పిఎస్‌ఎల్‌వి-సీ40

పిఎస్‌ఎల్‌వి-సీ40 అనేది ఒక ఉపగ్రహ వాహక నౌక. పిఎస్‌ఎల్‌వి శ్రేణికి చెందిన 42వ ఉపగ్రహ ప్రయోగ నౌక. దీనిని బారతీయ అంతరిక్షప్రయోగ సంస్థ క్లుప్తంగా ఇస్రో తయారు చేసింది.పీఎస్ఎల్వీ అనగా పోలారు శాటిలైట్ లాచింగు వెహికిల్.దృవీయ కక్ష్యలో ఉపగ్రహాన్ని ప్రవేశ పెట్టే రాకెట్. పీఎస్ఎల్వీ రకానికి చెందిన ఉపగ్రహ వాహక/ప్రయోగ నౌక ఇస్రో సంస్థ యొక్క అంబుల పొదిలోని బ్రహ్మస్త్రం లాంటిది.ఈ పర్యాయం ఇస్రో పీఎస్ఎల్వీ-సి40 ప్రయోగ నౌక ద్వారా వాతావరణ పరిశోధన, అద్యయనానికి చెందిన, కార్టోశాట్-2 శ్రేణికి చెందిన ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపుతున్నారు.710 కేజీల బరువు ఉన్న కార్టోశాట్-2 శ్రేణికి చెందిన ఈ ఉపగ్రహం ఇస్రో ప్రయోగించిన 100 వ ఉపగ్రహం కానున్నది.ఈ ఉపగ్రహంతో పాటు మరో 30 ఇతర చిన్న,సూక్ష్మ ఉపగ్రహాలను కూడా అంతరిక్ష కక్ష్య(వీటి మొత్తం బరువు 613 కిలోలు)లో పీఎస్ఎల్వీ-సి40 ప్రవేశ పెట్టినది.మొత్తం 31 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టరు.అందులో ఇస్రో తయారుచేసిన 100 స్వదేశి ఉపగ్రహం 100 కేజిలున్న మైక్రోశాట్ ఉన్నది.[1]

PSLV-C40
Model of a rocket
Model of the PSLV rocket
మిషన్ రకంDeployment of 31 satellites
ఆపరేటర్ISRO
వెబ్ సైట్ISRO website
అంతరిక్ష నౌక లక్షణాలు
అంతరిక్ష నౌకPolar Satellite Launch Vehicle
అంతరిక్ష నౌక రకంExpendable launch vehicle
తయారీదారుడుISRO
పే లోడ్ ద్రవ్యరాశి1,323 కిలోగ్రాములు (2,917 పౌ.)
మిషన్ ప్రారంభం
ప్రయోగ తేదీ09:28:00, 12 జనవరి 2018 (2018-01-12T09:28:00) (IST)
రాకెట్Polar Satellite Launch Vehicle
లాంచ్ సైట్Sriharikota Launching Range
కాంట్రాక్టర్ISRO
పేలోడ్
List of Satellites:
← PSLV-C30
PSLV-C41 →
 

ప్రయోగ వేదిక, తేది

మార్చు

పీఎస్ఎల్వీ-సి40 ప్రయోగాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో,బంగాళాఖాతం కు ఆనుకుని ఉన్న శ్రీహరికోట లో వున్నసతీష ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం (క్లుప్తంగా షార్ సంస్థ)లోని మొదటి ఉపగ్రహ ప్రయోగవేదిక నుండి ప్రయోగించారు.ఈ ప్రయోగం 2018 వ సంవత్సరం జనవరి 12న జరిగినది.

పీఎస్ఎల్వీ-సి40 ద్వారా ప్రయోగించ నున్న ఉపగ్రహాలు

మార్చు
  • 710 కేజీల బరువు ఉన్న కార్టోశాట్-2 శ్రేణికి చెందిన ఉపగ్రహం
  • అలాగే భారత దేశానికి చెందిన రెండు ఉపగ్రహాలు.అందులోఒకటి మైక్రో ఉపగ్రహం మరొకటి సూక్ష్మ(nano) ఉపగ్రహం.
  • కెనడా,ఫిన్లాండ్,ఫ్రాన్స్,రిపబ్లిక్ ఆఫ్ కొరియా,బ్రిటన్, అమెరికాకు(మొత్తం ఆరు దేశాలు) చెందిన 3 మైక్రో,25నానో ఉపగ్రహాలను ఏక కాలంలో ఈ ఉపగ్రహ వాహక నౌక ద్వారా అంతరిక్షములోకి పంపుతున్నారు

మొత్తం ఉపగ్రహాల బరువు 1323 కిలోలు. పీఎస్ఎల్వీ రకపు ఉపగ్రహ వాహక నౌక 1300నుండి1500 కిలోల బరువున్న ఉపగ్రహాలను అంతరిక్షకక్ష్యలో ప్రవేశ పెట్టు సామర్ధ్యం కల్గి వున్నది.

