శరీరం
శరీరం అనగా జీవులకు సంబంధించినది, ప్రతి జీవి వ్యక్తిగత భౌతిక శరీరంతో ఉంటుంది. శరీరాన్ని దేహం అని కూడా అంటారు. శరీరాన్ని ఆంగ్లంలో బాడీ అంటారు. బాడీ అను పదాన్ని తరచుగా ఆరోగ్య విషయాలు, మరణమునకు సంబంధించిన విషయాలు తెలియజేయడానికి ఉపయోగిస్తారు. శరీర కార్యకలాపాల యొక్క అధ్యయనానికి శరీరధర్మశాస్త్రం ఉంది.
మానవ శరీరంసవరించు
మానవ శరీరం ముఖ్యంగా ఒక తల, మెడ, మొండెం, రెండు చేతులు, రెండు కాళ్లు, అలాగే శ్వాసకోశ, రక్తప్రసరణ, కేంద్రీయ నాడీ వ్యవస్థ వంటి అనేక అంతర్గత అవయవ సమూహాలు కలిగి ఉంటుంది.
వ్యత్యాసాలుసవరించు
మనిషి యొక్క మృతదేహన్ని శవం అంటారు. వెన్నెముకగల జంతువుల యొక్క మృతదేహాన్ని కళేబరం అంటారు. కొన్నిసార్లు వెన్నెముకగల జంతువుల, కీటకాల, మానవ మృతదేహాలను కూడా కళేబరాలనే పిలుస్తారు. మృతదేహాన్ని పీనుగ అని కూడా అంటారు. శరీర నిర్మాణం యొక్క అధ్యయనాన్ని శరీర నిర్మాణ శాస్త్రం అంటారు. మాంసాహారం అనగా వధించిన జంతువు దేహం యొక్క శరీరం, దీనిలోని అనవసర భాగాలను తొలగించిన తరువాత దీనిని మాంసంగా ఉపయోగిస్తారు.
మనస్సు లేదా ఆత్మతో శరీరాన్ని పోల్చినప్పుడు శరీరం మనస్సు, దేహం అనే రెండు భాగములని భావిస్తారు. మనస్సు యొక్క భౌతికవాద తత్వవేత్తలు మనస్సు శరీరం నుండి ప్రత్యేకమైనది కాదు అని, అయితే మెదడు మానసికంగా తన విధులు నిర్వర్తిస్తుందని వాదిస్తున్నారు.
ఇవి కూడా చూడండిసవరించు
బయటి లింకులుసవరించు
Look up శరీరం in Wiktionary, the free dictionary. |
Wikimedia Commons has media related to శరీరం. |