కామేశ్వరీ శతకము
దివాకర్ల తిరుపతి శాస్త్రి (1872-1919), చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి (1870-1950) - ఈ ఇద్దరు కవులు తిరుపతి వేంకట కవులు అని జంట కవులుగా తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధులయ్యారు. ఈ గ్రంథాన్ని తిరుపతి శాస్త్రి మరణానంతరం చెళ్ళపిళ్ల రచించారు. కానీ తన జంట కవిపై అభిమానంతో తిరుపతి వేంకటేశ్వరులన్న జంట పేరిటే ప్రచురించడం విశేషం. "కామేశ్వరీ" అను మకుటంతో రచించబడిన ఈ శతకంలో 107 శార్ధూల, మత్తేభ పద్యాలు ఉన్నాయి.
కామేశ్వరీ శతకము | |
---|---|
కవి పేరు | తిరుపతి వేంకట కవులు |
మొదటి ప్రచురణ తేదీ | 1925 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
పద్యం/గద్యం | పద్యకావ్యం |
మీడియా రకం | ముద్రణ |
మొత్తం పద్యముల సంఖ్య | 107 |
మొత్తం పుటలు | 20 |
అంతర్జాలం లో | వికీసోర్సు లో కామేశ్వరీ శతకము |
కీర్తించిన దైవం | కామేశ్వరి |
ముద్రాపకుని పేరు | చెలికాని లచ్చారావు |
ముద్రణా శాల | మినర్వా ప్రెస్, బందరు |
శతకం లక్షణం | భక్తిశతకం |
కొన్ని పద్యాలు
మార్చుమొదటి పద్యం
మార్చుశా. శ్రీరామారమణాదినిర్జరశిరస్సేవ్యంబు సంసారసౌ
ఖ్యారామాంకురదోహదంబు పరితాపాసార మత్యంతశో
భారమ్యంబు పరార్థదాయకము నీ పాదంబు మోదంబు కై
వారం గొల్తు నమస్కరింతు మది సంభావింతు గామేశ్వరీ. 1
చివరి పద్యం
మార్చుశా. శ్రీరంజిల్లెడిపద్యము ల్శతకమై చెన్నొంద నీమీద నే
నారంభించిన దాది ని న్నడుగునా యాకోర్కులన్ గొన్ని మున్
దీరన్ దీరుచునుండె దీర గల నీ తీ ర్కొంత మాచ్యార్థతన్
గూరె న్వచ్చెడి దాని సూచనలెఱుం గున్ గాదె? కామేశ్వరీ. 107
ముద్రణ
మార్చుదీని మూడవకూర్పు 1934 సంవత్సరంలో బందరు మినర్వా ప్రెస్ లో ముద్రించబడింది.