కార్ల్స్‌బాడ్ ఫ్లవర్ ఫీల్డ్

కార్ల్స్‌బాడ్ ఫ్లవర్ ఫీల్డ్ అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాన్ డియాగోకు 37.6 మైళ్ళ దూరంలో ఉంది. లాస్ ఏంజలెస్ నుండి 87.4 మైళ్ళ దూరంలో ఉంది. ఇది లాస్ ఏంజలెస్ నుండి శాన్ డియగో మార్గంలో ఉంది. లాస్ ఏంజలే నుండి 1.30 నిముషాలకు ఇక్కడికి చేరుకోవచ్చు. శాన్ డియాగో నుండి 40 నిముషాలలో చేరుకోవచ్చు. కార్ల్స్‌బాడ్ బీచ్, చిల్డ్రెన్స్ మ్యూజియమ్, థీమ్ పార్క్ వంటి ఆకర్షణలు ఉన్నా ఇక్కడి ఫ్లవర్ ఫీల్డ్ మాత్రం పర్యాటకుల ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి. మార్చి 1వ తారీఖు నుండి మే 13 వరకూ పర్యాటకుల సందర్శన కొరకు తెరచి ఉంచే ఈ పూలతోటలు పర్యాటకులను అధికంగా ఆకర్షిస్తాయి.

రాన్యూనిక్యులస్ పూలు
కార్ల్స్‌బాడ్ ఫ్లవర్ ఫీల్డ్ ప్రవేశం
పురాతన శైలి ట్రాక్టర్ ట్రక్కులో పర్యాటకులు

చరిత్ర

మార్చు

ప్రస్తుత ఈ పూల తోటలు 85 సంవత్సరాలు పూల ఉత్పత్తి రంగంలో జరిగిన కృషిఫలితం. 85 సంవత్సరాలకు ముందు ఆరంభ సెటిలర్ ‍ & గ్రోవర్ లూధర్ జార్జ్ 1920లో ఇక్కడకు వచ్చి స్థిరపడ్డాడు. ఇక్కడ స్థిరపడినప్పుడు జార్జ్ లూధర్ తాను తీసుకు వచ్చిన రాన్యూనిక్యులస్ అనే పూల విత్తనాలను ఫ్రాంక్ ఫ్రేజీ యొక్క పసిఫిక్ సముద్ర తీరాన ఉన్న చిన్న కూరగాయల తోట పక్కన ఉన్న తన పొలములో పెంచసాగాడు. ఇది ఆయన లూథర్ జార్జ్ జెయింట్ టెకొలోట్ రాన్యూనిక్యులస్ బల్బ్ పేరుతో సాగించిన వ్యాపారానికి నాంది అయింది. అక్వా హెడియోండా లాంగూన్ తీరాన ఉన్న ఫ్రాజీ ర్యాంచ్‌ని అగ్ని ధ్వంసం చేసిన కారణంగా కుంటుంబం తప్పనిసరిగా సముద్రతీరానికి తరిలించబడింది. అక్కడ ఫ్రీజియా బల్బ్స్ పెంచుతున్న ఫ్రాంక్ ఫ్రాజీతో పరిచయం ఏర్పడింది. అప్పుడు ఫ్రీజియా బల్బ్స్ కొరకు గిరాకీ అధికం ఉంది. అది అదనుగా తీసుకుని ఫ్రాంక్ ప్రభుత్వ భూమిని లీజ్‌కు తీసుకుని దానిలో తన పంటను అభివృద్ధిచేసాడు. 1933లో ఫ్రాజీ తన తోటలో అదనంగా రాన్యూనిక్యులస్ పంటను చేర్చి తన కుమారుడైన ఎడ్విన్‌కు అందమైన అయినా తక్కువ ప్రాబల్యమైన ఈ పూతోటల పెంపకానికి కావలసిన విత్తుట, కోత, నీటి పారుదల వంటి కళను నేర్పాడు. తన 16వ ఏట ఎడ్విన్ ఉన్నత పాఠశాల చదువును ముగించకుండానే తన తండ్రి ఆరంభించిన పూర్తిగా పూలతోటల పెంపకాన్ని చేపట్టాడు. తరువాత కొన్ని సంవత్సరాల సమయంలో ఎడ్విన్ ఫ్రాజీ పూలతోటల పెంపకంలో స్థిరపడ్డాడు. మెల్లిగా కుటుంబం ఈ తోటలను శ్రమించి శాంటా మార్గరిటా ర్యాంచ్ విస్తరింపజేసాడు.

