పొడవు లేదా పొడుగు (ఆంగ్లం Length) ఒక కొలమానము. ఇది సామాన్యంగా దూరాన్ని కొలిచేది.

A cuboid demonstrating the dimensions length, width, and height

భాషా విశేషాలు సవరించు

తెలుగు భాషలో పొడుగు అనే పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.[1] పొడుగు లేదా పొడవు అనగా Height, length, stature, ఎత్తు. విశేషణంగా వాడినపుడు ఉదా సంవత్సరము పొడుగున throughout the year. అర్థం వస్తుంది. High, tall, long, lofty. High, as price. v. n. To grow tall, increase, extend, ఉన్నతమగు, వర్ధిల్లు. బియ్యము వెల పొడిగినది the price of rice has risen. పొడుగాటి or పొడుగుపాటి Long, tall. పొడవడగు (పొడవు+అడగు.) క్రియా ప్రదంగా v. n. To be spoilt, చెడు. To die, చచ్చు. పొడవడచు To spoil, చెరుచు. To kill, చంపు అని అర్థం. పొడవు ఆకారంలో Shape, form రూపు. పొడగించు To lengthen, heighten, raise, increase, exalt. To aggravate. swell. To promote in rank. పొడుగుచేయు. ఎక్కువచేయు అని అర్థం. పొడుగుమడుగు అనగా ఆకాశగంగ.

కొలమానం సవరించు

భౌతిక శాస్త్రంలో పొడుగు ప్రమాణాలు దూరమానంలో దూరం ఒకటే. ఇవి మన శరీర భాగాల పొడవు కొలవడంలోను, ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ప్రయాణించిన దూరాన్ని కొలవడానికి, భూమిమీద రెండు ప్రాంతాల మధ్య దూరాన్ని లేదా వివిధ వస్తువుల పొడవును కొలవడానికి ఉపయోగిస్తారు.

గణితంలో ఎత్తు, పొడవు, వెడల్పులు మూడు డైమెన్షన్స్. వీటిని కొలిచేటప్పుడు, ఎత్తు లేదా లోతు 90 డిగ్రీల కోణం యొక్క పై, క్రింది భాగాలుగా తీసుకోవాలి.

అంతర్జాతీయ కొలమానాల ప్రకారం పొడవుకు ప్రమాణం మీటరు. సెంటీమీటరు, కిలోమీటరు దీనినుండి వచ్చినవే. ఇంపీరియల్ కొలమానం ప్రకారం పొడవుకు ప్రమాణాలు అంగుళం, అడుగు, గజం, మైలు.

లఘులోలకం యొక్క పొడవు సవరించు

ఆధార బిందువు నుండి లోలకంలో గోళం యొక్క గురుత్వ కేంద్రం వరకు గల దూరాన్ని లఘులోలకం పొడవు అంటారు.

మూలాలు సవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=పొడవు&oldid=3961257" నుండి వెలికితీశారు