కార్బ్యురేటర్
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
కార్బ్యురేటర్ అనేది దహనానికి సరైన గాలిని-ఇంధనాన్ని నిష్పత్తిలో అంతర్గత దహన యంత్రాల కోసం గాలి, ఇంధనాన్ని కలిపే పరికరం. కార్బ్యురేటర్ సహాయంతో మనం నడుపుతున్న వాహనాన్ని మనం మన అదుపులో ఉంచుకోవచ్చు. నడుపుతున్న వాహనం స్టార్టింగ్ లోనే తటస్థంగా ఉంచుటకు, వేగమును నిదానముగా పెంచుటకు, పెంచిన వేగాన్ని అలాగే ఉంచుటకు మనకు కార్బ్యురేటర్ సహాయపడుతుంది. కార్బ్యురేటర్ ను ఎక్సలేటర్ ద్వారా నియంత్రించవచ్చు. యంత్రాన్ని స్టార్ట్ చేసినప్పుడు యంత్రం ఆగిపోకుండా వీలయినంత తక్కువ ఇంధనంతో యంత్రమును స్టార్ట్ లోనే ఉంచుటకు కార్బ్యురేటర్ సహాయపడుతుంది. కార్బ్యురేటర్‌ను అడ్జెస్ట్‌మెంట్ చేయటం ద్వారా అంతర్గత దహన యంత్రాలలోకి ఇంధనం, గాలిని ఎంత నిష్పత్తిలో పంపించాలో అంత పంపించవచ్చు, తద్వారా ఇంధన సామర్థ్యాన్ని వీలయినంత వరకు పెంచుకోవచ్చు, దీని వలన అదనపు ఇంధన ఖర్చు తగ్గుతుంది. కార్బ్యురేటర్ సరిగా పనిచేయనప్పుడు ఇంధనం ఎక్కువ ఖర్చు అవుతుంది, దానితో పాటు ఇంజిన్ ఆగిపోవచ్చు, ఇంజిన్ ఒడిదుడుకులకు గురై యంత్రం చెడిపోవచ్చు. కార్బ్యురేటర్ లను వాహనాలలో, టిల్లర్ లలో, అనేక యంత్రాలలో నేడు ఉపయోగిస్తున్నారు.
కార్బ్యురేటర్ ఇంధనాన్ని ఇంధన ట్యాంకు నుండి తీసుకొని అలాగే గాలిని చౌక్ ద్వారం నుండి తీసుకొని ఇంజిన్ లోని అంతర్గత దహన యంత్రాలకు అందిస్తుంది, అంతర్గత దహన యంత్రంలో ప్లగ్ ద్వారా వెలువడే స్పార్క్ (నిప్పు రవ్వ) ల ద్వారా ఇంధనం మండి పిస్టన్ కదులుతుంది తద్వారా యంత్రం కదులుతుంది.