 
ప్రస్తుతరాన్యూనిక్యులస్ పూలు

సాధారణంగా ఈ పూలు ఒంటిరెక్కవి (ఒక వరుస రెక్కలు). ఇవి పసుపు, ఎరుపు ఛాయను కలిగి ఉంటాయి. ఇప్పుడు చూస్తున్న వర్ణరంజితమైన నిండైన ఈ పూల తోటలు ఎడ్విన్ అనేక సంవత్సరాలుగా ఎన్నికచేసిన శైలితో రూపొందించిన కృషిఫలితమే. అనుకోకుండా ప్రకృతి అందించే కొత్త వర్ణాల కలయికతో పూచే పూల విత్తనాలను అతి జాగరూకతగా సేకరించి మరుసటి సంవత్సరం వాటిని ఉత్పత్తి చేయసాగాడు. ఫలితంగా అనేక వర్ణమిశ్రితమైన పూలమొక్కలు లభ్యం అయ్యాయి. ప్రస్తుతం 13 వర్ణాల పూల ఉతపత్తిని సాధించాడు. ప్రస్తుతం పికోటీ పూలను కూడా ఉత్పత్తి చేస్తున్నాడు.

1950 నాటికి ఎడ్విన్ తిరుగులేని కృషి ఫలితంగా అనేక వర్ణాలు, మిశ్రిత వర్ణాలు, పలు వరసలుగా పూరేకులు కలుగిన పుస్పాలను ఉత్పత్తి చేసి రాన్యూనిక్యులస్ బల్బ్స్ పూల ఉత్పత్తిలో సహపోటీదారులలో ప్రథమంగా నిలిచాడు. ఎడ్విన్ కృషికి ప్రభావితులైన పోటీదారులు పోటీ నుండి వైదొలగి అమెరికాలోనే ఏకైక రాన్యూనిక్యులస్ పూల ఉతత్తిదారునిగా నిలిపారు. ఇది కాక ఫ్రాజీ గ్రాడియోలస్ పూల ఉత్పత్తిని కూడా శాంటా మార్ఘరిటా ర్యాంచ్ వాణిజ్యపరంగా ఉత్పత్తి చేసి ఈ ఉత్పత్తిలో కూడా ఉన్నత స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం పాత 101 రహదారి గుండా ప్రయాణించే పర్యాటకులకు ఇది ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

పెరిగిన ప్రాబల్యం

మార్చు
 
గ్రాడియోలస్ పూలు
 
బొకేలను తయారు చేయడానికి సహకరిస్తున్న పర్యాటకుడు

నిశ్చయంగా రాన్యూనిక్యులస్ మొక్కలు పెరగడానికి తేలికైన వాతావరణం, తడిలేని ఇసుక నేలలు అత్యవసరం. రాన్యూనిక్యులస్ తోటలు కార్ల్స్‌బాడ్ పోంటో ప్రదేశానికి దక్షిణంగా విస్తరించాడు. 101 రహదారి పక్కన సముద్రతీరం సమీపంలో ఉండి లాస్ ఏంజలెస్, శాన్ డియాగోల మధ్య ప్రయాణించే అనేక మోటర్ వాహనాల రద్దీలో కూడా చెరగని అందంతో వర్ణరంజితమైన పూలను అందిస్తూ ఉంది. సమానమైన సౌందర్యం కలిగి గ్రాడియోలస్ పూల ప్రకాశవంతమైన వర్ణాలతో జతకట్టిన రాన్యూనిక్యులస్ పూతోటలు అనధికారకమఇన పర్యాటక ఆకర్షణ్గా త్వరగా వృద్ధిచెందింది. నేషనల్ గియోగ్రాఫిక్ మ్యాగజిన్ వారి ఛాయాగ్రాహకుల కుతూహలమైన దృష్టిని కూడా అకర్షించాయి ఎడ్వి పూలతోటలు. ఫ్రాజీ ఆయన పనివారు కూడా తమ సమయమును అధికంగా పర్యాటకుల కొరకు వెచ్చించక తప్పదని గ్రహించారు. మర్యాదగా అయినా దృఢమైన కోరికతో వెల్లువలా వచ్చే పర్యటకులలో కొంత మంది ఉచితంగా రాన్యూనిక్యులస్, గ్రాడియోలస్ పూల బొకేలను తయారు చేయడంలో సహకరిస్తుంటారు.

