సాధారణంగా చొక్కాకి గొంతు చుట్టూ సందర్భానుసారము టై గానీ బౌ టై గానీ కట్టుకునే వీలు ఉండే భాగాన్ని కాలరు అంటారు. పూర్వం కాలరు గల షర్టులని సాంప్రదాయికాలుగా వాడగా, ల్యాపెల్ గల షర్టులని అసాంప్రదాయికాలుగా వాడేవారు. ప్రస్తుతం టీ-షర్టుల వాడకం పెరగటంతో ల్యాపెల్ గల షర్టుల వాడకం తగ్గినది. (టీ-షర్టులకి ఉండే కాలర్ కూడా ఒక రకమైన ల్యాపెల్ యే). అసాంప్రదాయికంగానూ వినియోగించవచ్చిననూ, కాలరు హుందాతనానికి చిహ్నం. కొన్ని సంస్థలలో కాలరు లేని షర్టులు నిషిద్ధం.

ఒక ఆరో కాలర్ల ప్రకటన. ఇందులో వివిధ రకాల కాలర్లను చూడవచ్చును

ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేష్ టర్న్‌డ్ అప్ కాలర్ (కాలర్ ని క్రిందకి మడచకుండా పైకే నిలబెట్టే శైలి) లో అప్పుడప్పుడూ కనబడతారు.

డిటాచబుల్, అటాచ్డ్ కాలర్ల మధ్య వ్యత్యాసం

మార్చు

కాలరు షర్టుకే కుట్టవచ్చును (అటాచ్డ్). లేదా తీసివేసే విధంగా డిటాచబుల్ కాలరుగా కూడా రూపొందించవచ్చును. ఒకప్పుడు డిటాచబుల్ (కావలసిన చొక్కాకి కావలసిన) కాలర్లు వాడేవారు. ప్రముఖ ఆరో సంస్థ మొదట ఈ డిటాచబులు కాలర్ల తయారీ రంగంలోనే పేరొందినది. ఇప్పుడు డిటాచబుల్ కాలర్లు ఎవరూ వాడుట లేదు. డిటాచబుల్ కాలర్ లకి ఉపయోగించే కాలర్ స్టడ్ (ముందు ఒకటి, వెనుక ఒకటి) లలో ముందుది కాలర్ బొత్తాగా పని చేయటం వలన డిటాచబుల్ కాలర్ లు ఎప్పుడూ మూసి ఉంచాలి. అయితే ఒకే షర్టుకి సందర్భానుసారం కావలసిన కాలర్ అమర్చుకొనే సౌలభ్యం ఇందులో ఉంది. షర్టుకే కుట్టిన (ఆటాచ్డ్) కాలర్ లో కావలసినప్పుడు మూసి ఉంచటం ఇతర సమయాలలో తెరచి ఉంచే స్వేచ్ఛ ఉంది. కానీ ఒకసారి కుట్టిన కాలర్ ను మరల మరల మార్చుకొనే సౌలభ్యం లేదు.

చిత్రమాలిక

మార్చు

వివిధ రకాల కాలర్లు

మార్చు

వివిధ రకాల కాలర్ల చిత్రాలు

మార్చు

కాలరు ఎంపిక

మార్చు
  • ప్రాథమికంగా కాలరు టై నాట్ విధానం (పెద్ద నాట్ ల కైతే ఎక్కువగా తెరచుకొని ఉన్న కాలరు, చిన్న నాట్ ల కైతే తక్కువగ తెరచుకొని ఉన్న కాలరు) బట్టి ఉన్ననూ, సందర్భం,వాతావరణం కూడా ఏ రకమైన కాలరు వాడాలో నిర్దేశిస్తాయి.
  • ముఖం యొక్క ఆకారాన్ని బట్టి కూడా కాలరుని ధరించివలసి ఉంటుంది. గుండ్రంగా లేదా వెడల్పు ముఖం గల వారు పొడవాటి, పాయింటెడ్ కాలర్లు (ముఖం వెడల్పు తక్కువగా కనిపించటానికి), పొడవైన లేదా కోల ముఖం ఉన్నవారు చిన్న, పొట్టి లేదా రౌండెడ్ కాలర్లు ధరించాలి (ముఖం పొడవు తక్కువగా కనిపించటానికి).

షర్టుకి వేసే వివిధ రకాల ల్యాపెల్ లు

మార్చు
  • క్యాంప్ కాలర్
  • జానీ కాలర్
  • టెన్నిస్ కాలర్ (టీ-షర్టు లకి వాడే కాలరు)
  • రివేర్ కాలర్

చిత్రమాలిక

మార్చు

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=కాలరు&oldid=4230720" నుండి వెలికితీశారు