కార్టోశాట్-2F ఉపగ్రహం

కార్టోశాట్ -2F ఉపగ్రహం భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన ఇస్రో తయారుచేసిన రిమోట్ సెన్సింగు కృత్రిమ ఉపగ్రహము.ఈ ఉపగ్రహాన్నికార్టోశాట్-2ER అని కూడా అనవచ్చ్గును.ఇస్రో ఇప్పటికే అంతరిక్షములో కార్టోశాట్ -2 శ్రేణికి సంబంధించి 6 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టినది.వినియోగ దారులకు మరింత విస్తృత సేవలు అందించుటకై కార్టోశాట్-2F శ్రేణి ఉపగ్రహన్ని ప్రయోగించారు.కార్టోశాట్-2F ఇస్రో కక్ష్యలో ప్రవేశ పెట్టిన కార్టోశాట్-2 శ్రేణి 7 ఉపగ్రహం. కార్టోశాట్ -2 శ్రేణి ఉపగ్రహాలను ఇస్రో దేశీయ అవసరాల కోసం ప్రయోగిస్తున్నది. భౌగోళిక సమాచార సేకరణ ఈ కార్టోశాట్ ఉపగ్రహాల ప్రధాన లక్ష్యం. కార్టోశాట్ -2 ఉపగ్రహాల శ్రేణిని 2005 లో రూపొందించారు. 2007 జనవరి 10 న పీఎస్ఎల్వీ-సీ7 ద్వారా కార్టోశాట్ -2ను ప్రయోగించారు.2008 ఏప్రిల్ 28 న పీఎస్ఎల్వీ-సీ9 ద్వారా కార్టోశాట్ -2Aను ప్రయోగించారు. 2010 జూలై 12 న పీఎస్ఎల్వీ-సీ15 ద్వారా కార్టోశాట్ -2B ప్రయోగించారు.2016 జూన్ 22 న పీఎస్ఎల్వీ-సీ34 ద్వారా కార్టోశాట్ -2C ఉపగ్రహాన్ని ప్రయోగించారు. 2016 ఫిబ్రవరి 15 న ప్రయోగించినకార్టోశాట్ -2Dతో కలుపుకుని ఇప్పటికి 5 కార్టోశాట్ ఉపగ్రహాలు పనిచేస్తున్నాయి.కార్టోశాట్-2E ఉపగ్రహం ఈ శ్రేణిలో ఆరవ ఉపగ్రహం. దీని జీవితకాలం 5 సంవత్సరాలు. కార్టోశాట్ -2 ఉపగ్రహశ్రేణి ఉపగ్రహాలన్నీ సూర్యానువర్తిత ధ్రువీయ కక్ష్యలో భూమికి 500-520 కి.మీ. పైబడిన ఎత్తులో, భూమి చుట్టూ తిరుగుతున్నాయి.[1]

కార్టోశాట్-2Fఉపగ్రహంవివరాలు మార్చు

కార్టోశాట్-2E బరువు 713 కిలోలు. దీని జీవిత కాలం 5 సంవత్సరాలు. ఈ ఉపగ్రహంలో ప్రధానంగా రెండు ఉపకరణాలు ఉన్నాయి. ఒకటి ప్యాన్ క్రొమెటిక్ కెమెరా కాగా, రెండవది మల్టీ స్పెక్ట్రల్ కెమెరా. ఉపగ్రహం యొక్క ఆన్‌బోర్డ్ పవర్ 930 watts. వాలుతలం 97.89 డిగ్రీలు. ఆవర్తన కాలం 97.38 నిమిషాలు. ఉపగ్రహంలో అమర్చిన పాన్‌క్రోమాటిక్ కెమెరా భూమియొక్క నలుపు, తెలుపు చిత్రాలు చిత్రికరించగలదు. కెమెరా తరంగ దైర్ఘ్యం 0.5 – 0.85 మైక్రో మీటర్లు, రిజల్యూషన్ 1 మీటరు కన్న తక్కువ.ఉపగ్రహ వ్యవస్థలో అమర్చిన పాన్‌క్రోమాటిక్ మల్టీస్పెక్ట్రమ్‌ కెమెరా అత్యంత నాణ్యమైన నలుపు తెలుపు చిత్రాలను తీసి పంపిస్తుంది. పట్టణ, గ్రామీణాభివృద్ధి ప్రణాళికలు, సముద్రతీర ప్రాంతాల నిర్వహణ, రహదారుల పర్యవేక్షణ, నీటి పంపిణి, భూవినియోగంపై చిత్రాలను తయారుచెయ్యడం వంటి పనులు చేస్తుంది. విపత్తులను విస్తృతంగా అంచనా వేసి సమాచారం అందిస్తుంది. వ్యయసాయ సంబంధిత సమాచారం అందుబాటులోకి తెస్తుంది.