అవాంఛితమైన ఈ పర్యాటకుల వెల్లువ, ప్రాబల్యము నుండి ఈ తోటలను రక్షించడానికి ఎడ్విన్ ఆయన పనివారితో సహా అధికమైన సమయం వెచ్చించవలసి వచ్చేది. ఫ్రాజీ ఒకసారి " ఒక వేళ నేను ఈ తోటలకు తీసే ఛాయాచిత్రాలకు ఒక ఛాయాచిత్రానికి ఒక పెన్నీ వసూలు చేసినా నేను అత్యంఅ ధనికుడను అయ్యేవాడిని " అన్నాడు.

1993లో ఎడ్విన్ ఫ్రాజీ విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నాడు. గ్రోవర్ మెలనో అండ్ కంపెనీ తో సహకార ఒప్పందం కుదుర్చుకున్న పౌల్ ఎకీ జే ఆర్ ప్రపంచ ప్రజలకు ఆనందం కలిగించడానికి ఈ సుందర పూల తోటల అభివృద్ధి మీద దృష్టి సారించాడు. పౌల్ ఎకీ జే ఆర్రాన్యూనిక్యులస్ పూలతోటల అభివృద్ధికి బలమైన ఆర్థికప్రాతిపదిక కొరకు పర్యాటక రంగం మీద దృష్టి సారించాడు. ఫ్లవర్ ఫీల్డ్స్ ఎట్ కార్ల్స్ బాడ్ ర్యాంచ్ కి రూపకల్పన చేసి మనోహంగా మత్రముగ్ధులను చేసే ఈ పూలతోటల సంరక్షణ, అభివృద్ధికి కావలసిన వేదికను ఏర్పాటు చేసాడు.

ప్రత్యేక ఆకర్షణలు

మార్చు
 
కార్ల్స్‌బాడ్ ఫ్లవర్ ఫీల్డ్ కార్ పార్కింగ్
 
చారిత్రక పొయి‌న్‌సెట్టియా ప్రదర్శన

ప్రస్తుతం ఈ పూల తోటలు విస్తారమైన పార్కింగ్ సెంటర్, గిఫ్ట్ షాప్, ప్రత్యేక ఉత్సవాలు, సులభంగా చేరడానికి కావలసిన వసతులు, చారిత్రక సమాచారం అదించడం, పూలతోటలకు కావలసిన ఇతర ఉత్పత్తులు వంటి సేవలు అందిస్తూ సంవత్సరానికి 1,25,000 పర్యాటకులను ఆకర్షిస్తుంది. 1999లో పూలతోటల యాజమాన్యం ఆర్మ్‌స్ట్రాంగ్ గార్డేన్ సెంటర్ తో చిల్లర దుకాణాలను నిర్వహింఛే ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. ఈ ఒప్పదం కారణంగా వారికి తమ నిరంతర కృషికి ఫలితంగా లభించిన ఉత్తమ సాధనలను నిరూపించే అవకాశం లభించింది.

  • స్వీట్ మేజ్ :- స్వీట్‌పీ మేజ్ ఇది ఒక ఫజిల్ మాదిరి పెంచబడిన తోట చిన్న పిల్లలు ఉత్సాహవంతులైన పెద్దలు దీనిలో ప్రవేశించి అయోమయపడి వెలుపలికి రావడం ఒక అనుభూతి. పురాతన స్వీట్ పీ పుష్పించిన మొక్కలతో ఉన్న ఈ సజీవ ఫజిల్ సువాసనలు ఆఘ్రాణిస్తూ కుంటుంబంతో ఆడుకుని ఆనందించ వచ్చు.
  • ఏంటిక్యూ ట్రాక్టర్ వేగన్ రైడ్స్ :- పర్యాటకులు ప్రత్యేక రుసుము చెల్లించి తెరచిన వేగన్‌లో ఎక్కి పూలతోటలను సందర్శించ వచ్చు. 50 ఎకరాల విస్తీర్ణం ఉన్న ఈ తోటలను పూర్తిగా చూడాలంటే ఈ వేగన్ టూర్ ఉపయోగంగా ఉంటుంది. సందర్శన సమయములో గైడ్ వివరించే చరిత్రను వింటూ తోటలను చూడవచ్చు.
  • సింబిడియమ్ ఆర్చిడ్ గ్రీన్ హౌస్ :- ఇక్కడ సింబిడియమ్ ఆర్చిడ్ సందర్శనతో క్రయవిక్రయాలు జరుగుతుంటాయి. ఆర్మ్‌స్ట్రాంగ్ గార్డెన్ సెంటర్ లో ఇవి లభ్యం ఔతాయి.
  • ది ఆర్టిస్ట్ గార్డెన్ :- పూలతోటల అందాలను చిత్రించిన చిత్రాలను ఇక్కడ చూడ వచ్చు.
 