పిఎస్‌ఎల్‌వి- సీ40 దశల వివరాలు

మార్చు

ఇది 44.4 మీట్లర్ల ఎత్తు.మొత్తం ఇంధనంతో కల్పి 320 టన్నుల బరువు.[2]

మొదటి దశ (PS1)

మార్చు

మొదటిదశలోని S139 ఘన ఇంధన మోటారు, 4800 కిన్యూ (కిలో న్యూటన్)ల థ్రస్ట్ (thrust)ను ఇస్తుంది. ఈ దశలో 138 టన్నుల HTPB ఇంధనాన్ని వాడతారు. మొదటి దశ 105 సెకండ్ల పాటు మండి, నౌక 74 కిమీ ఎత్తుకు చేరాక, రెండవ దశ నుండి విడిపోతుంది. మొదటి దశ విడివడి దూరం అయ్యాక రెండవ దశ మండుతుంది.

స్ట్రాపాన్ బూస్టర్లు

మార్చు

మొదటి దశకు 6 స్ట్రాపాన్ బూస్టర్లను అమరుస్తారు. ఈ అరింటిలో 4 బూస్టర్లు మొదటి దశతో పాటే (అర సెకండు తేడాతో) మండిస్తారు. రాకెట్ పైకిలేచిన 25 సెకండ్ల తర్వాత మిగిలిన రెండు బూస్టర్లను మండిస్తారు. ఈ స్ట్రాపాన్ బూస్టర్లలో కూడా ఘన ఇంధనాన్నే వాడుతారు. స్ట్రాపాన్ ఇంజన్ కలుగజేయు థ్రస్ట్ 719 కిన్యూ. మొదటి 4 బూస్టర్లు 24 కిమీ ఎత్తున, మిగతా రెండు బూస్టర్లు 41 కిమీ ఎత్తున విడిపోయి పడిపోతాయి.

రెండవ దశ (PS2)

మార్చు

రెండవ దశలో ద్రవ ఇంధనం ఉపయోగిస్తారు. రెండవ దశకు వికాస్‌ ఇంజన్‌ను అమర్చారు. ఈ ఇంజన్ను లిక్విడ్ ప్రోపల్షన్ సిస్టమ్స్ సెంటర్ (Liquid Propulsion Systems Centre) తయారు చేసింది. ఇందులో ఉపయోగించే ఇంధనం UDMH + N2O4. ఈ ఇంజను ఇచ్చే థ్రస్ట్ 799 కిన్యూ. ఈ దశ 158 సెకండ్లు మండి, 277 కిమీ ఎత్తు వద్ద విడివడి పోతుంది.

మూడవ దశ (PS3)

మార్చు

ఈ దశలో ఘన ఇంధనం HTPB వాడతారు. ఇది 240 కిన్యూల థ్రస్ట్‌ను అందిస్తుంది. ఈ దశ 112 సెకండ్ల పాటు మండి, 580 కిమీ వద్ద విడిపోతుంది.

నాల్గవ దశ (PS4)

మార్చు

ఇది పిఎస్‌ఎల్‌వి లోని అంతిమ దశ. పేలోడ్ దీనికి చేర్చి ఉంటుంది. ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపే బాధ్యత ఈ దశదే. ఈ దశలోని రెండు PS-4 ద్రవ ఇంధన ఇంజనులు ఒక్కొక్కటి 7.6 కిన్యూ థ్రస్టును ఉత్పత్తి చేస్తాయి. ఉపయోగించు ఇంధనం MMH + MON. యాత్ర అవసరాన్ని బట్టి ఈ దశ 540 సెకండ్ల వరకు మండుతుంది.