ఉపగ్రహ బరువు 710 Kg
ప్రదక్షిణ సుర్యాను వర్తిత ధ్రువీయ కక్ష్య
కక్ష్య ఎత్తు 505 కిలో మీటర్లు
కక్ష్య కోణం 97.47 డిగ్రీల ఏటవాలులో
ఒక ప్రదక్షిణకు పట్టు సమయం 94.72 min
భూమధ్య రేఖను దాటు సమయం 9:30 ఉదయం, భారతీయ కాల మానం
విద్యుతు సోలారు/సౌర్య పలకల వలన 986 Watts.రెండు లిథియం-ఆయాన్ బ్యాటరీలు వున్నవి
జీవిత కాలం 5 సంవత్సరాలు

ఉపగ్రహ ప్రయోగ వివరాలు మార్చు

ఉపగ్రహాన్ని పిఎస్‌ఎల్‌వి-సీ40 అనే, XL రకానికి చెందిన రాకెట్/ఉపగ్రహ వాహక నౌక ద్వారా అంతరిక్ష కక్ష్యలో విజయ వంతంగా ప్రవేశ పెట్టారు.పీఎస్ఎల్వీ-సీ40 రాకెట్ ను ఆంధ్రప్రదేశ్ లోని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో శ్రీహరికోటలో నిర్మించన సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం (క్లుప్తంగా షార్) నుండి 2018 జనవరి 12 న, మొదటి రాకెట్ ప్రయోగ కేంద్రం నుండి ప్రయోగించారు.ఉపగ్రహాన్ని కక్ష్యలో 502 కిలోమీటర్ల పెరిజీ (భూమినుండి దగ్గరి దూరం), 506 కిలోమీటర్ల అపోజి (భూమినుండి ఎక్కువ దూరం) లో ఉపగ్రహం తిరిగేలా సుర్యానువర్తిత ధ్రువీయకక్ష్యలో ప్రవేశ పెట్టారు.కక్ష్యలో ఉపగ్రహాన్ని సెకనుకు 7.06 కిలోమీటర్ల త్వరణంలో ప్రవేశ పెట్టారు.కార్టోశాట్ ఉపగ్రహాన్ని కక్ష్యలోని పంపిన 30 సెకన్ల తరువాత LEO 1, POC-1 అనే మరో రెండు ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపడం జరిగింది.Telesat phase 1 LEO మైక్రో ఉపగ్రహం కెనడాకు చెందిన Kబాండ్ సమాచార ఉపగ్రహం.అలాగే POC-1 ఉపగ్రహం, ఫిన్లాండ్ కు చెందిన ఉపగ్రహం.ఈ రెండు ఉపగ్రహాలతో కలుపు కొని మొత్తం 28 చిన్న, సూక్ష్మ ఉపగ్రహాలను వేరు వేరు సమయాల్లో కక్ష్యల్లోకి పీఎస్ఎల్వీ-సీ40 రాకెట్ ద్వారా ప్రవేశ పెట్టారు.విదేశాలకు చెందిన 28 ఉపగ్రహాల మొత్తం బరువు 470 కిలోలు. అంతే కాకుండా కార్టోశాట్ ఉపగ్రహంతో పాటు భారత దేశానికిచెందిన మరో చిన్న ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపారు.అందులో 100 కిలోల బరువు ఉన్న IMS-1 bus కు చెందిన మైక్రో ఉపగ్రహం, INS-1C అనబడు ఇండియన్ నానో శాటిలైట్ ఒకటి. INS-1C ను రాకెట్ ను ప్రయోగించిన 19 నిమిషాల 36 సెకన్ల తరువాత కక్ష్యలోకి ప్రవేశ పెట్టబడింది. దీని జీవిత కాలం 6 నెలలు.

మైక్రోశాట్(భారతీయ చిన్న ఉపగ్రహం) మార్చు

100 కిలోల బరువుఉన్న ఈ చిన్నఉపగ్రహానికి ఒక ప్రత్యేకత ఉంది.ఇది ఇస్రో తయారు చేసిన 100 వ ఉపగ్రహం.నాడు 56 సంవత్సరాల ఆర్యభట్ట ఉపగ్రహంతో మొదలైన ఇస్రో నేడు మైక్రోషాట్ ఉపగ్రహామ తయారితో 100 ఉపగ్రహాల తయారి మైలు రాయిని దాటింది.అంతే కాదు ఈ ఉపగ్రహాన్ని ఒక నూతన పద్ధతిలో కక్ష్యలో ప్రవేశ పెట్టారు.రాకెట్ నాల్గవదశ ఇంజనును 16 నిమిషాల 36 సెకన్లకు ఆపి వేసి, కార్టోశాట్ తో సహా మొత్తం 30 ఉపగ్రహాలను 17 నిమిషాల నుండి మొదలుకొని 23 నిమిషాల వరకు 510 నుండి 519 కిలో మీటర్ల ఎత్తులో కక్ష్యల్లోకిపంపారు.అటు తరువాత 58నిమిషాల 13 సెకన్లకు మల్లి నాల్గవ దశ ఇంజనును మండించి, తిరిగి 58నిమిషాల18 సెకన్లకు ఆపారు.తిరిగి నాల్గవ దశ ఇంజను 359 కిలో మీటర్లఎత్తులోను 1గంట 44 నిమిషాల 54 సెకన్లకు మండించి తిరిగి 1గంట 44 నిమిషాల 59సెకన్లకు ఆపి వేసి, రాకెట్ ప్రయోగించిన 1గంట 45 నిమిషాల 35 సెకన్లకు మైక్రోశాట్ ఉపగ్రహాన్ని359 కిలో మీటర్లఎత్తులో కక్ష్యలోకి పంపారు.ఇలా నాల్గవ దశను ఇంజనును పలు మార్లు మండించి, ఎత్తు తగ్గించి చివరి ఉపగ్రహాన్ని ప్రయోగించడం ఇదే మొదటి సారి.ప్రయత్నం విజయ వంతం అయ్యింది.[2]

ఆధారాలు/మూలాలు మార్చు

  1. "ISRO PSLV-C38 launched: What is Cartosat-2 series satellite?". indianexpress.com. Retrieved 2017-06-27.
  2. "సూపర్ సెంచరీ". andhrajyothy.com. Archived from the original on 2018-01-13. Retrieved 2018-01-13.