అమెరికన్ జెండాకు ఉపయోగించిన పెట్యునియా పూలు
  • అమెరికన్ ఫ్లాగ్ ఆఫ్ ఫ్లవర్స్ :- 300 అడుగుల వెడల్పు 170 అడుగుల ఎత్తు కలిగిన ప్రదేశంలో ఏటవాలు ప్రదేశంలో అమెరికా ప్రభుత్వాన్ని గౌరవిస్తూ అందమైన పెట్యునియా పూల మొక్కలతో వ్యూహాత్మకంగా పెంచిన అమెరికన్ జెండా.
  • సాంటాస్ ప్లే గ్రౌండ్ :- చిన్న పిల్లల నుండి పెద్దలు సహితంాడుకునే ఈ ప్లే హౌస్ లోపల గార్డ్ షార్క్, డాల్ హౌస్, క్రూక్డ్ ట్రీ హౌస్, చాలా మంది చిన్న వయసు జ్ఞాపకాలలో దాగి ఉన్న అనేక వర్ణాల పుట్టగొడుగులను చూడవచ్చు.
  • కార్ల్స్‌బాడ్ మైనింగ్ కంపెని :- పురాతన పద్ధతులలో సిఫ్టింగ్ శాండ్, నీటితో మెరుగు పెట్టే విధానాన్ని ఇక్కడ చూడ వచ్చు.
  • చారిత్రక పొయి‌న్‌సెట్టియా ప్రదర్శన :- స్ట్రోల్ త్రూ మెమరీ లేన్ ద్వారా 1,500 చదరపు అడుగుల గ్రీన్‌హౌస్ లోపల 20 కంటే అధికంగా ఉన్న ప్రపంచ ప్రసిద్ధమైన అసాధారణమఇన ఎకే పొయి‌న్‌సెట్టియా జాతి పూల మొక్కలను చూడవచ్చు.