నాల్గవ దశలోనే పరికరాల అర కూడా ఉంటుంది. ఈ అరలో ఇనర్షియల్ గైడెన్స్ వ్యవస్థ, ఫ్లైట్ కంప్యూటరు, టెలిమెట్రీ, ఏవియానిక్స్ పరికరాలు ఉంటాయి.

ప్రయోగ వివరాలు

మార్చు

శుక్రవారం ఉదయం మొదలైన కౌంట్ డౌన్ శనివారం ఉదయం 9:30 నిమిషాలకు పూర్తవ్వగానే మొదటి ప్రయోగ వేదిక మీదున్న రాకెట్ నిప్పులు కక్కుతూ,వెలుగులు విరజిమ్ముతూ నింగివైపు దూసుకెళ్లింది. 138.2టన్నుల ఘన ఇంధనంతో ఉన్న మొదటి దశ,దానికి అమర్చిన ఒక్కొక్కటి 12.0టన్నుల ఇంధన మున్న 6 స్ర్టాపాన్ మబూస్టరులుల వలన మొదటి 1.52 నిమిషాల్లో 67.8 కిలోమీటర్ల ఎత్తుకుచేరింది.ఈ క్రమంలో బూస్టరులు మొదటి దశ మోటారులు రాకెట్ నుండి విడిపోగానే,రెండో దశ పని చేయ్యడం మొదలై2.31నిమిషాలకు రకెట్ చివరి దశలో ఉపగ్రహాల చుట్తు రక్షణగా వుంచిన ఉష్న కవచం విడి పోయింది.4.21 నిమిషాలకు 229.2 కిలో మీటర్ల ఎత్తుకు చేరాక రెండో దశ రాకెట్ నుంది వేౠ పడింది.ఆతరువాత మూడో దశ పనిచెయ్యడం మొదలెట్తి రాకెట్ ను 8.16 నిమిషాలకు 434 కిలో మీటర్ల ఎత్తుకు చేర్చి విడిపోయింది. తరువాత నాల్గవదశ పనిచెయ్యడం మొదలెట్టి 509 కిలో మీటర్ల ఎత్తుకు చేరగానే,నాల్గవ దస ఇంజనును ఆపీ వేసి,51 కిలో మీటర్ల ఎత్తుకు 17.22 నిమిషాలకు చేరగానే కార్టోశాట్-2 ఉపగ్రహం కక్ష్యలో కి విడుదల అయ్యింది.అక్కడి నుండి నాల్గవ దశ ముందుకు వెళ్తూ 512 కిలో మీటర్ల ఎత్తులో విదేశాలకు చెందిన ఐదు నానో/సూక్ష్మ ఉపగ్రహలు కక్ష్యలోకి విడుదల అయ్యయి.19.36 నిమిషాలకు భారత దేశ్హానికి చెందిన నానో ఉపగ్రహం 513 కిలో మీటర్లేత్తులో కక్ష్యలోచేరింది.పిమ్మట 27.13 నిమిషాలలో మిగిలిన 23 విదేశి ఉపగ్రహాలు వటి కక్ష్యలోకి విడదల అయ్యాయి. ఆతరువాత నాల్గవ దస ను రెండు సార్లు మందించి ఆపీ దానిని 359 కిలో మీటర్ల ఎత్తుకు తెచ్చి,రాకెట్ నల్గ్వ దశలో వున్న100 కిలోల బరువున్న మైక్రోశాట్ ను రాకెట్ బయలు దేరిన 1.44 నిమిషాలకు రోదసి కక్ష్యలో ప్రవేశపెట్తారు.ఆతరువాత నాలుగోసదసను ఆన్ చేస్తూ,ఆప్ చేస్టు 374 కిలోమీటర్ల ఎత్తుకు తెచ్చి విడచి పెట్టారు[3]

విడియో/చిత్రాల బయటి లింకులు

మార్చు

ఇవి కూడా చదవండి

మార్చు

మూలాలు/ఆధారాలు

మార్చు
  1. "PSLV-C40/Cartosat-2 Series Satellite Mission". isro.gov.in. 2018-01-12. Archived from the original on 2019-03-23. Retrieved 2018-01-13.
  2. "PSLV-C40 / Cartosat-2 Series Satellite Brochure". isro.gov.in. Archived from the original on 2018-01-11. Retrieved 2018-01-13.
  3. "సూపర్ సెంచరీ". andhrajyothy.com. Archived from the original on 2018-01-13. Retrieved 2018-01-13.