శ్రీకాళహస్తి మహాత్మ్యము

(కాళహస్తీశ్వర మాహాత్మ్యం నుండి దారిమార్పు చెందింది)

శ్రీకాళహస్తి మహాత్మ్యము ధూర్జటి రచించిన తెలుగు ప్రబంధం. ఇందులో నాలుగాశ్వాసాలున్నాయి. శ్రీకాళహస్తి క్షేత్ర మహాత్మ్యాన్ని తెలియజేసే కావ్యమిది. ఇందులో శివభక్తులైన చెలది, నాగుబాము, ఏనుగు, తిన్నని కథలున్నాయి.[1]

ప్రచురణ చరిత్రసవరించు

వ్రాతప్రతిగా ఉన్న కాళహస్తి మహాత్మ్యాన్ని ప్రచురణలోకి తెచ్చే సంకల్పంతో కృషిచేసిన వారు కొత్తపల్లి వెంకట పద్మనాభశాస్త్రి. ఆయన ఎంతో కృషిచేసి తయారుచేసిన ప్రతి దోషభూయిష్టముగా ఉండడంతో మరలా రెండవ ముద్రణను సరిగా వేయించే ప్రయత్నంలో కృషిచేస్తుండగా మృతిచెందారు. ఆ మిగిలిన పనిని పద్మనాభ శాస్త్రి భార్య అన్నపూర్ణమ్మ కోరిక మేరకు వావిలికొలను సుబ్బారావు చేసి ప్రచురించారు.[2]

మూలాలుసవరించు

  1. ధూర్జటి (1914). శ్రీకాళహస్తి మహాత్మ్యము.
  2. శ్రీకాళహస్తి మహాత్మ్యము:ధూర్జటి:1914 కృతి ముందుమాటల్లో