నిప్పురవ్వ ఎ.కోదండరామి రెడ్డి దర్శకత్వంలో 1993లో విడుదలైన చిత్రం. ఇందులో నందమూరి బాలకృష్ణ, విజయశాంతి ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాను ఎం. వి. శ్రీనివాస ప్రసాద్ యువరత్న ఆర్ట్స్ పతాకంపై నిర్మించాడు. బప్పీలహరి పాటలు స్వరపరచగా, ఎ. ఆర్. రెహమాన్ నేపథ్య సంగీతాన్ని సమకూర్చాడు. రాజ్ కోటి కూడా ఒక పాట స్వరపరిచారు.

నిప్పురవ్వ
Nippuravva.jpg
దర్శకత్వంఎ.కోదండరామి రెడ్డి
నిర్మాతఎం. వి. శ్రీనివాస ప్రసాద్
తారాగణంనందమూరి బాలకృష్ణ
విజయశాంతి
నిళల్ గళ్ రవి
శోభన
సంగీతంబప్పిలహరి
రాజ్ - కోటి (రండి కదలి రండి పాటకు)
ఎ.ఆర్.రెహమాన్ (నేపథ్య సంగీతం)
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
1993 సెప్టెంబరు 3 (1993-09-03)
భాషతెలుగు

సింగరేణి బొగ్గు కార్మికుల నేపథ్యంలో ఈ సినిమా తీశారు. చిత్రీకరణలో ఒక ప్రమాదం జరిగింది. దీంతో ఈ చిత్రం విడుదల వాయిదాపడి బాలకృష్ణ నటించిన బంగారు బుల్లోడు చిత్రం తో సమానంగా ఒకే రోజు విడుదలై పోటీ పడాల్సి వచ్చింది

కథసవరించు

నటవర్గంసవరించు

విడుదలసవరించు

ఈ సినిమా 1993, సెప్టెంబరు 3 న విడుదలైంది. ఇదే రోజున బాలకృష్ణ నటించిన బంగారు బుల్లోడు సినిమా కూడా విడుదలయ్యింది. ఈ రెండింటిలో నిప్పురవ్వ సరిగా ఆడలేదు కానీ బంగారు బుల్లోడు మాత్రం విజయవంతమైన చిత్రంగా నిలిచింది. నిప్పురవ్వ సినిమాను చిత్రీకరిస్తుండగా ఒక ప్రమాదం జరిగింది. దాంతో ఈ సినిమా విడుదలను నిలుపు చేయాలని కొంతమంది కోర్టుకెక్కారు. అందుకని ఈ చిత్రం విడుదల ఆలస్యమయ్యి బంగారు బుల్లోడు చిత్రంతో సమానంగా ఒకే రోజు విడుదలై పొటీ పడాల్సి వచ్చింది.[1]

సాంకేతికవర్గంసవరించు

సంగీతంసవరించు

ఈ చిత్రానికి బప్పీలహరి సంగీత దర్శకత్వం వహించాడు. రండి కదలిరండి అనే ఒక్క పాట మాత్రం రాజ్ కోటి స్వరపరిచారు. ఎ. ఆర్. రెహమాన్ ఈ చిత్రానికి నేపథ్య సంగీతం అందించాడు. ఇలా ఒకే సినిమాకు నలుగురు సంగీత దర్శకులు కలిసి పనిచేయడం అరుదైన సంఘటన.[1]

మూలాలుసవరించు

  1. 1.0 1.1 "బాలయ్య అరుదైన రికార్డుకు 25 ఏళ్లు". News18 Telugu. 2018-09-03. Archived from the original on 2020-07-10. Retrieved 2020-07-10.

బయటి లంకెలుసవరించు