కారకత్వం
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (ఆగస్టు 2018) |
గ్రహ కారకత్వములు
మార్చుతండ్రి, ఆత్మ, ఇతరులకు అపకారం కోరని మనస్తత్వం, శక్తి, పితృచింత, ఆత్మాభిమానం, శివోపాసన, ధైర్యం, బుద్ధి, ఆరోగ్యం, పిత్తము, కార్యనిర్వహణాశక్తి, బుద్ధిబలం, దుర్వ్యయము, యజ్ఞము, దినబలము, సౌమ్యత, రాగి, దేవాలయము, గిరిగమనం, కీర్తి, అధికారం, ఎముక, స్వల్పకేశము, శిరోవ్యాధి, ప్రవర్తన, క్షత్రియ, పాషాణము, భూషణము, వ్యవహారము, లావునడుము, రక్తవర్ణము, రాజసము, రోషము, కారము, పొట్టి, తూర్పుదిశ, జ్ఞానోదయము, ప్రవాళము, రాజ్యము, స్వస్థల స్వాధికారలాభము, పరాక్రమమునకు ఘనత, జనవిరోధం, శతృభయం, యుద్ధం, ఉద్యోగం, వైద్యం, సౌఖ్యం, భార్యాబిడ్డల హాని, పితృభృత్యాది విరోధం, ఆత్మజ్ఞానం, వీపుపై భాగం, పక్కలు, హృదయము, స్త్రీల యందు ఎడమకన్ను, పురుషులయందు కుడికన్ను పై ప్రభావం, ఆరోగ్యము, ప్రాణధాతువులు, గౌరవమైన పదవులు, బిరుదులు, అభివృద్ధి, రాజకీయములు, పరిపాలనాధికారులు మొదలైనవి రవి కారకత్వములు.
తల్లి, మనస్సు, ప్రసాదగుణం, మాతృచింత, పుష్పములు, సుగంధం, రూపం, సుఖభోజనం, సముద్రస్నానం, వెండి, తీపి, పాలు, వస్త్రం, నీరు, ముత్యం, ఆవులు, కంచు, పండ్లు, అపస్మారకం, గుల్మము, యశస్స్సు, పట్టువస్త్రం, బావి, వీర్యపుష్టి, జలసౌఖ్యం, శ్లేష్మము, బలము, పంట, యాత్ర, అశ్వసంచారం, దుర్గగమనం, శీతజ్వరం, సమదృష్టి, స్నానశాల, సత్యం, తటాకము, మణి, వైశ్యులు, చెరుకు, నడివయస్సు, లగ్నం, పరిహాసం, గౌరీభక్తి, దూరదేశగమనం, పడమరదిశ, వ్యాధి, కూపము, వాతము, మధువు, స్థూలము, క్షయ, స్త్రీ, ద్విజ, సౌఖ్యం, నెత్తురు, నిద్ర, ముఖము, ఉదరం, బాహువులు, వ్యవసాయం, వైద్యం, వ్యాపారం, నీటిసంబంధమైన పని, బుద్ధి, సౌందర్యము, సత్యము, రంజితము, మనసు, దాని స్వభావము, మనశ్శక్తి, ఉదరము, స్తనములు, పురుషులయందు ఎడమకన్ను, స్త్రీలలో కుడికన్ను మొదలైనవి చంద్రుని సంబంధ కారకత్వములు.
కనిష్ఠసోదరీ సోదరులు, సేవకాగుణం, భూమి, ప్రాకారం, రోగము, వ్రణము, సాహసం, శస్త్రములు, అగ్ని, స్పోటకము, సందర్శనము, ఉత్పాటనము, రక్తవస్త్రప్రియుడు, కాలినవస్త్రం, బÁుుణము, ఉద్యానవనము, బలము, వనచరుడు, స్వర్గకారకుడు, పిత్తము, రాగి, పొట్టి, శౌర్యము, దొంగ, యుద్ధప్రియత్వము, విరోధము, రాజు, వాక్కు, కటినాధిపత్యం, సీసం, విదేశగమనం, దక్షిణదిశ, తర్కశాస్త్రం, శస్త్రవిద్య, శతృవృద్ధి, స్పోటకము, మూర్ఖత్వము, ఆయుధధారణ, వాగ్వాదం, మూత్రకుచ్ఛము, గణితం, కఠినమైన శిక్షలు విధించు ఉద్యోగం, మిల్లులు, పోలీసు, మిలటరీ, విద్యుత్తు, వ్యవసాయం, ధైర్యము, శౌర్యము, ఆత్మగౌరవము, మూత్రాశయము, కండలు, తల, ముఖము, మజ్జ, ఎడమచెవి, లింగము, రసవీంద్రియములమీద ప్రభావము, మొదలైనవాటికి కుజుడు కారకత్వము వహిస్తాడు.