స్కూలు పిల్లల ప్రత్యేక కార్యక్రమాము

మార్చు
  • ది ఫ్లవర్ ఫీల్డ్స్ పూల తోటల పెంపకాన్ని గురించిన నాణ్యమైన వ్యవసాయ సంబంధిత విద్యను తరగతి గదుల వద్ద లేక ఫ్లవర్ ఫీల్డ్ వద్ద కాని అందించడానికి కావలసిన ఏర్పాట్లు చేస్తుంది. ప్రి స్కూలు నుండి 2 గ్రేడ్ విద్యార్థులకు విత్తనాలను సరఫరా చేసి బల్బ్ ను పెంచే విధానము గురించిన శిక్షణా తరగతులను మూడు రకముల ప్రణాళికలతో నిర్వహిస్తుంది. వీటి కొరకు విద్యార్థులు ప్లాను అనుసరించి రుసుము చెల్లించ వలసి ఉంటుంది.
  • ప్లాన్ ఎ :- ప్రీ స్కూలు నుండి 2వ గ్రేడు వరకు ఉన్న విద్యార్థులకు వారి వారి క్లాసులలో తరగతులను నిర్వహిస్తారు. ఈ తరగతిలో పిలాలకు ఒక్కొక్కరికి ఒక పూల కుండీ, కొంత మట్టి, 'పొద్దు తిరుగుడు లేక రాన్యూనిక్యులస్ విత్తనాలను ఇచ్చి కుండీలలో పిల్లచ చేత విత్తనాలను నాటిస్తారు. పిల్లలు వాటిని ఇంటికి తీసుకు పోయి పెంచ వచ్చు లేకున్న స్కూలు పూలతోటలో ఉంచవచ్చు. అలాగే పిల్లల ఇష్టానుసారం ఫీల్డ్ వద్దకు వెళ్ళి ఫీల్డ్ లోపల శిక్షణా తరగతులలో పాల్గొన వచ్చు. ఈ తరగతులలో పాల్గొనడానికి విద్యార్థులకు 4 సంవత్సరాల పైబడి ఉండాలి. ఈ తరగతులు సెప్టెంబ నుండి ఫిబ్రవరి వరకు జరుగుతాయి.
  • ప్లాన్ బి :- ప్లాన్ బి తరహా విధానంలో తరగతులలో నిర్వహించే కార్యక్రమాలే కాక ఫీల్డ్ లోపల ఎరువుల తయారీ, సంగీతం, హస్థకళలు, గైడు వేగన్ ద్వారా ప్రయాణిస్తూ పూలతోటలను గురించిన విశేషాలను వివరించడం.
  • ప్లాన్ సి :- పరిశోధనాత్మక రగతులను 3-5 గ్రేడ్ విద్యార్థులకు నిర్వహిస్తుంది. పరిశోధనత్మ తరగతులను నేరుగా ఫ్లవర్ ఫీల్డ్ వద్ద నిర్వహిస్తారు. విద్యార్థులకు పూలను మొక్కలను చూపుతూ వాటిని గురించిన వివరణాత్మక విషాయాలను తెలుపుతూ ఈ తరగతులను నిర్వహిస్తారు. ఈ తరగతులలో విద్యార్థులు ఫీల్డ్ లోపల ఫీల్డ్ టీచర్ పర్యవేక్షణలో పొద్దుతిరుగుడు మొక్కలను నాటిస్తారు. ఈ తరగతులు మార్చి 15 నుండి ఏప్రిల్ 30 వరకు జరుగుతాయి. ఈ తరగతులకు విద్యార్థులు ఉదయం 9 గంటలకు ఫీల్డ్‌కు చేరుకోవాలి 12.30 గంటలకు సంగీతం, హస్థకళా శిక్షణా తరగతులు జరుగుతాయి.

గ్రూప్ టూర్స్

మార్చు

పర్యాటకులు బృందాలుగా ఈ పూలతోటలను సందర్శించ వచ్చు. బృందాలుగా పర్యటించ్డానికి రుసుము కొంచం తక్కువగా ఉంటుంది. ఒక బృమ్డానికి 20 మందికి పైగా ఉండాలి.

  • సెల్ఫ్ గైడెడ్ టూర్ :- స్వయంగా గైడ్ సహాయం లేకుండా ఈ పూలతోటలను కాలి నడకన సణందర్శించ వాచ్చు.
  • సెల్ఫ్ గైడేడ్ వేగన్ టూర్ :- బంధాలు గైడ్ లేకుండా వేగన్‌లో పూలతోటలను సందర్శించ వచ్చు. ఆడియో ద్వారా పూలతోటల చరిత్రను వినవచ్చు.
  • గ్రూఫ్ గైడేడ్ టూర్ వేగన్:- బృందాలతో గైడు తోడుగా పూల తోటల గురించి వివరిస్తాడు. ఈ టూర్ సమయం 15-20 నిమిషాలు.
  • గ్రూఫ్ గైడేడ్ టూర్ :- బంధాలతో గైడ్ పూలతోటల గురించి వివరిస్తాడు. ఈ టూరుకు 40-50 నిమిషాల సమయం పడుతుంది.

పర్యటనలో భాగాలు

మార్చు
  • పూలతోటల చరిత్ర.
  • పూలముక్కలను నాడడం పెంచడం గురించిన విషయాలు.
  • వివిధరకాల మొక్కల గురించిన వివరణ.
  • ఏటవాలు ప్రదేశంలో నడవడం.
  • విశ్రాంతిగా కూర్చుని పూలతోటలు సముద్రాన్ని దర్శించడం.
  • ఆర్మ్‌స్ట్రాంగ్ గార్డేన్ సెంటర్లో బహుమతులను కొనడం.

