శ్రీకాళహస్తి మహాత్మ్యము

ధూర్జటి రచించిన తెలుగు ప్రబంధం.
(కాళహస్తి మహత్యం నుండి దారిమార్పు చెందింది)

శ్రీకాళహస్తి మహాత్మ్యం ధూర్జటి రచించిన తెలుగు ప్రబంధం. ఇందులో నాలుగాశ్వాసాలున్నాయి. శ్రీకాళహస్తి క్షేత్ర మహాత్మ్యాన్ని తెలియజేసే కావ్యమిది. ఇందులో శివభక్తులైన చెలది, నాగుబాము, ఏనుగు, తిన్నని కథలున్నాయి.[1]

ప్రచురణ చరిత్ర

మార్చు

వ్రాతప్రతిగా ఉన్న కాళహస్తి మహాత్మ్యాన్ని ప్రచురణలోకి తెచ్చే సంకల్పంతో కృషిచేసిన వ్యక్తి కొత్తపల్లి వెంకట పద్మనాభశాస్త్రి. అతను ఎంతో కృషిచేసి తయారుచేసిన ప్రతి, దోషభూయిష్టముగా ఉండడంతో మరలా రెండవ ముద్రణను సరిగా వేయించే ప్రయత్నంలో కృషిచేస్తుండగా మృతిచెందాడు. ఆ మిగిలిన పనిని పద్మనాభ శాస్త్రి భార్య అన్నపూర్ణమ్మ కోరిక మేరకు వావిలికొలను సుబ్బారావు చేసి ప్రచురించాడు.[2]

మూలాలు

మార్చు
  1. ధూర్జటి (1914). శ్రీకాళహస్తి మహాత్మ్యము.
  2. శ్రీకాళహస్తి మహాత్మ్యము:ధూర్జటి:1914 కృతి ముందుమాటల్లో