ప్రజ్ఞ, కర్మ, విజ్ఞానం, గణితం, కావ్యము, శిల్పము, జ్యోతిషము, విద్య, మేనమామ, చింత, బుద్ధి, సుందరస్వరూపం, శాంతం, గృహప్రవేశం, వ్యాపారం, వ్యవహారం, వేదాంతవిచారణ, సేవకులు, నాభి, గుహ్యం, విష్ణు ఉపాసన, వ్యాకరణం, నామకరణం, మైథునం, విష్ణుభక్తి, వైద్యము, యుక్తి, భుక్తి, దాసదాసీజన వృద్ధి, పరిహాసము, జ్ఞాతులు, తంత్రము, నపుంసకుడు, పాదచారి, అడ్డచూపు, యువరాజు, పికిలిన వస్త్రం, రజోగుణం, సునేత్రం, ఆకుపచ్చ, రచన, మేడలు, వినయం, రత్నశోధన, శూద్రజాతి, యాత్ర, సమదృష్టి, భయం, భూమి, స్థిరము, వాక్కు, హాస్యము, వాయవ్య దిశ, వేదాంతం, గుమాస్తా, పుస్తకములు వ్రాయుట, అమ్ముట, తీర్పుచెప్పుట, నాటకములు, సినిమాలు, వ్యాపారము, పుత్ర సుఖదుఃఖము, మాతులసుఖం, గణితం, వేదాంతం, శిల్పశాస్త్రం, వక్తృత్వం, శరీరంలోని నాడులు, నరముల మీద ప్రభావం, ప్రేగులు, ముంజేయి, నోరు, నాలుక, దృష్టి, భావము, ఇంద్రియజ్ఞానము, ఊహ, భాషాంతరీకరణము, శైలి, అలవాటు వలన విద్యనభ్యసించటం, అనుకరణ మొదలైనవి బుధకారకత్వములు.
ధనము, విద్య, పుత్రులు, జ్యేష్టభ్రాత, దేహపుష్టి, బుద్ధి, అర్థసంపద, యజ్ఞము, కీర్తి, గృహము, బంగారము, శస్త్రము, అశ్వము, మెదడు, జ్యోతిషము, వేదశాస్త్రము, శబ్దశాస్త్రము, వాహనసౌఖ్యం, ఆందోళికము, గజము, యజ్ఞయాగాది క్రతువులు, కర్మ, ఆచారము, ఛాందసము, సుజనత్వము, శాంతము, మంత్రిత్వము, ఐశ్వర్యము, బంధువృద్ధి, దయ, దాక్షిణ్యము, ధర్మము, దైవభక్తి, వస్త్రము, సత్యము, తర్కము, మీమాంస, సింహాసనము, వాగ్ధోరణి, పసుపురంగు, నృపసన్మానం, ధర్మం, వెండి, బ్రాహ్మణులు, జ్ఞానము, కోశాగారం, నవీనగృహం, బంధుసమూహం, సుబుద్ధి, ఉత్తరదిశ, కావ్యజ్ఞానము, నిక్షేపము, వైడూర్యము, ఊరువులు, అగ్నిమాంద్యము, దంతములు, వేదవేదాంతజ్ఞానము, బ్రాహ్మణభక్తి, శ్రద్ధ, పాండిత్యం, బ్రాహ్మణవృత్తి, ఉపాధ్యాయవృత్తి, ముద్రాధికారం, భ్రాతృసుఖం, సంపత్తి, బహువిధ విద్వత్తు, వ్యాకరణం, రక్తము, పిత్తాశయము, రక్తనాళములు, ఉన్నతవిద్యలపై అధికారము, వాణిజ్యవిషయములు, ధనవిషయములు మొదలైనవి గురుని కారకత్వములు.
వివాహం, భార్య, భాగ్యం, భోగం, వాహనం, కామసుఖం, సంగీతం, విద్యాది రహస్యం, నృత్యం, సంగీతం, లలితకళలు, సరససల్లాపము, శిల్పం, జ్యోతిషం, కవిత్వం, స్త్రీ సౌఖ్యం, ఆభరణం, మణిమాణిక్యాది కారకుడు, నాటకాలంకార సాహిత్యాదులు, వ్యభిచారం, నృత్తము, ఆభరణం, ఐశ్వర్యం, ముద్రాధికారం, హాస్యం, రహస్యమోహము, వేశ్యాసంభోగం, సౌమ్యం, సౌందర్యం, శ్వేతవర్ణం, సునేత్రం, ఖండశరీరం, పొట్టి, గర్వం, దృఢత్వం, ఆజ్ఞ, శుక్లం, శయనాగారం, మంత్రం, ఆగ్నేయదిశ, మధ్యవయస్సు, రాజముద్ర, సత్యవచనం, యజుర్వేదము, భరతశాస్త్రం, శ్వేతఛత్రం, వింజామరలు, ఐశ్వర్యము, సింహాసనము, సుగంధము, హేమము, రాజు, రతి, స్త్రీసుఖం, గానం, కాంతి, కళాకౌశలం, స్పర్ష, గొంతు, మూత్రపిండములు, అండకోశము, అంతఃకరణముమీద ప్రభావం, భూతదయ, ఉన్నతమైన మేధాశక్తి, సంగీతము, నాట్యము, నాటకశాలలు, పద్యకవిత్వము, చిత్రలేఖనము మొదలైన వాటికి శుక్రుడు కారకత్వం వహిస్తాడు.