ప్రత్యేక కార్యక్రమాలు

మార్చు
  • వన్ అపాన్ ఎ టైమ్ (పూలతోటలలో ఒక సారి). దీనిలో పాల్గొనే వారు వారాంతాలలో రెండు రోజుల వారి వస్తువులను విక్రయించ వచ్చు.
  • కిడ్స్ డే :- దీనిలో తల్లి తండ్ర్ల వెంట వచ్చే పిల్లలకు రోజంతా ఉత్సాహభరితమైన కార్యక్రమాలు విర్వహిస్తారు. కళలు, హస్థకళలు, ఫేస్ పైంటింగ్ (ముఖం మీద బొమ్మలు చిత్రించడం, సంగీత కార్యక్రమాలు, స్వీట్ మేజ్, శాంటాస్ ప్లేగ్రౌండులో ఆటలు.
  • స్ట్రాబెర్రీ, ఫ్లవర్ ఫీల్డ్స్ ఫరెవర్ :- స్వల్పకాలిక వస్తువిక్రయంలో పాల్గొనడం.
  • ఈస్టర్ సందర్భంలో ఫీల్డ్స్ చర్చ్ ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో వచ్చని సూర్యోదయ సమయంలో సంగీత కార్యక్రమాలు వినడం. అలాగే ముందుగా వచ్చే 500 మందికి ఉచితంగా స్వల్పాహార విందు ఏర్పాటు చేస్తారు. పూలతోటల అందాలను ఆస్వాదిస్తూ ఈ కార్యక్రమాలలో పాల్గొనవచ్చు.
  • బ్లూ గ్రాస్ డే :- సమ్మర్ గ్రాస్ శాన్ డియాగో అందిస్తున్న ఈ కన్‌సర్ట్ అనే పాత తరహా సంగీతకార్యక్రమంలో బ్లూ గ్రాస్ బృందం అందించే సంగీతాన్ని ఆస్వాదిస్తూ కుంటుంబంతో పూలతోటలను సందర్శించ వచ్చు.
  • రెడ్ హట్టర్స్ రెండిజ్‌వస్ :- రెడ్ హట్టర్స్ రెండిజ్‌వస్ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి.
  • ఆర్ట్స్ అండ్ క్రాహ్ట్స్ ఫెయిర్:- కళాఖండాలు, వర్ణచిత్రాల ప్రదర్శనా విక్రయం. సంగీతం, శాండియాగోలో పండించిన స్ట్రాబెర్రీల విక్రయం వంటి విక్రయం ఉంటాయి.
  • గ్బూల్ డే :- గ్రేట్ బ్లూస్ అందించే సంగీతం కార్యక్రమాలు ఉంటాయి. వీటితో చిన్న తరహా వారాంతపు విక్రయాల వంటి కార్యక్రమాలు ఉంటాయి.
  • ఫొటో గ్రఫీ వర్క్ షాప్ విత్ కెనాన్ :- వారాంతపు ఫ్లవర్ ఫీల్డ్ ఛాయాచిత్ర విక్రయాలలో పాల్గొనడం.
  • బోన్ సాయి షో అండ్ సేల్ :- బోన్ సాయి చెట్ల విక్రయం, ప్రదర్శన.
  • మదర్స్‌డే సెలెబ్రీషన్ :- మదర్స్ డే సెలెబ్రేషన్‌లో పాల్గొని తాల్లులకు బొకేను తయ్యరు చేయడం వంటి కార్యక్రమాలు ఉంటాయి.

పర్యాటకులకు సమాచారం

మార్చు
  • పూలతోటలను సందర్శించడానికి కావలసిన టిక్కెట్లను ఇంటర్‌నెట్‌లో, నేరుగా కూడా పొందవచ్చు.
  • గ్రూపులుగా కూడా సందర్శించ వాచ్చు. అందుకు ముండుగా రిజర్వ్ చేయించుకోవాలి.
  • ఊరిలో ఉండి నిదానంగా వారాంతాలు ప్రశాంతంగా సందర్శించాలనుకునే ఇక్కడ గడపడానికి కావలసిన వసతూలు కలిగిన గ్రాండు పసిఫిక్ పాలిసేడ్స్ రిసార్ట్, షెరటాన్ కార్ల్స్‌బాడ్, కార్ల్స్‌బాడ్ ఇన్ అనే వసతి గృహాలౌ ఉన్నాయి.

చిత్రమాలిక

మార్చు

వెలుపలి లింకులు

మార్చు