల కేంద్రం. పశ్చిమగోదావరి జిల్లాలో ప్రస్తుతం 2011 జనాభా లెక్కలు ప్రకారం భీమవరం, తాడేపల్లిగూడెం,, పాలకొల్లు తరువాత తణుకు నాల్గవ పెద్ద పట్టణంగా ఉంది. భారతదేశంలో మొదటి సారిగా రాకెట్ ఇంధనం తయారి పరిశ్రమ తణుకులోనే ఏర్పాటు చేయడం జరిగింది.

తణుకు
తారకాపురి
తణుకు పెరవలి రోడ్డులో కేశవస్వామి దేవాలయం
తణుకు పెరవలి రోడ్డులో కేశవస్వామి దేవాలయం
తణుకు is located in ఆంధ్రప్రదేశ్
తణుకు
తణుకు
ఆంధ్రప్రదేశ్ లో స్థానం
Coordinates: 16°45′N 81°42′E / 16.75°N 81.7°E / 16.75; 81.7
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాపశ్చిమ గోదావరి
Government
 • Typeపురపాలకసంఘం
 • Bodyతణుకు పురపాలకసంస్థ
 • శాసనసభ సభ్యుడుకారుమూరి వెంకట నాగేశ్వరరావు
విస్తీర్ణం
 • Total24.83 కి.మీ2 (9.59 చ. మై)
జనాభా
 (2011)[2]
 • Total77,962
 • Rank4వది (జిల్లా)
 • జనసాంద్రత3,100/కి.మీ2 (8,100/చ. మై.)
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (IST)
పిన్‌కోడ్
534211
టెలిఫోన్ కోడ్+91–08819
Vehicle registrationAP–37,39
Nearest cityతాడేపల్లిగూడెం

పేరు వ్యుత్పత్తి

మార్చు

స్థల పురాణాల ప్రకారం ప్రస్తుత తణుకు ప్రాంతం అసురుల (రాక్షసులు) రాజైన తారకాసురుని రాజ్యపు రాజధానిగా చెప్పబడుతుంది. ఈ తారకాసురుని సంహరించడానికి వీరభధ్రుడు దేవగణానికి సైన్యాధ్యక్షుడై వచ్చాడని ప్రతీతి. వీరిరువురి మధ్యన జరిగిన భీకర యుద్ధంలో కుమారస్వామి తారకాసురుని వధించిన తరువాత ఇంద్రునికి అల్లుడైనాడు. ఈ యుద్ధం నుండే తణుకు పట్టణానికి తారకేశ్వరపురం అన్న పూర్వనామం ఉండేదని, అలాగే చాలా గ్రామాలకు పేర్లు స్థిర పడినట్లుగా చెబుతారు. కుమారస్వామి భూమిపై అడుగిడిన ప్రాంతాన్ని కుమరవరం గా, తణుకు సరిహద్దు గ్రామమైన వీరభధ్రపురం వీరభధ్రుడికి విడిది అని, అలాగే దేవతలు విడిదియై ఉన్న గ్రామం వేల్పూరు (వేల్పుల ఊరు, వేల్పులు = దేవతలు) గా పిలవబడుచున్నదని చెబుతారు. ఈ కథను బలపరిచే విధంగానే వేల్పూరు గ్రామంలో ఎన్నో ఆలయాలు ఉండడం గమనించవచ్ఛు. ఈ ఆలయాల సంఖ్య 101 పైనే ఉంది. అలాగే ఇంద్రుడు విడిది చేసిన ప్రాంతాన్ని ఇల్లింద్రపర్రు, పాలంగి ఆ రోజులలో పూలంగి ( పూల కొట్టు), చివటం గ్రామం శ్రీవతం (ఆర్ధిక కార్యకలాపాల కేంద్రం), వడ్లూరు అప్పటి ధాన్యాగారం, ఇప్పటి పైడిపర్రు అప్పటి స్వర్ణాగారం (బంగారం భద్రపరుచు ప్రాంతం), ఇప్పటి రేలంగి అప్పటి రత్నాల అంగడి గానూ భావిస్తారు. అలాగే కావలిపురం, మహాలక్ష్మి చెఱువు మొదలైన గ్రామాల పేర్లు ఈ కథను బలపరిచేవిగానే కనపడుచున్నవి. తారకాపురం, తళుకు, తణుకుగా రూపాంతరం చెందింది.[3]

