కార్ల్ బీల్

న్యూజిలాండ్ క్రికెట్ ఆటగాడు

కార్ల్ ఎర్నెస్ట్ బీల్ (1887, జూలై 12 - 1916, ఆగస్టు 16) ఆస్ట్రేలియాలో జన్మించిన న్యూజిలాండ్ క్రికెట్ ఆటగాడు. అతను 1906 - 1915 మధ్యకాలంలో ఒటాగో, కాంటర్‌బరీ కొరకు ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో 12 మ్యాచ్‌లు ఆడాడు.[1][2]

కార్ల్ బీల్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
కార్ల్ ఎర్నెస్ట్ బీల్
పుట్టిన తేదీ(1887-07-12)1887 జూలై 12
లాన్సెస్టన్, టాస్మానియా, ఆస్ట్రేలియా
మరణించిన తేదీ1916 ఆగస్టు 16(1916-08-16) (వయసు 29)
మెల్‌బోర్న్, విక్టోరియా, ఆస్ట్రేలియా
బంధువులువిలియం బీల్ (సోదరుడు)
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1906/07–1908/09Otago
1913/14–1914/15Canterbury
కెరీర్ గణాంకాలు
పోటీ First-class
మ్యాచ్‌లు 12
చేసిన పరుగులు 436
బ్యాటింగు సగటు 24.22
100లు/50లు 1/1
అత్యుత్తమ స్కోరు 105
వేసిన బంతులు 180
వికెట్లు 3
బౌలింగు సగటు 37.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 2/16
క్యాచ్‌లు/స్టంపింగులు 7/–
మూలం: Cricinfo, 2022 24 March

1914 జనవరిలో, ప్లంకెట్ షీల్డ్‌లో వెల్లింగ్‌టన్‌పై కాంటర్‌బరీ తరఫున బీల్ 105 పరుగులు చేశాడు, 110 నిమిషాల్లో తన సెంచరీని చేరుకున్నాడు. 1915 జనవరిలో అతను ఈస్ట్ క్రైస్ట్‌చర్చ్ తరపున ఆడుతూ 242 పరుగులు చేశాడు, ఇది క్రైస్ట్‌చర్చ్ క్లబ్ పోటీలో రికార్డ్ స్కోరు.[3] కొంతకాలం తర్వాత అతను క్షయవ్యాధితో బాధపడటం ప్రారంభించాడు. అతను తన భార్యతో కలిసి మెల్బోర్న్కు తిరిగి వచ్చాడు. అతను 1916 ఆగస్టులో 29వ ఏట మెల్బోర్న్‌లో మరణించాడు.[1]

బీల్ సోదరుడు విలియం కూడా ఒటాగో తరపున ఆడాడు. న్యూజిలాండ్‌లోని ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లకు అంపైర్‌గా ఉన్నాడు.[4]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "Carl Beal". ESPN Cricinfo. Retrieved 5 May 2016.
  2. "Carl Beal". CricketArchive. Retrieved 5 May 2016.
  3. "Cricket". Otago Witness. No. 3176. 27 January 1915. p. 51.
  4. William Beal, CricketArchive. Retrieved 3 January 2022. (subscription required)

బాహ్య లింకులు

మార్చు