కాలు
(కాళ్ళు నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
కాలు (leg) అనేది మనుష్యుల, జంతువుల శరీరాలలో నడవడానికి, శరీర భారాన్ని నేలపై నిలపడానికి ఉపయోగపడే అవయవం. ఇవి స్తంభాకారంలో ఉంటాయి. కాళ్ళలోని కీళ్ళు ఈ కదలికలు సులభంగా జరగడానికి అనువుగా అమర్చబడి ఉంటాయి. కాలియొక్క చివరిభాగం పరిణామ క్రమంలో అభివృద్ధి చెంది శరీరపు భారాన్ని సుళువుగా మోయగలిగేటట్లు మార్పుచెందాయి. ఎక్కువ జంతుజాలాలలో కాళ్ళు జతలుగా ఉండి శరీరాన్ని సమతుల్యంగా ఉంచడానికి సహాయపడతాయి.
నామకరణం
మార్చు- ఏకపాదులు: 1 కాలు
- ద్విపాదులు: 2 కాళ్లు
- త్రిపాదులు: 3 కాళ్లు
- చతుష్పాదులు: 4 కాళ్లు
- ఆర్థ్రోపోడా: 4, 6 (కీటకాలు), 8, 12, or 14
- శతపాదులు: 20 నుండి 300 కాళ్లు.
- సహస్రపాదులు: 750 వరకు కాళ్లు.
చతుష్పాదుల కాళ్లు
మార్చుచతుష్పాదులు లేదా నాలుగుకాళ్ల జంతువులలో కాలు అనగా మొత్తం తొడ నుండి పాదం వరకు కాలు భాగమంతాగా పరిగణిస్తారు. అయితే వైద్యశాస్త్రంలోని శరీర నిర్మాణశాస్త్రం ప్రకారం ముంగాలు భాగాన్ని మాత్రమే కాలుగా పేర్కొంటారు.
రెండు కాళ్లమీద నడిచే చతుష్పాదులలో క్రింది రెండింటిని కాళ్లుగానూ పైనుండే రెండింటిని చేతులు లేదా రెక్కలు గాను పేర్కొంటారు.
Look up కాలు in Wiktionary, the free dictionary.