చరిత్ర

మార్చు
 
తణుకు పెరవలి రోడ్డులో గల ఆదికవి నన్నయ్య విగ్రహం
దస్త్రం:AP Town Tanuku.jpg
తణుకు పెరవలి రోడ్డులో కల కాటన్ విగ్రహం

గోస్తని నది పుణ్యజలధారలతో పునీతమైన తణుకు ప్రాంతంలోనే మహాభారతాన్ని ఆంధ్రీకరించిన ఆది కవి నన్నయ్య యజ్ఞం చేసినట్టుగా చారిత్రక ప్రశస్తి ఉంది. దీనిని బట్టి తణుకు ప్రాంతానికి కనీసం వెయ్యేళ్ళ చరిత్ర ఉన్నట్లు స్పష్టమవుతున్నది. మధ్యయుగాలలో, ఆధునిక యగంలో తణుకు ప్రశస్తి అనేక చోట్ల కనిపిస్తూ ఉంది.[4] [ఆధారం చూపాలి].

భౌగోళికం

మార్చు

తణుకు 16o 45' ఉత్తర, 81o 42' తూర్పు అక్షాంశ, రేఖాంశాల పై ఉంది. జిల్లా కేంద్రం భీమవరానికి ఈశాన్యంగా 39 కి.మీ దూరంలో ఉంది.

జనగణన గణాంకాలు

మార్చు

2011 జనాభా లెక్కల ప్రకారం తణుకు 32 వార్డులతో 72,348 జనాభా కలిగి ఉంది. 2013వ సంవత్సరంలో తణుకు మున్సిపాలిటీలో మూడు గ్రామాలను వెంకటరాయపురం, పైడిపర్రు, వీరభద్రపురం విలీనం చేశారు. అప్పుడు తణుకు మున్సిపాలిటీ పరిధి 24.83 కి.మీ, 34 వార్డులు 90,430 మంది జనాభా గల పట్టణంగా మారింది.

పరిపాలన

మార్చు

తణుకు పురపాలక సంఘం పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.

రవాణా వ్యవస్థ

మార్చు

రోడ్డు రవాణా

మార్చు

జాతీయ రహదారి-16 పై తణుకు ఉంది.

రైలు రవాణా

మార్చు

తణుకు రైల్వే స్టేషను విజయవాడ జంక్షన్, నిడదవోలు జంక్షన్ రైల్వే స్టేషను మధ్య, హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గములో ఉంది.

విద్యాలయాలు

మార్చు

2000 సెప్టెంబరు 8న అక్షరయజ్ఞం పేరుతో సంపూర్ణ అక్షరాస్యతా ఉద్యమానికి ఈ పట్టణం శ్రీకారం చుట్టింది. 2001 మార్చి 15న శాసనసభలో పాఠశాల విద్యాశాఖ మంత్రి సంపూర్ణ అక్షరాస్యతా సాధించిన తొలి పట్టణంగా తణుకును ప్రకటించారు.[ఆధారం చూపాలి] ఇప్పుడు నిర్బంధ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టడానికి తీర్మానించిన తొలి తెలుగు పట్టణంగా ముందుకు వచ్చింది.

ప్రముఖులు

మార్చు

ఇవీ చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "District Census Hand Book : West Godavari (Part B)" (PDF). Census of India. Directorate of Census Operations, Andhra Pradesh. 2011. pp. 22–23, 54. Retrieved 9 June 2019.
  2. "About Tanuku Municipality". tanuku.cdma.ap.gov.in. p. 42. Archived from the original (PDF) on 27 జనవరి 2020. Retrieved 27 April 2019.
  3. బదరీనాథ్, కానూరి (ఫిబ్రవరి 2012). "నాటి 'వేంగీ విషయం'లోని (నేటి ప.గో.జిల్లా) కొన్ని గ్రామ నామాలు-వివరణలు". సుపథ సాంస్కృతిక పత్రిక. 12 (2): 35.
  4. "About Tanuku Municipality | Tanuku Municipality". tanuku.cdma.ap.gov.in. Archived from the original on 2020-01-27. Retrieved 2019-12-18.

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=తణుకు&oldid=4074997" నుండి వెలికితీశారు