కామినీ కదమ్

మహారాష్ట్రకు చెందిన సినిమా నటి.

మాణిక్ కామినీ కదమ్ (1933 ఆగస్టు 3 - 2000 జూన్ 18), మహారాష్ట్రకు చెందిన సినిమా నటి. 1950-70 మధ్యకాలంలో అనేక మరాఠీ, కన్నడ, హిందీ చిత్రాలలో నటించింది.[1]

కామినీ కదమ్
జననం
కామినీ కదమ్

1933, ఆగస్టు 3
మరణం2000 జూన్ 18(2000-06-18) (వయసు 66)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1955–1967
జీవిత భాగస్వామిఅనిల్ జి. కదమ్

కామినీ కదమ్ 1933 ఆగస్టు 3న మహారాష్ట్రలోని ముంబైలో జన్మించింది.

సినిమారంగం

మార్చు

1955లో వచ్చిన యేరే మాజ్య మాగల్య సినిమాతో మరాఠీ సినిమారంగంలోకి అడుగుపెట్టి, అనేక మరాఠీ చిత్రాలలో నటించింది. 1958లో తన స్క్రీన్ పేరును కామినీ కదమ్‌గా మార్చుకుంది. 1958లో వచ్చిన తలాక్ సినిమాతో హిందీ సినిమారంగంలోకి ప్రవేశించింది. సంతాన్ (1959), స్కూల్ మాస్టర్ (1959), సప్నే సుహానే (1961) వంటి హిందీ సినిమాలలో నటించింది.[2]

సినిమాలు

మార్చు

హిందీ సినిమాలు:

  • తలాక్ - 1958
  • సంతాన్ - 1959
  • స్కూల్ మాస్టర్ - 1959
  • మా బాప్ - 1960
  • మియా బీబీ రాజీ – 1960
  • సప్నే సుహానే – 1961

మరాఠీ సినిమాలు:

  • యేరే మాజ్య మాగల్య – 1955
  • సుధార్లేల్య బాయికా - 1965

కన్నడ సినిమాలు:

  • క్రాంతివీర సంగొల్లి రాయన్న - 1967

కామినీ కదమ్ 2000 జూన్ 18న మహారాష్ట్రలోని ముంబైలో మరణించింది.

మూలాలు

మార్చు
  1. "Bollywood Movie Actress Kamini Kadam Biography, News, Photos, Videos". nettv4u (in ఇంగ్లీష్). Archived from the original on 2018-11-12. Retrieved 2022-12-27.
  2. "Kamini Kadam Complete Movies List from 1961 to 1959". www.bollywoodmdb.com. Archived from the original on 2022-12-27. Retrieved 2022-12-27.

బయటి లింకులు

మార్చు