కార్ల్ రైమండ్ పాపర్

సర్ కార్ల్ రైమండ్ పాపర్ (Sir Karl Raimund Popper) వియన్నాకి చెందిన తత్వవేత్త, సామాజిక వేత్త.

Western philosophy
20th-century philosophy
కార్ల్ పాపర్
పేరు: కార్ల్ రైమండ్ పాపర్
జననం: 1902-7-28
మరణం: 1994-9-17
సిద్ధాంతం / సంప్రదాయం: * Analytic philosophy

జీవిత విశేషాలు

మార్చు

పాపర్ 1902 సంవత్సరం జూలై 28వ తేదీన వియన్నా నగరంలో జన్మించాడు. వియన్నా నగరాన్ని ఆరోజుల్లో ఐరోపా ఖండపు మేధావుల రాజధాని అనేవారు. సంగీతజ్ఞులు, వైద్యులు, ఆర్థికవేత్తలు మొదలగు మేధావి వర్దానికి అది ఒక కూడలి. పాపర్ లండను విశ్వ విద్యాలయములో 1941-69 మధ్య ఆచార్యుడిగా ఉండేవాడు. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, జెంట్జార్జి లవలె పాపర్ కు సంగీతంలోనూ శాస్త్రాలలోనూ అభినివేశం ఉంది. శాస్త్రాల హణితత్వం పై మౌలిక చింతన చేసేడు. విమర్సనాత్మక హేతువాదం (Critical rationalism) నూ, శాస్త్రనిగమంలో, అసత్యీకరణ (Falsifiability) సాధనాన్ని ప్రతిపాదించాడు. 92 సంవత్సరాల వయస్సులో క్యాంసర్ వ్యాధితో పాపర్ లండన్ లో మరణించాడు.

పాపరు ముఖ్య ప్రతిపాదనలు-విమర్సలు

మార్చు
  • కళ కళకోసమే అనే అపార్దం ఇచ్చేనానుడికి పాపరిట్లా అర్దం చెబుతాడు. కళాకృతికోసమే కళ అంటాడు.శాస్త్రీయరంగంలోనూ ఇంతే.
  • శాస్త్రకళల ఉత్పత్తి స్థితుల గురుంచి పాపర్ మూడు ప్రతిపాదనలు చేసాడు. ఒకటి:శాస్త్రములు Myth నుంచి హేతువాద పూర్వక విమర్సద్వారా పుడుతుంది అంటాడు. రెండు: విమర్స రెండురకాలు అంటాడు: ఒకటి అలంకారశాస్త్ర, సాహిత్యాంశాలచే ప్రేరేపితం, రెండవది హేతువాదంచే ప్రేరేపించబడింది. ఇక మూడవది: కవిత్వంలోనూ, శాస్త్రంలోనూ Myth ల అవశేషాలున్నాయి అనునది.
  • ఈ మిత్ లు మనం ప్రపంచాన్ని అర్ధంచేసుకోవటానికి ఉప్యోగపడే అమాయక పరికల్పనలే అంటాడు.
  • కళకు, శాస్త్రానికి ఒకేమూలం ఉన్నా, వాటిమధ్య ముఖ్య భేదాలున్నాయి. శాస్త్రంలో ప్రగతి ఉంటుంది. దానికొక ఆశయం ఉంటుంది.శాస్త్రధ్యేయం సత్యానికెంత దగ్గరగా పోవచ్చుననేది శాస్త్ర ఆశయం. కళలో అభివృద్ధి అంటూ ఉండకపోవచ్చును. చాలాకాలం ప్రకృత్యానుకరణ కళా ధ్యేయంగా ఉంటూ ఉండేది.
  • లలిత కళల రచనలలో ఇమిడి ఉన్న వివిధ దశలను పాపరు వర్ణిస్తాడు. ఉదాహరణకి: సంగీత రచన జంత్ర సమ్మేళనంగా (Sonata) ఉండవలననే నిర్ణయం, దానికి వస్తు నిర్దేశం చేయడం తర్వాత దానిని కాగితం మీదకి ఇక్కించటం. కాని వ్రాయడం మొదలుపెట్టినంతనే అసలు ప్రణాలికే మారిపోవచ్చును. కళాకారుని మనస్సులో స్వవిమర్స, దోషపరిహరణ అనేవి మెదులుతూ ఉండటమే దీనికి కారణం అంటాడు పాపర్. చిత్రకళలోనూ ఇంతేనట.
  • కళలలో సృజనాత్మక విమర్స ప్రాముఖ్యం వహించగా, శాస్త్రాలలో సహకార విమర్స ముఖ్యపాత్ర వహిస్తుందంటాడు. కళలోనూ, శాస్త్రంలోనూ సహకార విమర్స అభివృద్ధికి తోడ్పడుతుంది.
  • గ్రహాల చలనంలో కూడా సంగీతం ఉంది అవి బృందంగానం వలే ఉంటుంది అంటాడు.ఈ సంగీతం భగవంతునికి ప్రతిధ్వనియట.

మూలములు

మార్చు
  • 1980 భారతి మాస పత్రిక-వ్యాసము:శాస్త్ర, కళలలో సృజనాత్మక విమర్స పోపర్ భావములు. వ్యాసకర్త: శ్రీ సర్దేశాయి తిరుమలరావు.