యాంత్రిక మార్గాల ద్వారా కాగితంపై పదాలను, చిత్రాలను ఉంచడాన్ని ముద్రణ అంటారు. పుస్తకాలు, వార్తాపత్రికలు ముద్రణ ద్వారా తయారు చేస్తారు. సాధారణంగా ఈ చిత్రాలు సిరా ద్వారా ఏర్పడతాయి. ముద్రణ యంత్రాలు అని పిలవబడే యంత్రాల ద్వారా కాగితంపై ఈ సిరాను ఉంచుతారు.

ప్రపంచాన్ని మార్చిన పలు టెక్నాలజీలలో ముద్రణ ఒకటి. ఇది అందరికి అందుబాటులో ఉండేలా ప్రతులను తయారు చేయగలదు. కాబట్టి ఇది బహుళ రచనలకు సమర్థవంతమైన మార్గం. కాబట్టి యాంత్రిక మార్గాల ద్వారా వ్రాయడం యొక్క కొనసాగింపుగా ముద్రణ ఉంది.

చరిత్ర

మార్చు

ప్రజలు శాశ్వత నివాసాలలో స్థిరపడిన తరువాత రాయడం ప్రారంభమయింది. ఇది 5000 సంవత్సరాల క్రితం క్రీ.పూ 3,300 నుండి ఆరంభమయ్యింది. కాగితం కనుగొనక ముందే రచనా వ్యవస్థల యొక్క వివిధ రకాలు కనుగొనబడ్డాయి. బంకమట్టి, పాపిరస్, చె

క్క, పలక, చర్మపత్రం వంటివి అన్ని

ఉపయోగించారు. చైనీయులు కాగితం కనుగొనడంతో మరో అడుగు ముందుకు పడింది. ముద్రనా యంత్రన్ని కనుక్కొన్నది "జొహ్న్ గుటన్ బుర్గ్" అలాగే మొదట ముద్రించిన పుస్తకం పవిత్ర గ్రంథమైన "బైబిల్"

ప్రారంభ ముద్రణ

మార్చు

8వ శతాబ్దంలో చైనా, కొరియాలలో మొదటి ముద్రణ ప్రారంభమయినట్లు తెలుస్తుంది. మొత్తం పేజీలకు చెక్కబడిన చదునైన చెక్క బ్లాక్స్ ఉపయోగించబడ్డాయి. కార్బన్ ఆధారిత సిరాతో కప్పబడిన వీటిని కాగితం షీట్లపై ఉంచి ఒత్తిడి చేస్తారు.

చిత్రమాలిక

మార్చు

ఇవి కూడా చూడండి

మార్చు

ముద్రణ యంత్రం

మూలాలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=ముద్రణ&oldid=3898340" నుండి వెలికితీశారు