ఆయువు, జీవనోపాయం, మరణం, సేవకులు, జైలు, బంధనం, ప్రవాసం, నీచవిద్య, నీచదేవతోపాసన, దుఃఖము, అధర్మం, స్ఫోటకం, కురూపం, శాంతము, అనాచారం, నల్లధాన్యములు, మహిషము, పితృకారకత్వం, దుష్ప్రవర్తన, కోపము, పాపము, నరకము, నీచజీవనము, హూణవిద్య, కృషిజీవనం, శూద్రప్రియుడు, క్రిందిచూపు, అజీర్ణము, అసత్యం, అన్యకుల విద్య, కఠినము, ఔదార్యం, కఠినరోమములు, పౌరుషహీనం, మలినవస్త్రం, నీలమణి, ఇనుము, వాయువు, భూపరాగం, తిల, తైలములు, దాస్యము, విరోధం, దుఃఖం, మరణం, నపుంసకత్వం, ప్రతిబంధనం, ఈశాన్యదిశ, అడవుల సంచారం, పౌరుషం, వాతము, వాద్యధ్వని, దుస్సహాసము, కార్యభంగము, కిరాతత్వము, వ్యసనము, జ్యేష్టసోదరుడు, నౌఖరుల సుఖదుఃఖాలు, ఘాతుక స్వభావం, దారిద్య్రం, కారాగృహవాసం, కుడిచెవి, శ్రవణశక్తి, ఎముకలు, పలువరుస, మోకాలు, ప్లీహము మొదలైనవి శని కారకత్వములు.
మాతామహులు, మాతామహ సంబంధములు, ఛత్రం, హూణవిద్య, తటాకములు, ఆరామములు, సీసము, సన్మానము, యవ్వనం, బొమికెలు, పాపస్త్రీవలన లాభము, వ్యయము, వ్యవసాయము, వ్యాపారము, వ్యతిరిక్తత, వైధవ్యం, వృక్షపతనము, శిలలు, బలాత్కారము, సంకోచము, ఉద్యోగము, వివాహము, యుద్ధము, బొగ్గు, ధూమపానము, పొగాకు, ఛామరం, పితృచింత, విషవైద్యము, క్షుద్రమంత్రాలు, నీచజీవనము, ద్యూతం, పశుసాంగత్యం, అపసవ్యలిపి, హృద్రోగం, గారడి, లాటరీలు, కుతర్కం, పాపస్త్రీ, పాము, రాత్రి, ఏకఛత్రాధిపత్యం, నైబÁుుతిదిశ, రాజ్యము, జూదగుణం, స్వదేశ, విదేశగమనం, నీచాశ్రయం, శ్వాస, ప్రేతత్వము, కర్మ, విసనకర్ర, వైద్యశాస్త్రం, రత్నపరీక్ష మొదలైనవి రాహుకారకత్వములుగా చెప్పబడ్డాయి.
పితామహచింత, మట్టిపాత్రలు, మోక్షము, ఆలస్యం, నిద్ర, ముక్కు, స్వప్నము, జాగ్రదవస్థ, ప్రవాసము, ఉదరము, నేత్రసంబంధము, మూఢభక్తి, మంత్రతంత్రములు, చిత్రలిపి, క్రూరకృత్యములు, యోగాభ్యాసము, పింగాణి, బహుదాతృత్వము, వేదాంతవిచారణ, దైవభక్తి, వైరాగ్యము, జ్ఞానము, అన్యభాషాప్రవేశం, కిరాతకం, పాషాణం, వ్రణం, అల్పాహారము, శతృబాధ, జడత్వం, కపలత్వం, వైద్యము, కృత్రిమమణులు, కృత్రిమ వస్తువులు, స్ఫోటకము, తారు, విషాదము, గంగాస్నానము, భోగభాగ్యములు, మూఢభక్తి, లోభత్వం, అన్యభాష, మిత్రభేదము, శైవదీక్ష, మతము, మతఛాందసము, దంభము, నటనము, భిక్షాటన, కీర్తి, కపాలము, స్నేహము, బ్రహ్మవిద్య, పితామహాది సంబంధ లాభములు మొదలైనవి కేతు కారకత్వములు.